Intinti Ramayanam Today Episode September 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ కాలేజీ ఫ్రెండ్ కావడంతో పార్వతి వాళ్ళిద్దరి సాన్నిత్యం చూసి కుళ్ళుకుంటుంది. నీ భార్యని కూడా పరిచయం చేయమని మేడమ్ అడుగుతుంది. అక్షయ్ మాత్రం అవని దగ్గరికి వెళ్లి వేడుకుంటాడు. మొత్తానికి అవని మాట ప్రకారం అక్షయ్ తన మేడం దగ్గర పొగడ్తల వర్షం కురిపిస్తాడు.. రాజేంద్రప్రసాద్ కు అసలు నిజం చెప్పేస్తుంది అవని.. అవనితో సీక్రెట్ గా మాట్లాడతాడు శ్రీకర్.. అన్నయ్య చేత డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకున్న అతను మనకు ఒకసారి దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడు కదా వదినా.. ఇప్పుడు అతను నా దగ్గరే ఉన్నాడు నా ఫ్రెండ్ ఇంట్లో సేఫ్ గా ఉంచాను. అతని ఇక్కడికి తీసుకొని వస్తే అసలు విషయం బయట పడుతుంది కదా.. పల్లవి వాళ్ళ నాన్న చేస్తున్న మోసాలు బయట పడతాయి కదా అని శ్రీకర్ అంటాడు. ఆ మాటలు పల్లవి విని షాక్ అవుతుంది.. వ్రతం జరిగే సమయంలో ఇవన్నీ ఎందుకు శ్రీకర్ అని అవని అంటుంది. ఇదే మంచి సమయం వదిన.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీకర్, అవనితో మాట్లాడటం విన్న పల్లవి షాక్ అవుతుంది. అంతే కాదు ఇంట్లో తన గురించి తన తండ్రి గురించి నిజం తెలిసి ఇంట్లో నుంచి గెంటేసినట్లుగా కలగంటుంది పల్లవి.. నిజంగానే ఇదంతా జరిగిందని అనుకునేలా ఆ కలని క్రియేట్ చేశారు.. శ్రీకర్ ఏం మాట్లాడవేంటి అని అవనిని అడుగుతాడు. నువ్వు ఏ తప్పు చేయలేదని అమ్మ కూడా తెలుసుకుంటుంది అన్నయ్య నువ్వు మళ్ళీ మనస్పర్ధలు తొలగిపోయి కలుసుకుంటారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు.. అవని ఇప్పుడు ఇలాంటివి చేయడం మంచిది కాదు శ్రీకర్. ఈ పూజ అయిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. కచ్చితంగా ఈరోజు ఏదో ఒకటి చేద్దామని అంటుంది.
ఈ విషయం వెంటనే చక్రధర్తో చెప్పాలని పల్లవి అనుకుంటుంది. డాడ్ మనం ఎవరి చేత అయితే ఆస్తులు పోయేలా సంతకం పెట్టించాము వాడు ఇప్పుడు శ్రీకరికి దొరికాడట.. వాణ్ణి ఇక్కడికి తీసుకొని వస్తారంట. వాడు గనక దొరికితే మన బండారం మొత్తం బయటపడుతుంది.. ఇదంతా చేసింది మనమే అని తెలిసిపోతుంది.. నేను ఊహించినట్లే నన్ను ఇంట్లో ఉండనివ్వడు. అని పల్లవి చక్రధర్తో అంటుంది.. ఆ మాట వినగానే చక్రధర్ నవ్వుతాడు.
డాడ్ నేను ఇంత సీరియస్ మేటర్ చెప్తుంటే నువ్వేంటి నవ్వుతున్నావు. ఇంత కూల్ గా ఉన్నావ్ ఏంటి అని అంటుంది. ఆ వ్యక్తిని శ్రీకర్ కి దొరికేలా చేసింది నేను. ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే ఊహించుకోవచ్చు అని చక్రధర్ అంటాడు. ఏం చేస్తున్నారు నాకు అర్థం కాలేదు డాడీ. ఒకసారి ఏమైందో చెప్పండి అని అడుగుతుంది పల్లవి. కానీ చక్రధర్ శ్రీకర్ని ఫంక్షన్ లో ఉండకుండా చేస్తానని చెప్పాను కదా ఖచ్చితంగా అలానే చేస్తానని అంటాడు.. ఏం జరుగుతుందో నువ్వు చూడు బేబీ కూల్గానే అంటాడు.
అయితే అక్షయ్ వాళ్ళ బాసు అందరికీ గిఫ్ట్లు తీసుకొస్తుంది.. ప్రణతి భరత్ల కోసం ఉంగరాలను తీసుకొస్తుంది. అవనికి చీర తీసుకొచ్చి ఇస్తుంది. అవినీకి చీర ఇవ్వడం చూసి శ్రియ పల్లవి ఇద్దరు కుళ్ళు కుంటారు. నువ్వు ఈ వ్రతానికి ఈ చీర కట్టుకు రావాలని ఆమె చెబుతుంది. వెంటనే అక్షయ దగ్గరకి వెళ్లి అడుగుతుంది.. అక్షయ్ చీరను తీసుకోమని చెప్తాడు. అవని అక్షయ్ ని పిలుస్తుంది.. నాకు మీరి చీర కడితేనే నేను ఈ చీర కట్టుకుంటాను అని అంటుంది. అందరూ చూస్తున్నారు ఇప్పుడు నీతో వస్తే ఏదో అనుకుంటారని అక్షయ్ అంటాడు. అయితే నాకు ఐ లవ్ యు చెప్పండి అని అంటుంది.
Also Read : మనోజ్ కి దిమ్మతిరిగే షాక్.. అర్ధరాత్రి ప్రభావతి ఇంట్లో దెయ్యం.. జంబలకడి పంబ సీన్ రిపీట్..
మొత్తానికి అక్షయ్ ని ఒక ఆట ఆడుకుంటుంది. అవని.. ఆ తర్వాత వ్రతంలో కూర్చొని అవని దగ్గరికి అక్షయ్ వెళ్లి అడిగితే బెట్టు చేస్తుంది.. నేను కచ్చితంగా కూర్చొని అంటుంది. మొత్తానికి అక్షయ్ ఐ లవ్ యు చెప్పడంతో అవని వచ్చి పూజలో కూర్చుంటుంది.. పూజ జరుగుతున్న సందర్భంలో పోలీసులు ఇంటికి రావడం చూసి అందరూ షాక్ అవుతారు.. శ్రీకర్ ఒకతని బెదిరించి మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారంటూ పోలీసులు అతని అదుపులోకి తీసుకుంటారు.. అవని రాజేంద్రప్రసాద్ అందరూ ఎంత చెప్పినా సరే వినకుండా అతని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…