E-Paper
Advertisement

KTM 390 అడ్వెంచర్ X ధర పెంపు, ఇప్పుడు కాస్ట్ ఎంత అంటే?

KTM 390 అడ్వెంచర్ X ధర పెంపు, ఇప్పుడు కాస్ట్ ఎంత అంటే?
Advertisement

KTM 390 Adventure X Price Hike: KTM ప్రముఖ అడ్వెంచర్ మోటార్‌ సైకిల్ 390 అడ్వెంచర్ X ధరను పెంచింది. కంపెనీ ఈ బైక్ ధరపై రూ.7,000 పెంపు ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఈ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.3.50 లక్షలకు చేరుకుంది. అయితే, ధర మాత్రమే పెరిగింది తప్ప, బైక్‌లో ఎలాంటి కొత్త మెకానికల్ అప్‌డేట్లు,  డిజైన్ మార్పులు చేయలేదు. కంపెనీలు సాధారణంగా రా మెటీరియల్స్ ధరలు, తయారీ ఖర్చులు, ట్రావెల్ వ్యయాలు పెరిగినప్పుడు వాహనాల ధరలను పెంచుతాయి. KTM కూడా అదే కారణంతో 390 అడ్వెంచర్ X ధరను పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బైక్ పనితీరు, ఇంజిన్, ఫీచర్లు అన్నీ గతంలో ఉన్న మోడల్ మాదిరిగానే కొనసాగుతున్నాయి.

ఫీచర్ల గురించి..

ఫీచర్ల పరంగా చూస్తే, 390 అడ్వెంచర్ X అడ్వెంచర్ టూరింగ్‌ను ఇష్టపడే రైడర్ల కోసం తయారైంది. ఇందులో IMU ఆధారిత కార్నరింగ్ ABS, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ లాంటి ఆధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. బైక్ మలుపుల్లో కూడా మంచి స్థిరత్వాన్ని అందించేలా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. అలాగే, ఈ బైక్‌లో స్ట్రీట్, రెయిన్, ఆఫ్ రోడ్ అనే మూడు రైడింగ్ మోడ్‌ లు ఉన్నాయి. రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా రైడర్ వీటిని మార్చుకోవచ్చు. సిటీ రోడ్లు, వర్షం, ఆఫ్ రోడ్ ట్రిప్‌ లలో ఈ మోడ్‌ లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి. దూర ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడే మరో ముఖ్యమైన ఫీచర్ క్రూజ్ కంట్రోల్. దీని సహాయంతో ఒకే వేగాన్ని నిరంతరం కొనసాగించవచ్చు. దీంతో హైవేల్లో ఎక్కువ దూరం ప్రయాణించే సమయంలో రైడర్‌ కు అలసట కొంత తగ్గుతుంది.

ఇంజిన్ గురించి..

Advertisement

KTM 390 అడ్వెంచర్ Xలో 399cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 45 bhp పవర్, 39 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సిటీ ప్రయాణంతో పాటు హైవేలు, కొండ ప్రాంతాల్లో కూడా బైక్ మంచి పనితీరును అందిస్తుంది. ఈ మోటార్‌ సైకిల్‌ అడ్వెంచర్ లుక్‌తో పాటు బలమైన నిర్మాణం కలిగి ఉంటుంది. ఇందులో అల్లాయ్ వీల్స్, 200 మిల్లీమీటర్ల ట్రావెల్ కలిగిన WP నాన్ అడ్జస్టబుల్ సస్పెన్షన్, అలాగే డ్యూయల్ డిస్క్ బ్రేకులు, ABS ఉన్నాయి. ఇవి వివిధ రకాల రోడ్లపై మెరుగైన నియంత్రణను అందిస్తాయి.

టెక్నాలజీ పరంగా కూడా ఈ బైక్‌లో మంచి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో TFT డిస్‌ప్లే, స్విచ్చబుల్ ట్రాక్షన్ కంట్రోల్, క్విక్‌షిఫ్టర్ లాంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ఇవి రైడింగ్ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా, స్మూత్‌గా మారుస్తాయి. బైక్ బరువు 181 కిలోలు మాత్రమే ఉండటంతో కంట్రోలింగ్ ఈజీగా ఉంటుంది. అలాగే 14.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉండటం వల్ల లాంగ్ రైడ్‌ లలో తరచూ ఫ్యూయల్ నింపాల్సిన అవసరం తగ్గుతుంది.

Advertisement

Read Also: జస్ట్ రూ.99 వేలకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏంతో తెలిస్తే మతిపోవాల్సిందే!

Tags

Related News

జస్ట్ రూ.99 వేలకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏంతో తెలిస్తే మతిపోవాల్సిందే!

టాటా నెక్సాన్ కామో ఎడిషన్ లాంచ్.. వారెవ్వా.. ఏం ఫీచర్లు గురూ!

టెస్లా, BYDలకు షాక్.. భారత ఈవీలకు ప్రపంచ గుర్తింపు!

తెలుగు రాష్ట్రాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లతో డబ్బే డబ్బు.. ఇలా చేస్తే చాలు!

వాహనాలకు ఇన్సురెన్స్ అవసరమా? దాని వల్ల ఉపయోగాలేంటీ?

ఈవీ మార్కెట్ లో టీవీఎస్ దూకుడు.. జస్ట్ 7 నెలల్లో 3 లక్షలకుపైగా స్కూటర్ల సేల్!

కియా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.5 లక్షల తగ్గింపు!

Big Stories

Advertisement
×