E-Paper
Advertisement

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల భూమిని కాజేసేందుకు.. బిగ్ స్కెచ్చేసిన అక్రమార్కులు!

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల భూమిని కాజేసేందుకు.. బిగ్ స్కెచ్చేసిన అక్రమార్కులు!
Advertisement

Government Land: హుజూరాబాద్ పట్టణం గణేష్‌నగర్ సర్వే నంబర్ 236లోని కోట్ల రూపాయల విలువైన దాదాపు 4 ఎకరాల ప్రభుత్వ భూమిని అనర్హులు, సంపన్నులు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులే కబ్జా చేసేందుకు తెగబడుతున్నారని ముదిరాజ్ మహాసభ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆర్డీవో జాల కుమారి, తహసీల్దార్ నరేందర్‌లకు శుక్రవారం ఆయన వినతిపత్రం అందజేశారు.

ప్రభుత్వం మారడంతో..

ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ.. 24 ఏళ్ల క్రితం కొందరు అక్రమార్కులు అధికారులను మచ్చిక చేసుకుని తలా 10–15 గుంటల భూమికి పాసుపుస్తకాలు పొందినా ఎన్నడూ సాగు చేయలేదన్నారు. నిరుపేదల డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కోసం గత ప్రభుత్వం ఈ భూమిని స్వాధీనం చేసుకుందని గుర్తుచేశారు. ప్రభుత్వం మారడంతో అదను చూసి, గతంలో నోటీసులు తీసుకుని భూమిని అప్పగించినవారే.. ఇప్పుడు కొందరు అధికారుల అండతో మళ్లీ దొడ్డిదారిన పట్టాలు పొందేందుకు యత్నిస్తుండటం దారుణమన్నారు. పట్టణంలో చెరువులు, వాగులు, ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జాలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Also read: బీఆర్ఎస్ భూ కేటాయింపులపై సర్కార్ ఉక్కుపాదం.. పూర్తిస్థాయి విచారణకు ఆదేశం!

ఆర్డీవో హామీ..

ఈ దురాక్రమణలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి ఉద్యోగులు, అనర్హులపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఆ స్థలాన్ని కాపాడి నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా ఇచ్చి ‘ఇందిరమ్మ ఇళ్లు’ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడతామని ఆర్డీవో హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకుడు షేక్ కౌసర్ (లడ్డూ) తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: లేడీ గెటప్స్ వెనుక శాంతి స్వరూప్ కన్నీటి కథ.. అసలు కారణం ఇదే!

Tags

Related News

హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్.. జలమండలి పేరుతో నకిలీ సందేశాలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని

తెలంగాణలో ఊపందుకున్న ఎన్నికల వేడి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే, పార్టీ హైకమాండ్ ప్రకటన

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ!

డిప్యూటీ సీఎం శాఖలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ సంచలన ఆరోపణలు!

గద్వాల్ మున్సిపాలిటీలో.. ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ సస్పెన్షన్‌?

పోలీసులు మళ్లీ కొడతారనే భయంతో.. ఓ యువకుడు ఆత్మహత్య!

13 ఏళ్ల బాలుడిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి!

ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. పరారీలో యవకుడు!

Big Stories

Advertisement
×