E-Paper
Advertisement

లేడీ గెటప్స్ వెనుక శాంతి స్వరూప్ కన్నీటి కథ.. అసలు కారణం ఇదే!

లేడీ గెటప్స్ వెనుక శాంతి స్వరూప్ కన్నీటి కథ.. అసలు కారణం ఇదే!
Advertisement

Bigtv kissik talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిషాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కిసిక్ టాక్స్ షో ఒకటి .ఈ కార్యక్రమంలో ఈ వారం మనల్ని ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేసాడు జబర్దస్త్ ఫెమ్ శాంతి స్వరూప్ .ఈ ఇంటర్వ్యూలో శాంతి స్వరూప్ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా లేడీ గెటప్స్ ఎందుకు వేయాల్సి వచ్చిందో ఆయన చెప్పిన విషయం చాలామందిని కదిలిస్తోంది. ఆ ఇంటర్వ్యూలో ఆయన తన జీవితంలో పడ్డ కష్టాల గురించి చెప్తూ బాగా ఎమోషనల్ అయ్యాడు.

ఇండస్ట్రీకి రాకముందు ఆయన పరిస్థితి నిజంగా చాలా దారుణంగా ఉండేదట. ఉండటానికి ఇల్లు లేదు, కనీసం తినడానికి తిండి కూడా సరిగ్గా దొరకలేదట. గుడులు, చర్చిలలో ఇచ్చే ప్రసాదాలు తింటూ రోజులు గడిపానని, రాత్రిళ్లు షాపుల ముందు అరుగుల మీద పడుకున్నానని ఆయన గుర్తు చేసుకున్నారు.

Advertisement

ఎవరి దగ్గరా డబ్బులు లేకపోవడంతో
అలాగే తన జీవితంలో 2007లో తండ్రి చనిపోయిన రోజుని తలుచుకుంటూ చాలా బాధపడ్డారు. నాన్న చనిపోతే అంత్యక్రియలు చేయడానికి కూడా జేబులో కనీసం రెండు వేల రూపాయలు లేవని, ఐదుగురు అన్నదమ్ములు ఉన్నా ఎవరి దగ్గరా డబ్బులు లేకపోవడంతో అప్పు చేసి నాన్న అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని కన్నీళ్లు పెట్టుకున్నారు.
కుటుంబాన్ని, కన్నతల్లిని పోషించుకోవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకున్నానని శాంతి స్వరూప్ చెప్పారు. అందుకోసమే విగ్గులు పెట్టుకుని, చీరలు కట్టుకుని లేడీ గెటప్స్ వేసి నటించాల్సి వచ్చిందట. తనకు ఆ గెటప్స్ వేయడం సరదా కాదని, కేవలం బతకడానికి, జీవనోపాధి కోసమే ఆ పని చేశానని స్పష్టం చేశారు.

పేరు, డబ్బు రావాలని కొందరు తప్పు దారులు
ఇక ఇండస్ట్రీలో విషయాల గురించి మాట్లాడుతూ.. తొందరగా పేరు, డబ్బు రావాలని కొందరు తప్పు దారులు తొక్కుతుంటారని, అవకాశాల కోసం కాంప్రమైజ్ కావడం అస్సలు మంచిది కాదని చెప్పారు. అయితే, అమ్మాయిల గురించి ఆయన చెప్పిన కొన్ని మాటలు మాత్రం సోషల్ మీడియాలో చిన్నపాటి చర్చకు దారితీశాయి. అందరినీ ఒకేలా మాట్లాడటం కరెక్ట్ కాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం తన పరిస్థితి గురించి చెప్తూ ఆయన చాలా ఆవేదన చెందారు. తనకు ఎప్పుడైనా అనారోగ్యం వస్తే ఆస్పత్రికి తీసుకెళ్లడానికి పక్కన ఎవరూ ఉండరని, తానే స్వయంగా ఫోన్ లో క్యాబ్ బుక్ చేసుకుని హాస్పిటల్ కి వెళ్తుంటానని బాధపడ్డారు.తెర మీద అందరినీ నవ్వించే వాళ్ళ వెనుక కూడా ఎన్నో కన్నీళ్లు, కష్టాలు ఉంటాయనేదానికి శాంతి స్వరూప్ జీవితమే ఒక ఉదాహరణ.

Advertisement

also read:ఆగస్టు 15 వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. నిహారిక, లావణ్య స్పెషల్ అట్రాక్షన్
ఇక ఈ విషయాలన్నింటిపై మరింత క్లారిటీ రావాలంటే ఆదివారం రాత్రి 8 గంటలకి బిగ్ టీవీలో టెలీకాస్ట్ కానున్న ఫుల్ ఇంటర్వ్యూ చూడాలసిందే !

Tags

Related News

మా బంధం ముగిసిపోయింది..రీతూ – పవన్ బ్రేకప్.. ఏమైందంటే..?

Illu Illaalu pillalu Srivalli : శ్రీవల్లి అవుట్.. చందుకు కొత్త జోడిగా ఎవరంటే..?

Illu Illalu Pillalu Today Episodes: భద్రకు ప్రేమ దిమ్మతిరిగే షాక్.. తండ్రిగా మారిన తిరుపతి.. వల్లికి కొత్త టెన్షన్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని మోసం చేసిన పల్లవి.. పార్వతికి పల్లవి పై అనుమానం.. కమల్ కు షాక్..

Ninnu kori Serial Today Episode September 30th ‘నిన్ను కోరి’ సీరియల్‌: రైస్ మిల్లు లెక్కల్లో రెండు లకలు తేడా చూపించిన చంద్ర  

Intinti Ramayanam Pallavi : పల్లవికి ఏమైంది..? ఇది అసలు ఊహించలేదు..

Illu illaalu pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Wedensday Tv Movies : బుధవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Big Stories

Advertisement
×