Intinti Ramayanam Today Episode October 7th: భానుమతి ఆరాధన స్కూల్ కి తీసుకెళ్తుంటే నేను కూడా వస్తానని వెళ్తుంది. ఈరోజు స్కూల్ డుమ్మా కొట్టి ఊరంతా షికారు చేద్దాం బాబాయి అని అంటుంది. అయితే ఒకచోట ఐస్ క్రీం కనిపించడంతో కమల్ ఎవరికి ఐస్క్రీం కావాలో చెప్తే నేను తీసుకొని వస్తానని అంటాడు. అయితే భానుమతి ఆరోగ్య ఇద్దరు ఐస్క్రీం చెప్తారు వాళ్ళందరూ తింటూ ఉండగా ఆరోగ్య నాకు ఇంకొక ఐస్క్రీం కావాలి అని అడుగుతుంది. కమల్ నేను వెళ్లి తీసుకొని వస్తాను నువ్వు ఇక్కడే ఉండు బంగారం అని అంటాడు కానీ ఆరోగ్యం మాత్రం వినకుండా పరిగెత్తుకుంటూ రావడంతో బైక్ ఆరాధన గుద్దేస్తుంది. అది చూసిన భానుమతి కమల్ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆరాధ్యకు పెద్ద దెబ్బ తగిలిందని కంగారు పడిపోతూ ఉంటారు..
శ్రీకర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఒక లేడీ తనని మోసం చేసింది అని అన్ని వివరాలను చెప్పి. తనపై కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటాడు. అసలేం జరిగిందో చెప్పండి అని అక్కడున్న ఎస్ఐ అడుగుతాడు. మొత్తం విషయాన్ని శ్రీకర్ ఆ పోలీస్ కి చెప్పడంతో అతను కంప్లైంట్ ఫైల్ చేసి విచారణ జరుగుతాను అని అంటాడు. నన్నే మోసం చేసింది అంటే ఇప్పటివరకు ఎంతోమందిని మోసం చేసి ఉంటుంది అలాంటి లేడిని అస్సలు వదలొద్దు అంటూ శ్రీకర్ పోలీసులకు చెప్తాడు..
పల్లవి బాగోతం మొత్తం బయటపడడంతో పల్లవి అందరూ తిడతారు. ఇన్ని రోజులు మారిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇలాంటి దానివని అసలు ఊహించలేదని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే పల్లవి గురించి అన్ని నిజాలు తెలియడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. పార్వతి కూడా పల్లవి కిడ్నాప్ చేయించింది అని అందరు నిజమే అని నమ్ముతారు. ఇక భానుమతి కూడా నిజం తెలియడంతో అందరూ కూడా ఇంట్లో నుంచి గెంటియాలని అనుకుంటారు. కానీ పల్లవి ఇంటి నుంచి వెళ్లిపోవాలని కమల్ కూడా చెప్పడంతో అందరూ కూడా పల్లవిని ఇంటి నుంచి వెళ్లిపోవాలని చెప్తారు.
పల్లవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే మీనాక్షి పల్లవి పల్లవి అని పిలుస్తుంది. అయితే పల్లవి ఎంతసేపటికి రాకపోవడంతో మీనాక్షి నేను కూడా పల్లవితో పాటే వెళ్ళిపోతాను. పల్లవి లేనిచోట నేను కూడా ఉన్నాను. పిల్లలు తప్పు చేస్తే తల్లి కూడా తప్పు చేసినప్పుడే కదా నేను కూడా వెళ్ళిపోతున్నాను. అని మీనాక్షి అంటుంది. అవని ఎంత చెప్తున్నా కదా మీనాక్షి అస్సలు వినకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. మీనాక్షి ఎంత చెప్పినా కూడా వినకుండా అవని పిలుస్తున్నా వినిపించుకోకుండా మీనాక్షి వెళ్లిపోవాలని అనుకుంటుంది. మీనాక్షి వెళ్లిపోతున్న విషయాన్ని చక్రధర్ కు చెప్తుంది. పల్లవితో పాటు మీనాక్షి వెళ్ళిపోతుంది.
పల్లవి రాజేశ్వరి ఇంటికి వెళుతుంది. అయితే అక్కడికి వెళ్ళగానే భరత్ ప్రణతి ఇద్దరు కూడా పల్లవిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు.. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అనేది చెప్పకుండానే భరత్ ఎందుకు వచ్చావు సిస్టర్ అని అడుగుతాడు. కానీ తెలుగు మాత్రం ఏం చెప్పినా కూడా అసలు వినకుండా చక్రధర్ వచ్చి పెద్ద రచ్చ చేస్తాడు. అయితే పల్లవి ఎంత చెప్తున్నా కూడా అసలు వినకుండా అనడంతో చక్రధర్ సీరియస్ అవుతాడు.. అయితే పల్లవి ఎంత చెప్తున్నారు సరే చక్రధర వినకుండా ఉంటాడు అటు భరత్ కూడా పలుకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు.. చక్రధర్ మాత్రం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్తున్నా సరే పల్లవి మాత్రం ఇది నాకు కన్నతండ్రి ఇల్లు నా ఇష్టం. అంటూ ముందుగా ఉంటుంది పల్లవి.. మీనాక్షి కూడా పల్లవికి సపోర్ట్ చేస్తూ ఉండడంతో చక్రధర్ నీకు ఎంత చెప్పినా అర్థం కాదులే నాకు నచ్చి వెళ్ళిపోతాడు.. పల్లవి మాత్రం ప్రణతి పై కోపంగా ఉంటుంది అటు భానుమతి కూడా పల్లవి కోసం అవినీతో గొడవ పడుతుంది. ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఆ తర్వాత పల్లవి ఎలాంటి ప్లాన్లు చేస్తుందో చూడాలి. అవనికి పల్లవి వల్ల కొత్త టెన్షన్అ క్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూడాలి..
Also Read : ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇంటింటి రామాయణం అవుట్..