Virat Kohli Blocked Maxwell on Instagram: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా అగ్రెసివ్ గా ఉంటారు. టీమిండియా కోసం వేలాది పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. ఎవరైనా తన జోలికి వస్తే, వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు. ఎంతటి వాడైనా మైదానంలోనే రివేంజ్ తీర్చుకుంటాడు. అయితే ఒకానొక సమయంలో విరాట్ కోహ్లీ కోపానికి మ్యాక్స్‌వెల్ బలయ్యాడు. తనను గెలికినందుకు.. ఇన్‌స్టాగ్రామ్ లో బ్లాక్ చేశాడని విరాట్ కోహ్లీ పై తాజాగా గ్లెన్ మ్యాక్స్‌వెల్ బాంబు పేల్చారు.
సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్కోసం తాను ఎంత వెతికినా కనిపించలేదని… ఆ తర్వాత తనను కోహ్లీ బ్లాక్ (Virat Kohli Blocked Maxwell on Instagram) చేసినట్టు గుర్తించానని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. విరాట్ కోహ్లీ కి కాస్త బలుపెక్కువ అని… సరదాగా అతనిని గెలికినా, పగ తీర్చుకుంటాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకే తన అకౌంట్ కూడా బ్లాక్ చేశాడని వెల్లడించారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇటీవల ది షో మ్యాన్ అనే పుస్తకాన్ని రాసుకున్నాడు. ఇందులో విరాట్ కోహ్లీ తనను ఇన్‌స్టాగ్రామ్ లో ఎందుకు బ్లాక్ చేశాడనే విషయాన్ని వివరించే ప్రయత్నం చేశాడు.
2017 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియాలోనే జరిగింది. ఈ క్రమంలో రాంచీ వేదికగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఫీల్డింగ్ చేస్తుండగా విరాట్ కోహ్లీ భుజానికి గాయమైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో… విరాట్ కోహ్లీని ట్రోలింగ్ చేసే ప్రయత్నం చేశాడు మ్యాక్సీ మామ. బౌండరీ గేట్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మ్యాక్సీ మామ… విరాట్ కోహ్లీ గాయాన్ని ఎగతాళి చేశాడు. భుజానికి గాయం అయినట్టు ఓవరాక్షన్ చేశాడు. దీనికి సంబంధించిన విజువల్స్ మ్యాచ్ సందర్భంగా ప్లే చేశారు. ఇది చూసిన విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటినుంచి మ్యాక్స్ వెల్ ను దూరం పెట్టాడు.
అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సందర్భంగా మ్యాక్స్ వెల్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఆ సమయంలో విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అయ్యేందుకు మాక్సిమామ ప్రయత్నించాడట. కానీ విరాట్ కోహ్లీ అకౌంట్ మాత్రం అతనికి దొరకలేదని తన పుస్తకంలో రాసుకొచ్చాడు. అనంతరం, స్వయంగా విరాట్ కోహ్లీని ఇన్‌స్టాగ్రామ్ గురించి అడిగేశాడట. అయితే 2017 లో తన భుజం గాయం గురించి ట్రోల్ చేశావు కదా ? అందుకే నిన్ను బ్లాక్ చేసినట్టు విరాట్ కోహ్లీ కూడా ముఖం మీదే చెప్పాడని మాక్సిమామ తెలిపారు. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ తర్వాత అన్ బ్లాక్ కూడా చేశాడట. అయితే 2021లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు డ్రెస్సింగ్ రూమ్ లో తనను కొంతకాలం హీనంగా విరాట్ కోహ్లీ చూశాడని మాక్సిమామ షాకింగ్ నిజాలను పంచుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం పెరిగిందని చెప్పుకొచ్చాడు.