E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode August 24th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  ఐశ్వర్యను రెచ్చగొట్టి ట్రాప్ చేసిన ఇందు     

Brahmamudi Serial Today Episode August 24th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  ఐశ్వర్యను రెచ్చగొట్టి ట్రాప్ చేసిన ఇందు     
Advertisement

Brahmamudi serial today Episode: ఐశ్వర్యను పిలిచిన రేఖ ఇంట్లో పార్టీ చేయోద్దని చెబితే.. ఎందుకని అడుగుతుంది ఐశ్వర్య. ఇందు మరోసారి నీ చెంప చెల్లుమనిపిస్తుందేమోనని చెల్లెమ్మ ఉద్దేశం అంటూ శేషు చెబితే.. అంటే దానికి భయపడి పార్టీ మానుకోవాలా..? అయినా ఆంటీ ఆస్థలో నాకు రావాల్సిన లభాలు వాటా ఇందు నాకు ఇవ్వడం లేదు అందుకే పార్టీ చేస్తున్నాను.. ఇక్కడ ఏం జరిగినా చూస్తూ ఉండండి అంతే కానీ మీరు మాత్రం నాకు అడ్డు పడకండి.. ఈరోజు ఆ ఇందు తలకెక్కిన పొగరు మొత్తం దించబోతున్నా.. అంటూ చెప్పి వెళ్లిపోతుంది. భ్రమరాంబ మెల్లగా రేఖ నువ్వు పెట్టిన మంట కార్చిచ్చులా మారబోతుంది అని చెప్తుంది. శేషు మనసులో తనకు అయితే వేరేలా అనిపిస్తుందే.. సరే మనకెందుకు ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటాడు.

హాస్పిటల్‌లో డాక్టర్‌ను కలిసి బయటకు వచ్చిన తర్వాత ఇందు, రాజుకు థాంక్స్‌ చెప్తుంది. నాకెందుకు ఇదంతా డాక్టర్‌ గారి వల్లే కదా..? అని రాజు చెబితే.. కానీ ఈ డాక్టర్‌ దగ్గరకు తీసుకొచ్చింది నువ్వే కదా..? ఈ సిటీలో ఏ డాక్టర్‌ దగ్గరకు వెళ్లినా తాతయ్య నడవడం కష్టం అనేవారు.. ఒక గొప్ప మనిషి ఏ చలనం లేకుండా అలా కూర్చుండిపోయారని రోజంతా బాధపడేదాన్ని.. అలాంటి వ్యక్తి ఇప్పుడు నడుస్తాడు అని చెప్పగానే.. సంతోషంగా ఉంది. ఇంత మంచి డాక్టర్‌ దగ్గరకు తీసుకొచ్చావు చాలా థాంక్స్‌ అంటూ చెప్పగానే.. రాజు పద అంటూ ఇద్దరూ వెళ్లిపోతారు.

Advertisement

ఐశ్వర్య ఫ్రెండ్స్‌ అందరూ వస్తారు. సాంగ్స్‌ పెట్టుకుని డాన్స్‌ చేస్తుంటారు. సాంగ్స్‌ సౌండ్‌కు రూంలో ఉన్న అపర్ణ, సుభాష్‌, స్వాతి చూస్తారు. పై నుంచి రేఖ, భూషణ్‌, భ్రమరాంబ, శేషు చూస్తుంటారు. రేఖ నీ ఐడియా బాగుంది. ఇదే కదా నీకు కావాల్సింది అని భ్రమరాంబ అడిగితే.. ఇది కాదు నేను కోరుకునేది.. ఆ అక్కాచెళ్లెళ్ల మధ్య జరిగే గొడవ చూడాలి అని చెప్పగానే.. ఇప్పుడు ఆ ఇందు వచ్చి ఏం చేస్తుంది.. ఒక మూలన కూర్చోవడం తప్పా అంటూ భ్రమరాంబ చెప్పగానే.. ఒకప్పటి ఇందు అయితే అలా కూర్చునేది.. కానీ ఇప్పుడు వేరే జరుగుతుంది. నాకెందుకో మీకు రివర్స్‌ అవుతుందేమో అనిపిస్తుంది అంటూ శేషు చెప్తాడు. ఇంతలో అపర్ణ వెళ్లి ఐశ్వర్యను ఆపాలని చూస్తుంది. ఐశ్వర్య వినదు.. సౌండ్‌ ఇంకా ఎక్కవ పెట్టుకుని డాన్స్‌ చేస్తూ.. అపర్ణను వెళ్లిపోమ్మని చెప్తుంది.

ఇంతలో రాజు, ఇందు వస్తారు. ఇందు, ఐశ్వర్య మధ్య గొడవ జరుగుతుంది. ఇందు కోపంగా నీకు ఆత్మాభిమానం ఉంది. ఎవ్వరి దగ్గర తల వంచను.. ఎవ్వరి దగ్గర డబ్బుల కోసం చేయి చాచను అంటావు ఇదేనా నీ ఆత్మాభిమానం అంటూ ప్రశ్నిస్తే అందరినీ వెళ్లిపోమ్మని చెప్తుంది ఇందు. ఐశ్వర్య కోపంగా ఎవ్వరు వెళ్లొద్దు అందరూ ఇక్కడే ఉండండి పార్టీ కంటిన్యూ చేద్దాం.. ఇదేం చేస్తుందే నేను చూస్తాను అంటూ తిడుతుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. తనకు కంపెనీలో వాటా ఇవ్వాలని చెప్తుంది. అలా వాటా ఇవ్వాలంటే ముందు నువ్వు డిగ్రీ పాస్‌ అవ్వాలి అని ఇందు కండీషన్‌ పెడితే.. డిగ్రీ పాస్‌ అయితే వాటా ఇస్తావా..? అని అడిగితే.. కచ్చితంగా ఇస్తాను అంటూ ఇందు చెప్తుంది. రేఖ భయంగా ఇందు ఏదో ప్లాన్‌ చేసింది. ఐషును ట్రాప్‌ చేస్తుంది. వెంటనే ఐషును పంపించేయాలి అని మనసులో అనుకుంటూ ఐషు ఇది జరిగే పని కాదు కానీ ఇక్కడి నుంచి వెళ్లిపో అంటుంది. ఐషు ఇక్కడేం జరిగినా అడ్డు పడొద్దని చెప్పాను కదా..? ఇందు ఇప్పుడే కరెక్టుగా మాట్లాడుతుంది. ఇప్పుడే అటో ఇటో తేల్చుకోవాలి అంటుంది.

Advertisement

ఏంటి తేల్చుకునేది.. నువ్వు అస్సలు పాస్‌ అవ్వవు అంటాడు శేషు.. అవునక్కా ఒక్కటి రెండు కాదు చాలా సబ్జెక్టులు ఉన్నాయి కదా..? అంటూ స్వాతి చెబితే.. నేను చేస్తాను.. చెప్పు ఇందు నేను డిగ్రీ పాస్‌ అయితే నాకు కంపనీలో  వాటా ఇస్తావా..? అని అడిగితే.. ఇవ్వడమే కాదు నీతో కొత్త కంపెనీ పెట్టిస్తాను.. నాతో పాటు సమాన హోదా కల్పిస్తాను అని చెప్పగానే.. ఓ సూపర్ ఇందు నువ్వు సూపర్‌.. ఇప్పుడు నా చెల్లివి అనిపించుకున్నావు.. అనగానే.. ఒకవేళ నువ్వు పాస్‌ కాకపోతే నేను చెప్పింది చేస్తావా..? అంటే పాస్‌ కాకపోవడం అనేది ఉండదు.. అంటూ తన ఫ్రెండ్స్‌ అందరినీ అక్కడి నుంచి పంపిస్తుంది ఐశ్వర్య.

తర్వాత రేఖ, ఐశ్వర్య దగ్గరకు వెళ్లి అనవసరంగా చాలెంజ్‌ చేశావు.. నీకు పబ్బులు పార్టీలు తప్పా ఇంకేం తెలియదు.. అనవసరంగా ఈగోకు పోయి నీ జీవితాన్ని  నాశనం చేసుకోకు అంటూ తిడుతుంది. ఎందుకు ఆంటీ మీరందరూ నన్ను పాస్‌ అవ్వనని అంత బలంగా చెప్తున్నారు. నా స్ట్రెంత్‌ ఏంటో నాకు తెలుసు.. అంటూ బిల్డప్‌ కొడుతుంటే.. రేఖ కోపంగా ఎగ్జామ్‌ అంటే పార్టీకి రెడీ అయినంత ఈజీ అనుకున్నావా..? గంటలు గంటలు చదువుకోవాలి. నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవాలి. చదివింది మళ్లీ మళ్లీ చదవాలి అన్ని గుర్తుంచుకోవాలి.. అసలు నీ ఎగ్జామ్స్‌ కూడా టైం లేదు అనగానే.. తాను ఎలాగైనా కష్టపడి పాస్‌ అవుతానని రేఖకు చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తుంది. మరోవైపు రాజు, ఇందు రూంలో కూర్చుని ఐశ్వర్యతో ఇందు చేసిన చాలెంజ్‌ గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!

స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Big Stories

Advertisement
×