Nindu Noorella Saavasam Serial Today Episode: పార్థు, మనోహరిల కోసం కులుమనాలి వెళ్తున్న అమర్, మిస్సమ్మలకు వాళ్లు ఎక్కడ స్టే చేస్తున్నారో తెలుస్తుంది. వెంటనే ఆ హోటల్‌కు వెళ్లాలని అమర్ డ్రైవర్‌కు చెప్పగానే.. మిస్సమ్మ అక్కడికి వెళ్లడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతుంది. అందుకు డ్రైవర్ ఉదయం ఆరు గంటల కల్లా అక్కడికి చేరుకుంటామని చెప్తాడు. సరే స్పీడుగా వెళ్లమని చెప్తుంది మిస్సమ్మ.
ఉదయం తెల్లారగానే.. పార్థు నిద్ర లేచి వేడి నీటితో మనోహరికి కాపురం పెడుతుంటాడు. మనోహరి నిద్ర లేచి టైం ఎంత అయిందని అడుగుతుంది. ఉదయం ఆరు కావొచ్చిందని చెప్తూ.. అమర్‌కు ఫోన్ చేస్తాడు. అమర్ ఫోన్ స్విచాప్ వస్తుందని మనోహరికి చెబితే.. ఇప్పుడెందుకు అమర్‌కు ఫోన్ చేస్తున్నావు అని మనోహరి అడుగుతుంది. మనం ఇక్కడ ఉన్నామని చెబుదాం అసలే నిన్నంతా మన ఫోన్ కలవలేదు కదా వాళ్లు కంగారు పడతారు అయినా అమర్ ఫోన్ స్విచాప్ రావడం ఏంటి అయితే భాగీ గారికి ఫోన్ చేస్తాను అంటూ పార్థు కాల్ కలపబోతుంటే.. మనోహరి వద్దని ఆపేస్తుంది.
ఎందుకని పార్థు అడిగితే.. వాళ్లు ఇప్పుడు నిద్రపోతుంటారు కదా వాళ్లను డిస్టర్బ్ చేయకు మనం సన్‌రైజ్ చూసి వచ్చాక చేద్దువు అంటూ అమర్ ఫోన్ కలవడం లేదంటే వాళ్లు ఇప్పుడు మాకు దగ్గరలో ఉన్న ఫారెస్ట్‌లో వస్తుంటారు. వాళ్లు ఇక్కడికి వచ్చే లోపు పార్థును తీసుకుని వెళ్లిపోవాలి అని మనసులో అనుకుంటుంది మనోహరి. వెంటనే సన్‌రైజ్ చూడటానికి వెళ్దామని మనోహరి పార్థుకు చెప్తుంది. ఇంకా ప్రెషప్ కాలేదని పార్థు అంటే అది చూసొచ్చాక అవుదాం అంటూ మనోహరి చెబితే.. సీతారాంను కారు రెడీ చేయమని చెప్తాడు పార్థు. కారు వద్దని నడుచుకుంటూ వెళ్దామని మనోహరి చెబితే.. ఆ స్పాట్ చాలా దూరమని నడుచుకుంటూ వెళ్తే మధ్యాహ్నం అవుతుందని సీతారాం చెప్తాడు. మనోహరి సీతారాంను తిడుతుంది. పార్థు మాత్రం కారు రెడీ చేయమని పంపిస్తాడు. సీతారాం వెళ్లిపోతాడు.
యమలోకంలో ఉన్న గుప్త కింద భూలోకంలో ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తుంటాడు. అప్పుడే నారదడు వచ్చి భాగీ బాలిక చాలా గట్టిదే మనోహరి ఉన్న చోటును కనిపెట్టింది అంటాడు. అయితే కింద ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవాలని గుప్త అడిగితే.. మాయాదర్ఫణం ఉంది కదా అది తెరచి చూడు తెలుస్తుంది అంటాడు నారదుడు. వెంటనే గుప్త మాయాదర్పణం తెరచి మంత్రం చదవగానే.. ఒకవైపు అమర్, మిస్సమ్మ కారులో వెళ్తుంటారు.
మరోవైపు మనోహరి, పార్థు రెడీ అయి సైట్ సీయింగ్ చూడటానికి వెళ్తుంటారు. కొద్ది దూరం వెళ్లాక అమర్ వాళ్లు వెళ్తున్న కార ఆగిపోతుంది. ఇంజన్ వేడెక్కిందని అందుకే ఆగిపోయిందని డ్రైవర్ చెబితే.. అమర్, మిస్సమ్మ కారు దిగి హోటల్ వైపు పరుగెడుతుంటారు. ఇక మనోహరి, పార్థు సైట్ సీయింగ్ ప్లేస్ కు వెళ్లిపోతారు. కారు ఆపిన సీతారాం సార్ ఇక్కడి నుంచి కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్తే ఆ ప్లేస్ వస్తుంది అంటూ చెప్పగానే.. ఎలాగైనా సీతారాం ను ఎవైడ్ చేసి పార్థును చంపేసి ఇక్కడి నుంచి ఎస్కేప్ కావాలి అనుకుంటూ మనోహరి మనసులో ఆలోచిస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.