E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode July 29th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాన్‌ సక్సెస్‌ – పిల్లలన చంపనున్న ప్రచండ

Nindu Noorella Saavasam Serial Today Episode July 29th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాన్‌ సక్సెస్‌ – పిల్లలన చంపనున్న ప్రచండ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: పిల్లలందరూ స్కూల్‌కు వెళ్తున్నారని రాథోడ్‌ కారులో తీసుకెళ్తున్నాడని ఇప్పుడే ఎలాగైనా బుజ్జమ్మ చంపే చాన్స్‌ ఉంటుందని మనోహరి, ప్రచండకు ఫోన్‌ చేసి చెప్తుంది. అయితే తాను చూసుకుంటానని ప్రచండ చెప్పి ఫోన్‌ కట్‌ చేస్తాడు. చాలా సేపటి తర్వాత కూడా ప్రచండ నుంచి ఫోన్‌ రాకపోవడంతో టెన్షన్‌ పడుతుంది మనోహరి. యాదమ్మ వచ్చి ఎందుకు టెన్షన్‌ పడటం మనోహరి.. ప్రచండకు నువ్వే ఫోన్‌ చేస్తే సరిపోతుంది కదా అంటుంది. అందుకు అవును కదా..? మర్చిపోయాను చంభా.. ఇప్పుడే చేస్తాను అంటూ ప్రచండకు కాల్ చేస్తుంది మనోహరి. ప్రచండ పని పూర్తి అయిందా..?  లేదా అని అడగ్గానే..

ప్రచండ ఇంకొద్ది సేపట్లో పని పూర్తువుతుంది. ఆ పిల్లలందరూ చనిపోతారు. అది చూద్దామనే ఇక్కడే నిలబడ్డాను.. వాళ్లు వెళ్తున్న కారుకు బ్రేక్‌ వైర్లు కట్‌ చేశాను అంటూ ప్రచండ చెబితే అదేంటి నువ్వు మాంత్రికుడివి కదా..? ఏదో చేస్తావు అనుకుంటే.. ఇంకేదో చేశానని చెప్తున్నావు.. అంటూ అనుమానంగా మనోహరి అడిగితే.. అవును ఇన్నాళ్లు నా మంత్రాలతో పని జరగడం లేదని రూట్‌ మార్చేశాను. అందుకే ఇప్పుడు తంత్రాలతో బ్రేకులు తీసేశాను. ఈసారి కచ్చితంగా పిల్లల పని అయిపోతుంది అనగానే.. మనోహరి మాత్రం చూడు ప్రచండ ఇది నీకు మాత్రమే కాదు నాకు కూడా చివరి అవకాశం ఇప్పుడు మిస్‌ ఆయ్యామా..? నీకు బుజ్జమ్మ శక్తులు దక్కవు నాకు అమరేంద్ర దక్కడు అంటే..

Advertisement

ఈసారి మనం ఓడిపోయే ప్రసక్తే లేదు మనోహరి పిల్లలను ఆ దేవుడు కూడా కాపాడలేడు. జరగబోయే ఆ మృత్యువు ప్రళయాన్ని కళ్లారా చూద్దామని కాచుకు కూర్చున్నాను అంటాడు . అందుకు మనోహరి కూడా సంతోషంగా వాళ్లు చనిపోవడం నేను లైవ్‌లో చూడాలని.. వాళ్ల చావు కేకలను వినాలని నాకు కూడా ఉంది. కానీ నేను ఇప్పుడు బయటకు రాలేను. పని అవ్వగానే నాకు ఫోన్‌ చేయ్‌.. నీ కాల్‌ కోసం నేను వెయిట్‌ చేస్తూ ఉంటాను అంటుంది మనోహరి. అంతా పక్కనే ఉండి విన్న యాదమ్మ కూడా కచ్చితంగా ఈ సారి నీ పని అయిపోతుంది మనోహరి ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్తుంది.

కారు కంట్రోల్‌ కాకుండా చెదురుమదురగా వెళ్తుంటే పిల్లలందరూ కంగారు పడుతుంటారు. అప్పుడే అంజు, అమర్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్తుంది. అమర్‌ కంగారు పడుతూ.. రాథోడ్‌తో ఫోన్‌ మాట్లాడి కారు ఎక్కడ వెళ్తుంది. ఎంత స్పీడులో వెళ్తుందో తెలుసుకుని పార్థును తీసుకుని వెళ్తాడు అమర్‌. అమర్‌, అంజుతో ఫోన్‌ మాట్లాడటం విన్న యాదమ్మ సంతోషంగా ఇంట్లోకి వెళ్లి మనోహరికి విషయం చెప్తుంది. నీ ప్లాన్‌ సక్సెస్‌ అవ్వబోతుంది మనోహరి. పిల్లలను కాపాడటానికి అమర్, పార్థు వెళ్లారు.. వాళ్లు అక్కడికి వెళ్లే సరికి యాక్సిడెంట్‌ జరిగి పిల్లలందరూ చనిపోతారు. ఈసారి నవ్వు గెలవబోతున్నావు.. ఇక అమర్ సార్‌ నీకే సొంతం.. నీ కల నెరవేరబోతుంది అనగానే.. మనోహరి సంతోషంతో చంభాను హగ్ చేసుకుంటుంది. అక్కడే హాల్లో కనిపించే ఆరు ఫోటో దగ్గరకు వెళ్లి ఇప్పుడు నీ పిల్లలను ఎలా కాపాడుకుంటావో చూస్తాను.. చచ్చిన నువ్వే కాదు బతికున్న నీ చెల్లి భాగీ కూడా నీ పిల్లలను కాపాడలేదు అంటూ కోపంగా ఆరు ఫోటోను చూస్తుంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

ఢీ విన్నర్ రాజు అరెస్ట్.. పెళ్లి పేరుతో పదేళ్లు ఇదేం కథ!

ఎంగిలి గ్లాస్ లు కడిగిన నాగార్జున… రోహిత్ పై ఫుల్ ఫైర్.. త్రిగుణ్ కు గుణమే లేదంటూ!

సనాతన ధర్మ పరిరక్షకులంటూ..పవన్ గరికపాటి పై అన్వేష్ ఫైర్!

వార్తా ప్రపంచం మారిపోయిందండోయ్.. 80ల్లో అలా, ఇప్పుడేమో ఇలా!

సెలబ్రిటీలకు మద్దతు తెలిపిన మాజీ కంటెస్టెంట్.. కామనర్స్ అంటే అంత చులకనా?

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా సుప్రీత.. ఏమన్నారంటే?

సీక్రెట్ రూమ్ లో చరణ్, చైత్ర? కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్!

ఢీ10 షో విన్నర్ రాజు అరెస్ట్?

Big Stories

Advertisement
×