CM Chandrababu: వైసీపీ నేతలకు అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు సవాలు విసిరారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని పిలుపునిచ్చారు. డీఎస్సీలో అక్రమాలంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై సాక్ష్యాలు బయటపెట్టాలని పట్టుబట్టారు. సభకు రాకుండా రోడ్లపై నిససనలు చేయడమేంటని ప్రశ్నించారు. అసెంబ్లీకి వస్తే దొరికిపోతారని వైసీపీ నేతలకు భయమన్నారు. అవకతవకలను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రభుత్వం సహించదని పేర్కొన్నారు.
మరోవైపు అసెంబ్లీలో ఎల్ నినో ప్రభావం గురించి కూడా సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. సాధారణ వర్షపాతం కంటే తీవ్రమైన లోటు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా ఎల్ నినో పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
సాధారణంగా జూన్-డిసెంబర్ మధ్య 867 మిల్లీ మీటర్ల వర్షపాతం పడాల్సి ఉంటే కేవలం 557 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదవుతుందని అంచనా ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానుందని స్పష్టం చేశారు. కొన్ని జిల్లాల్లో జులై నెలలో 68 శాతం లోటు వర్షపాతం నమోదైందన్నారు. ఆగస్టు నెలలో 35 శాతం, సెప్టెంబర్ నెలలో 35 శాతం, అక్టోబర్‌లో 25 శాతం, నవంబర్‌లో 20 శాతం మేర వర్షపాత లోటు ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.
Also Read: బీజేపి కొత్త కార్యవర్గం.. జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురంధేశ్వరి.. స్మృతి ఇరానీకి కీలక పదవి!
అయితే డిసెంబర్ లో మాత్రం 1 శాతం అదనపు వర్షపాతం నమోదువుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే వివిధ బేసిన్లలో వివిధ బేసిన్లల్లో జలాలు తగ్గిపోతున్నాయని.. ప్రాజెక్టులు, రిజర్వాయర్లల్లో జలాలు అడుగంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలానికి ఈపాటికి 753 టీఎంసీల నీరు రావాల్సి ఉంటే.. ఈసారి 214 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ల రిజర్వాయర్లు నిండిన తర్వాత ఏపీకి నీళ్లు వచ్చే పరిస్థితి ఉందన్నారు. దీనివల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు నీరు తక్కువగా వస్తోందన్నారు. గోదావరి బేసిన్లో కూడా జలాల లభ్యత తక్కువగా ఉందని సభలో చంద్రబాబు వివరించారు.
Also Read: Vi బంపరాఫర్.. రూ.160 లోపే బెస్ట్ కాంబో ప్యాక్స్.. ఫ్రీ కాల్స్, డేటా ఆఫర్లు!