BigTV English

Brahmamudi Serial Today September 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యను క్షమించమన్న రాజ్‌ – ఎమోషనల్‌ అయిన కావ్య

Brahmamudi Serial Today September 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యను క్షమించమన్న రాజ్‌ – ఎమోషనల్‌ అయిన కావ్య
Advertisement

Brahmamudi serial today Episode: పైకి రూంలోకి కావ్య దగ్గరకు వెళ్లిన రాజ్‌ ఎమోషనల్‌ అవుతాడు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా భార్యగా అంగీకరించాలని నేనేదో గొప్పవాణ్ని అనుకున్నాను. రెండు కుటుంబాల పరువు కాపాడటం కోసం తల వంచుకుని తాళి కట్టించుకుని ఈ ఇంటికి వచ్చి ఈ కుటుంబంలోని అందరి మనస్సులు గెలుచుకున్నావు. నా కోపాన్ని సహించావు. నా మూర్ఖత్వాన్ని భరించావు. అఖరికి నేను చనిపోయానని సాక్ష్యాలు కళ్ల ముందు కనిపిస్తున్నా.. బతికే ఉన్నానని నమ్మి తిరిగి ఇంటికి తీసుకొచ్చేలా చేసి మళ్లీ నీ ప్రేమే గొప్పది అనేలా చేశావు.


గతాన్ని మర్చిపోయి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరని ఏ భర్త వేయని నింద వేసినా కేవలం నా ప్రాణం కాపాడటం కోసం మౌనంగా భరించావు. నీ ఆత్మాభిమానన్ని నా ప్రాణానికి పణంగా పెట్టేశావు. కన్నతల్లే నేను నీ మీద వేసిన నిందలను తట్టుకోలేక నోరు జారి నిజం చెప్పేసినా నువ్వు మాత్రం మౌనంగా నిలబడ్డావు. ఎందుకు కళావతి ఎందుకు ఇదంతా చేస్తున్నావు.. అందుకే ఇప్పుడు చెప్తున్నాను కళావతి కొండంత నీ ప్రేమ ముందు నా ప్రేమ అణువంతం నీ ముందు ఓడిపోయింది కళావతి. గతంలో నేను చేసిన తప్పులను క్షమిస్తావా..? తిరిగి నన్ను అంతే ప్రేమిస్తావా..? అంటూ ఎమోషనల్‌ గా అడగ్గానే.. కావ్య ఏడుస్తూ.. వెళ్లి రాజ్‌ను హగ్‌ చేసుకుంటుంది.

తర్వాత రాహుల్ చిప్ప పట్టుకుని ఇంత కూరుంటేయమ్మో అంటూ పాట పాడుతూ రుద్రాణి దగ్గరకు వెళ్తాడు. రుద్రాణి కోపంగా ఏయ్‌ ఆపు అంటుంది. ఏంటి పాట నచ్చలేదా మామ్‌ అయితే ఇంకోటి పాడనా..? అంటాడు. ఏం అక్కర్లేదు.. అయినా చేతిలో ఈ బొచ్చేంటి… ఆ పాటేంటి.. ఏదో అడుక్కునే వాడిలాగా నీకేమైనా పిచ్చిపట్టిందా..? అని అడుగుతుంది. పిచ్చి నాకేం పట్టలేదు మామ్‌ ఇప్పుడే నాకోక పిచ్చి క్లారిటీ వచ్చింది అంటాడు రాహుల్‌. ఏమని వచ్చింది అని రుద్రాణి కోపంగా అడగ్గానే.. మన ఫ్యూచర్‌ ఇదే అని ఇంకొద్ది రోజులు ఆగామంటే. అప్పుడు ఇంట్లో వాళ్లు నీకో బొచ్చ నాకో బొచ్చ ఇచ్చి  ఏ గుడి మెట్ల దగ్గరో అడుక్కోమని గెంటేస్తారు. అప్పుడు ఇద్దరం కలిసి అడుక్కుంటాము అంటాడు.


దీంతో రుద్రాణి కోపంగా చెప్పు తీసి కొడతా చెత్త నా కొడకా.. మనకు అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందిరా..? నువ్వు ఈ దుగ్గిరాల ఇంటి వారసుడివిరా..! వందల కోట్ల ఆస్థికి అధిపతివి నువ్వు.. సుఫ్రీంవి నువ్వు అంటుంది. దీంతో రాహుల్‌ ఇదిగో ఇలాంటి మాటలు చెప్పే నన్ను ఇలా తయారు చేశావు. చక్కగా ఎలాంటి ఆశలు ఏ కోరికలు లేకుండా ప్రశాంతంగా ఉన్న వాడిని తీసుకొచ్చి ఈ ఇంటి వారసుడిని.. కంపెనీకి అధిపతిని చేస్తానన్నావు. కనీసం క్లర్క్‌ ను కూడా చేయలేకపోయావు.  ఇప్పుడేమో సుఫ్రీం అంటున్నావు.. కనీసం సూప్‌ తాగడానికి కూడా డబ్బులు లేవు అంటూ వెటకారంగా మాట్లాడతాడు. వస్తాయి రాహుల్‌ టైం వచ్చినప్పుడు అన్ని వాటంతట అవే వస్తాయి. నువ్వు చూస్తూ ఉండు ఎప్పుడేం చేయాలో నేను చూసుకుంటాను అంటుంది రుద్రాణి.

దీంతో రాహుల్ మరింత వెటకారంగా ఏంటి నువ్వు చూసుకునేది ఏపిసోడ్‌ వన్‌ నుంచి చూసుకుంటాను చూసుకుంటాను అంటున్నావు. ఇప్పటికే 800 ఏపిసోడ్స్‌ ఎగిరిపోయాయి. ఇప్పుడు సేమ్‌ డైలాగా..? ఇప్పటి వరకు రాజ్‌ లేకపోతేనే ఏమీ చేయలేకపోయావు.. ఇప్పుడు రాజ్‌  తిరిగి వచ్చేశాడు. కావ్య కడుపులో వారసుడు పెరుగుతున్నాడని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఆ వారసుడు బయటకు వస్తే మనల్ని బయటకు గెంటేస్తారు అంటూ రాహుల్‌ అనగానే.. అందాక రాణిస్తే నేను రుద్రాణిని  ఎందుకు అవుతాను రాహుల్‌. చచ్చాడనుకున్న రాజ్‌ తిరిగొచ్చినా… తన భార్యను తాను మళ్లీ గుర్తు పట్టినా డోంట్‌ కేర్‌ నిన్ను ఈ ఇంటి వారసుణ్ని చేస్తానని మాటిచ్చాను చేసి చూపిస్తాను.. అంటుంది. అలా చేస్తే ఆ రాజ్‌ గాడు చూస్తూ ఊరుకుంటాడా మామ్‌ అంటాడు. ఊరుకోడు కచ్చితంగా ఊరుకోడు.. అందుకే నిన్ను వారసుణ్ని చేయడానికి ముందే వాళ్లను ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాను అంటుంది రుద్రాణి.

తర్వాత కావ్య కింద నుంచి రూంలోకి వెళ్తుంటే.. కడుపుతో ఉన్న నువ్వు నడుచుకుంటూ వెళ్లొద్దని రాజ్‌, కావ్యను ఎత్తుకుని పైకి తీసుకెళ్తాడు. వాళ్లను చూసిన అప్పు కూడా తాను పైకి నడవనని తనను ఎత్తుకుని వెళ్లమని కళ్యాణ్‌ ను అడుగుతుంది. అంత సాహసం నేను చేయలేనని అంటాడు కళ్యాణ్‌. దీంతో ఇందాకా మీ అన్నయ్యా ఎంత ప్రేమగా మా అక్కను తీసుకెళ్లాడో చూశావా..? అంటూ కోప్పడుతుంది. దీంతో కళ్యాణ్‌ కూడా అప్పును ఎత్తుకుని పైకి వెళ్తాడు.

తర్వాత కళ్యాన్‌ మెట్ల మీద కూర్చుని ఆలోచిస్తుంటే.. రాజ్‌ వస్తాడు. కళావతి రోజూ మెట్ల ఎక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ.. కిందకు వస్తుంటాడు. రాజ్‌ను చూసి కళ్యాణ్‌ ఎందుకు వదినను ఎత్తుకెళ్లావు నీకు వదిన మీద అంత ప్రేమ ఉంటే రూంలో చూసుకోవాలి కానీ నీ వల్ల నా పరిస్థితి ఎలా అయిందో తెలుసా…? అంటూ నడుములు పట్టేశాయని బాధపడుతుంటాడు. అయితే ఈ మొయ్యడం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేద్దాం అని ఆలోచిస్తారు. లాస్ట్‌కు కింద ఉన్న తమ అమ్మా నాన్నలను పైన బెడ్‌రూంల్లోకి పైన తాము కింద రూముల్లోకి సిప్ట్‌ అయితే సరి అనుకుంటారు. అదే విషయం పెద్ద వాళ్లకు చెప్తారు. దీంతో వాళ్లందరూ షాక్‌ అవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Big tv Kissik Talks: బిగ్ బాస్ హౌస్ పాములు.. పులుల అరుపులు షాకింగ్ విషయాలు బయటపెట్టిన హరితేజ!

Big tv Kissik Talks: ఎన్టీఆర్ తో హరితేజ గొడవ…  డైరెక్టర్లకు వార్నింగ్ ఇచ్చిన తారక్?

Big tv Kissik Talks: ప్రెగ్నెన్సీ టైంలో కోవిడ్.. హరితేజ ఇంత నరకం అనుభవించిందా..దేవుడా?

Rekha Boj: మొన్న గాజులు.. నేడు కిడ్నీలు.. పాపం పట్టించుకోండయ్యా!

Illu Illalu Pillalu Today Episode: కొడుకుల కోసం కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు.. నర్మదతో సాగర్ గొడవ.. ప్రేమకు గుడ్ న్యూస్..

Intinti Ramayanam Today Episode: పల్లవిపై కమల్ సీరియస్.. అవని మాటతో కూల్.. పల్లవి షాకింగ్ నిర్ణయం..?

Nindu Noorella Saavasam Serial Today october 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  పిల్లలను మిస్సమ్మ మీదకు రెచ్చగొట్టి పంపిస్తున్న మనోహరి

Brahmamudi Serial Today October 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌కు షాక్‌ ఇచ్చిన తాగుబోతు  

Big Stories

×