E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode June 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాణిక్యం చేత ఇంట్లో వాళ్లకు నిజం చెప్పించిన కార్తీక్

Karthika Deepam 2 Serial Today Episode June 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాణిక్యం చేత ఇంట్లో వాళ్లకు నిజం చెప్పించిన కార్తీక్
Advertisement

Karthika Deepam 2 serial today Episode: రెస్టారెంట్‌లో గొడవ చేస్తున్న మాణిక్యం అసలు రంగు ప్లాన్‌ ప్రకారం సూరజ్‌ బయటపెట్టడంతో సమస్య పరిష్కారం అవుతుంది. అందరూ వెళ్లిపోతారు. సూరజ్‌ మాత్రం నిజం చెప్పకుండా ఎందుకు ఆపారని దీపను అడుగుతాడు. మాణిక్యం నోరు తెరచి జ్యోత్స్న పేరు చెప్పి ఉంటే అని అడగ్గానే.. చెప్పి ఉంటే మనం సాధించేది ఏముంటుంది.. రెస్టారెంట్‌కు మనవరాలికి తన భార్య పేరు పెట్టుకున్నారు. అలాగే మార్కెట్‌లో జ్యోత్స్న రెస్టారెంట్‌కు మంచి పేరు ఉంది. ఈ తప్పు జ్యోత్స్న చేసిందని తెలిస్తే.. జనం కూడా మరో నాలుగు కల్పించి మనం వినలేని విషయాలు కూడా కల్పించి పుకార్లు పుట్టిస్తారు. అంటూ చెప్పగానే.. సూరజ్‌ మీరు చెప్పేది నిజమే కానీ జ్యోత్స్నకు బుద్ది చెప్పాల్సిన అవసరం లేదా..? అని అడగ్గానే.. కార్తీక్‌ ఉంటుంది బ్రదర్‌ తప్పులు చేసేవాళ్లకే అంత ధైర్యం ఉంటే మనకు ఎంత ధైర్యం ఉంటుంది. మనకు కావాల్సింది ఆ మనిషి ఎలాంటిదో పెద్దాయనకు తెలియాలి అంటే.. ఆ సోషల్‌ మీడియా మాణిక్యం అకౌంట్‌ సబ్‌స్క్రైబ్‌ ఏసి గంట కొట్టేద్దాం అంటూ చెప్పి వెళ్లిపోతారు.

ఇంట్లో రెస్టారెంట్లో జరిగిన గొడవ గురించి అందరూ చర్చించుకుంటుంటారు. పారిజాతం మెల్లగా ఇది నీ పనేనా అని జ్యోత్స్నను అడుగుతుంది. అయిపోయింది కదా ఇక వదిలేయ్‌ అని చెప్తుంది. ఒకవేళ దొరికిపోతే అంటూ పారిజాతం అడగ్గానే.. ఎలా దొరుకుతాను.. దొరకను అంటూ కాన్ఫిడెంట్‌గా చెప్తుండగానే.. సుమిత్ర కోపంగా ఆ తప్పు చేసిన వాడిని వాడికి డబ్బులిచ్చి మరీ ఇలా చేయించిన వాడిని ఊరికే వదిలేయకూడదు అంటూ చెప్తుండగానే.. దీప, కార్తీక్‌ వస్తారు. మీరు కరెక్టుగా చెప్పారు చిన్న మేడం గారు అంటూ సూరజ్‌ను పిలవగానే.. సూరజ్‌, మాణిక్యాన్ని పట్టుకుని వస్తాడు. మాణిక్యాన్ని చూసిన జ్యో షాక్‌ అవుతుంది. కార్తీక్‌ కోపంగా నీతో ఇలాంటి పని చేయించింది ఎవరో చెప్పరా అంటూ మాణిక్యాన్ని దబాయిస్తుంటే.. పారిజాతం చెప్పే వాడే అయితే అక్కడే చెప్పేవాడు కదరా.. ఇప్పుడు బలవంతంగా ఎవరి పేరో చెప్పించడం దేనికి అంటూ చెప్పగానే..

Advertisement

ఎవరి పేరో ఎందుకు వీడితో ఈ నాటకం ఆడించిన వ్యక్తి పేరే చెప్పిస్తాను అంటూ కార్తీక్‌ మాణిక్యాన్ని చెప్పరా..? లేదంటే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్దామా..? అంటూ బెదిరించగానే.. మాణిక్యం చెప్పబోతుంటే.. జ్యో చేతి వేలు చూపిస్తూ.. చెప్పొద్దని బెదిరిస్తుంది. దీంతో మాణిక్యం మౌనంగా ఉండిపోతాడు. దీంతో కార్తీక్‌ కోపంగా తాను మూడు లెక్కపెట్టే లోపు చెప్పాలని లేదంటే ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరని వార్నింగ్‌ ఇస్తాడు. దీంతో మాణిక్యం తనతో ఈ నాటకం ఆడించింది జ్యోత్స్న మేడం అని చెప్తాడు. మాణిక్యం జ్యోత్స్న పేరు చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. జ్యోత్స్న కోపంగా చూస్తుంటుంది. మాణిక్యం మాత్రం జ్యోత్స్న మేడమే తనకు డబ్బులిచ్చి ఈ పని చేయమన్నారని చెప్పగానే.. పారిజాతం కోపంగా ఈ మాట చెప్పడానికి నీకెంత ఇచ్చారురా అంటూ కోప్పడుతుంది. జ్యోత్న్సే చేయిస్తే రెస్టారెంట్‌లోనే ఎందుకు చెప్పలేదు అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్.. మేము డబ్బులు ఇవ్వడం కాదు.. నా దగ్గర ఇంకా కాల్ రికార్డ్‌, వీడియో ఫుటేజీ చాలానే ఉన్నాయి అని చెప్పగానే.. రెస్టారెంట్‌లోనే జ్యోత్స్న పేరు దీప గారే చెప్పనీయలేదు అంటాడు సూరజ్‌. ఎందుకు చెప్పనీయలేదని పారిజాతం ప్రశ్నిస్తుంది.

దీంతో దీప మాణిక్యాన్ని వెళ్లమని చెప్పి మాణిక్యం వెళ్లిపోయాక దీప.. శివనారాయణ గౌరవం కోసమే అక్కడ నిజం చెప్పకుండా ఆగిపోయాను అంటూ దీప చెప్పగానే.. పారిజాతం కోప్పడుతుంది. దీంతో శివనారాయణ పారిజాతాన్ని ఊరుకోమని చెప్తాడు. సుమిత్ర కోపంగా వెళ్లి జ్యోత్స్నను కొట్టబోతూ ఆగిపోతుంది. ఎమోషనల్ అవుతూ బాధపడుతుంది. జ్యోత్సను తిడుతూ దీపను మెచ్చుకుంటుంది. అందరూ జ్యోత్స్నను తిట్టి దీపను మెచ్చుకుంటారు. ఇక అయిపోయింది కదా అందరూ వెళ్లండి అంటూ పారిజాతం చెప్పగానే.. అప్పుడే అయిపోలేదు.. ఇప్పుడు మొదలైంది అంటూ కార్తీక్‌.. జ్యోత్స్న చేసిన కుట్రలను బయటపెడుతుంటాడు. దీంతో శివనారాయణ కోపంగా జ్యోత్స్నను తిట్టి కార్తీక్‌కు సమధానం చెప్పమంటాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Ninnu Kori Today Episodes: చంద్రకు షాకిచ్చిన డాక్టర్.. గుడ్ న్యూస్ చెప్పిన క్రాంతి.. జగదీశ్వరి ఒప్పుకుంటుందా..?

Karthika Deepam 2Today Episodes:  దీప దెబ్బ అదుర్స్.. జ్యో మాటతో సూరజ్ షాక్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు దిమ్మతిరిగే షాక్.. సింగరాజు మాటతో ఫ్యూజుల్ అవుట్..

Podarillu Today Episode : శైలు పై అనుమానం..కేశవకు నిజం తెలుస్తుందా..? చక్రీ మాస్టర్ ప్లాన్..

Illu Illalu Pillalu Today Episodes: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేదవతి షాక్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం పార్వతి.. భానుమతి మాటతో షాక్.. కన్నీళ్లు పెట్టించే సీన్..

బిగ్ బాస్ షాలిని కన్నీళ్లు తెప్పించే స్టోరీ.. అయ్యో పాపం కదా…

Podarillu : మనీషాతో మాధవ్ పెళ్లి..? ఫైనల్ ట్విస్ట్ ఏముంది మావా..

Big Stories

Advertisement
×