E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode August 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపే సుమిత్ర కూతురన్న నిజం చెప్తానన్న జ్యోత్స్న       

Karthika Deepam 2 Serial Today Episode August 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపే సుమిత్ర కూతురన్న నిజం చెప్తానన్న జ్యోత్స్న       
Advertisement

Karthika Deepam 2 serial today Episode: సూరజ్‌ కూడా తనకు జ్యోత్స్న అంటే ఇష్టమేనని.. పెళ్లి చేసుకుంటానని చెప్పగానే అందరూ సంతోషంగా ఎగిరిగంతేస్తారు. శివనారాయణ సంతోషంతో ఎమోషన్స్‌ అవుతూ.. ఈరోజు సూరజ్‌ పుట్టిన రోజే కాదు ఈ శివనారాయణ పుట్టినరోజు లాంటిదే.. అంటాడు. అందరూ కలిసి కేక్‌ కట్‌ చేస్తారు. సూరజ్‌, జ్యోత్స్నకు కేక్‌ తినిపిస్తాడు. జ్యోత్స్న కూడా సూరజ్‌కు కేక్‌ తినిపిస్తుంది. అందరూ సంబరాలు చేసుకుంటుంటే.. దాసు, పారిజాతాన్ని బయటకు తీసుకెళ్లి  ఈ ట్విస్ట్‌ ఏంటమ్మా.. అది నా కూతరేనా..? అని అడుగుతాడు.

పారిజాతం కూడా నేను సర్‌ప్రైజింగ్‌ గానే ఉన్నానురా..? ఏ ప్రయోజనంతో నీ కూతురును హాస్పిటల్‌ బెడ్‌ మీద నుంచి మార్చానో అది ఇప్పుడు నెరవేరబోతుంది అని చెప్పగానే.. దాసు అది ఇంకా నువ్ము మర్చిపోలేదా అమ్మా అని అడుగుతాడు. ఎలా మర్చిపోతానురా సూరజ్‌ తో జ్యోత్స్న పెళ్లి జరగ్గానే ఆస్థి మొత్తం జ్యోత్స్నకు చెందుతుందని పేపర్స్‌ రాశారు అని చెప్పగానే.. దాసు షాక్‌ అవుతాడు. ఇది పాపం అమ్మా అంటూ దాసు బాధపడుతుంటే.. పారిజాతం నువ్వు మధ్యలో వెళ్లి చెడగొట్టకు.. ఇక కేకు ముక్క తినేసి సైలెంట్‌గా వెళ్లిపో ఎవరికి ఎంత రాసి పెట్టి అంతే దక్కుతుంది అంటూ దాసును అక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెప్తుంది పారు.

Advertisement

దీప, కార్తీక్‌ ఇద్దరూ కలిసి జ్యోత్స్నను కంగ్రాట్స్‌ చేస్తారు. నువ్వు ఎప్పటికీ మారకుండా అలాగే మొండిగా ఉండిపోతావని భయపడ్డామని చెప్తారు. నువ్వు ఇంత త్వరగా మారతావనుకోలేదు అనగానే.. నన్ను మార్చింది మీరే మీ వల్లే నేను ఇలా మారిపోయాను.. అదంతా ఇక అయిపోయింది అని జ్యోత్స్న చెప్పగానే.. అయిపోలేదు జ్యోత్స్న ఇప్పుడు నూతన జీవితానికి ఆరంభం అయింది. ఇక అంతా మనకు మంచే జరుగుతుంది అని చెప్తుండగానే.. దాసు అవును అల్లుడు అంటూ వస్తాడు. దాసును చూసిన జ్యోత్స్న ఎమోషనల్‌ అవుతూ.. నాన్న అని పిలుస్తుంది. దాసు షాక్‌ అవుతాడు. చివరి సారి మనం కలిసినప్పుడు నన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది అన్నావు ఇప్పుడు అదంతా పోయిందా అమ్మ అని అడిగితే పోయింది నాన్న ఇప్పుడు నేను వేరు నాన్న అని చెప్తుంది జ్యో.

దాసు ఎమోషనల్‌ అవుతూ.. ఇదేనమ్మా నేను కోరుకునేది.. ఇలాగే నిన్ను చూడాలనుకున్నాను.. ఇక ఈ ఆనందం చాలమ్మ నాకు అనగానే.. సరిపోదు నాన్న నువ్వే నా తండ్రివి అని అందరికీ చెప్పే రోజు అతి తొందరలోనే వస్తుంది. దీపే.. సుమిత్ర, దశరథల కూతురు నేను కళ్యాణి, దాసుల కూతురిని కచ్చితంగా ఈ నిజాలన్నీ నేనే బయటపెడతాను నాన్న అని చెప్పగానే.. దాసు షాక్‌ అవుతాడు. ఇలా మాట్లాడుతుంది నువ్వేనా అంటూ ఎమోషనల్‌ అవుతాడు. దీపకు అన్యాయం జరిగిందనే బాధ నాకు ఇప్పటికీ ఉందమ్మా.. ఎటువంటి పరిస్థితుల్లో దీపకు ఎలాంటి బాధ కలగకూడదు.. నీ పెళ్లితో అందరి జీవితాలు మారిపోవాలమ్మా అంటూ చెప్తాడు దాసు.

Advertisement

రూంలో కూర్చుని జ్యోత్స్న చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. ఏంటి బర్తుడే బాయ్‌ మౌనంగా కూర్చున్నాడు అని అడగ్గానే.. ఊహించనిది జరిగినప్పుడు నేను ఇలా మౌనంగా ఉండిపోతాను అంటూ నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా..? నీ ప్రేమ నిజమేనా అని సూరజ్‌ అడగ్గానే.. జ్యోత్స్న మౌనంగా ఏడుస్తుంది. ఏంటి ఏడుస్తున్నావు.. ఎంతో కఠినంగా ఉన్న నువ్వు ఏడ్వడం ఏంటి..? అంటూ అడగ్గానే.. నన్ను ఇలా మార్చింది నువ్వే.. అసలు ప్రేమంటే ఏంటో తెలిసింది నీ వల్లే..

నాకేం కావాలో తెలిసింది నీవల్లే.. అందుకే చెప్తున్నాను నా మనసు నీ వశం అయిపోయింది. నాకంటూ ఏమీ లేదు.. అంతా అయిపోయింది. నువ్వు కాస్త దూరం అయినా తట్టుకోలేను.. నేను నిన్ను ఇంతలా ప్రేమిస్తుంటే.. మళ్లీ ఏంట్రా నువ్వు నాకు పరీక్షలు పెడుతున్నావు.. అంటూ జ్యోత్స్న చెప్తుంది. సూరజ్‌ అదేం లేదు జ్యోత్స్న అంటూ చేయి చూపించగానే.. వేలికి గాయం అయి రక్తం వస్తుంది. ఆ గాయం చూసి జ్యోత్స్న బాధపడుతుంది. ఏడుస్తూ.. గాయానికి కట్టు కడుతుంది. ఎందుకు ఏడుస్తున్నావని సూరజ్‌ అడిగితే ఇది కూడా ప్రేమే అంటుంది జ్యోత్స్న ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

Big Stories

Advertisement
×