E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode June 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపను ఆఫీసులోంచి వెళ్లిపోమన్న శివనారాయణ  

Karthika Deepam 2 Serial Today Episode June 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపను ఆఫీసులోంచి వెళ్లిపోమన్న శివనారాయణ  
Advertisement

Karthika Deepam 2 serial today Episode: ఫుడ్‌ రెడీ కాగానే.. ఫుడ్‌ తీసుకుని సూరజ్‌ బాలరాజు ఇంటికి వెళ్తాడు. అక్కడ సూరిబాబు అనే వ్యక్తి ఉంటాడు. బాలరాజు ఎవరో తనకు తెలియదని చెప్తాడు. దీంతో సూరజ్‌ బాలరాజుకు ఫోన్‌ చేస్తే.. స్విచ్చాప్‌ వస్తుంది. దీంతో ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన వాడు నీకు బాగానే టోపీ పెట్టాడు అంటూ సూరిబాబు ఇంట్లోకి వెళ్లిపోతాడు. దీంతో సూరజ్‌ అనుమానంగా ఆర్డర్‌ ఇచ్చాడు.. అడ్రస్‌ ఇచ్చాడు.. ఇప్పుడు స్విచ్చాప్‌ చేశాడు. పెద్దాయనకు ఏం సమాధానం చెప్పాలి అనుకుంటూ ఇప్పుడేం చేయాలి అనుకుంటుండగానే శివనారాయణ వస్తాడు. విషయం తెలిసి అందరినీ తిడతాడు. ఇక్కడ మాట్లాడటం కాదు లోపలికి పదండి అనగానే.. అందరూ ఆఫీసులోకి వెళ్తారు.

శివనారాయణ కోపంగా ఆరోజు నువ్వు ఏమన్నావు..? ఒక్కసారి మోసపోవడం మంచితనం.. రెండోసారి మోసపోవడం చేతకానితనం అన్నావు అంటాడు.. ఇంతలో జ్యోత్న్స కల్పించుకుని ఇంకా మన అదృష్టం బాగుండి ఫిఫ్టీ పర్సెంట్‌ అడ్వాన్స్‌ ఇచ్చాడు. లేదంటే నష్టం ఇంకా ఎక్కువ ఉండేది అనగానే.. కార్తీక్‌ కల్పించుకుని మోసం చేయాలి అనుకున్నవాడు పది లక్షల రూపాయల చెక్‌ ఎందుకు ఇస్తాడు. ఎక్కడో ఏదో తేడా జరిగింది అంటుండగానే.. మేనేజర్‌ వచ్చి ఆ కస్టమర్‌ ఇచ్చిన చెక్‌ బౌన్స్‌ అయింది అని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. అడ్వాన్స్‌ పేరుతో వాడెవడో మనల్ని బాగా ముంచాడు సార్‌ అని చెప్పగానే.. జ్యోత్స్న కోపంగా ముంచింది వాడు కాదు సార్‌ ఇదిగో ఈ దీప వాడు తక్కువ అమౌంట్‌కు అడిగినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అనగానే.. దీప తాను ఆ బడ్జెట్‌లో చేయగలనన్నే నమ్మకంతోనే ఆర్డర్‌ తీసుకున్నాను జ్యోత్స్న అనగానే..

Advertisement

శివనారాయణ కోపంగా ఏంటి చేయగలిగేది అంటూ కోపంగా అంటుంటే.. దశరథ నాన్న అనగానే.. శివనారాయణ కోపంగా బ్యాంక్‌ హాలిడే నాడు వాడు చెక్‌ ఇచ్చాడంటే అనుమానపడాలి కదా..? అంటూ చెప్తాడు. దీంతో జ్యోత్స్న కోపంగా అనుమానపడేంత తెలివి ఉంటే బాగానే ఉండు.. ఒక్కతే ఉన్నప్పుడు నష్టం వేలల్లో ఉండేది.. కానీ ఇద్దరు అయ్యాక నష్టం లక్షల్లోకి వచ్చింది.. ఇలాగే ఉంటే బ్రాంచ్‌ క్లోజ్‌ చేసుకోవాల్సిందే.. అంటూ చెప్పగానే.. దశరథ కూడా తాను అదే నిర్ణయం తీసుకున్నానని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. అసలు నష్టాల్లో ఉన్న బ్రాంచ్‌కు మరో ఇరవై లక్షలు నష్టం అంటే ఎలా నడుస్తుంది అంటూ శివనారాయణ బాధపడుతుంటాడు.. దీంతో దీప పెద్దయ్యగారు తప్పు జరిగింది సరిదిద్దుకోవడానికి నాకో చాన్స్‌ ఇవ్వండి అంటూ అడగ్గానే.. ఎలా సరిదిద్దుకుంటావు అంటూ జ్యోత్స్న అడగ్గానే.. ఎలా అయినా సరిదిద్దుకుంటుంది.. మధ్యలో నువ్వేంటి అంటూ జ్యోత్స్నను తిడుతూ.. దీపకు కల్మషం లేదు అందుకే ఇలా జరిగింది.. ఒక ఆర్డర్‌ వచ్చిందని చిన్న పిల్లలా సంతోషపడింది.. దీపకు ఎవరి దిష్టి తగులుతుందో అనుకున్నాను.. కానీ ఎవరి దిష్టో గట్టిగానే తగిలింది అంటూ కార్తీక్‌ ఎమోషనల్‌ అవుతాడు.

తనకు ఒక్క అవకాశం ఇవ్వండి.. అంటూ కార్తీక్‌ రిక్వెస్ట్‌ చేస్తుంటే.. జ్యోత్స్న ఇవ్వకు తాత అంటూ చెప్తుంది. దీంతో కార్తీక్‌ అవకాశం ఇవ్వకపోతే తనను తాను ఎలా నిరూపించుకుంటుంది అంటూ అడగ్గానే.. శివనారాయణ ఇక అవకాశం ఇవ్వనని తాను ఒక నిర్ణయం తీసుకున్నానని కంపెనీకి ఇంత నష్టం తీసుకొచ్చిన దీప మళ్లీ ఈ సంస్థలో అడుగుపెట్టడానిక వీల్లేదు. తన నిర్లక్ష్యానికి బలైంది ఈ సంస్థ గౌరవం కాబట్టి మళ్లీ దీప ముఖం నేను జీవితంలో చూడను ఇక నువ్వు బయలుదేరు అనగానే.. దీప ఏడుస్తూ.. పెద్దయ్యగారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ రిక్వెస్ట్‌ చేస్తుంది. దీంతో కార్తీక్‌, దశరథ కూడా ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్తారు. జ్యోత్స్న ఇవ్వొద్దు తాత అంటుంది.

Advertisement

శివనారాయణ మాత్రం నీకు ఒక్క అవకాశం ఇస్తున్నాను.. కానీ ఆ వెయ్యి భోజనాల్లో సాయంత్రం వరకు ఒక్కమెతుకు మిగలకూడదు. ఆర్డర్‌ తీసుకున్నది నువ్వే కాబట్టి బాధ్యత కూడా నువ్వే తీసుకో.. ఏం చేస్తారో చేయండి మీకు సాయంత్రం వరకే టైం ఇస్తున్నాను అని చెప్పగానే.. జ్యోత్స్న, దీప ఏం చేయలేకపోతే.. అని అడగ్గానే.. శివనారాయణ  కోపంగా దీప ఈ ఆఫీసు వదిలేసి వెళ్లిపోతుంది. దీపకు నా ఇంట్లో కూడా స్థానం ఉండదు అనగానే.. జ్యోత్స్న ఇది కదా నాకు కావాల్సింది అంటూ సంతోషిస్తుంది. అందరూ షాకింగ్‌గా చూస్తుంటే.. అంతే తప్పు చేసిన వాళ్లకు ఇలాంటి శిక్షే పడాలి అంటున్నాను అనగానే.. శివనారాయణ ముందు మీరందరూ ఇక వెళ్లండి అని చెప్తాడు. అందరూ వెళ్లిపోతారు.

తర్వాత సూరజ్‌ తల పట్టుకుని కూర్చుని ఉంటే.. జ్యోత్స్న కాఫీ తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు ఇది నీకు చాలా అవసరం అంటూ చెప్తుంది. దీంతో సూరజ్‌ కోపంగా ఇదంతా నువ్వే చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తాడు. దీంతో జ్యోత్స్న కోపంగా సూరజ్‌ను తిడుతుంది మీరు ఎలాగూ ఓడిపోయారు కాబట్టి మీకు రెండే ఆప్షన్స్‌ ఉన్నాయి. ఒకటి సాయంత్ర వరకు పారిపోవడం.. లేదా నాతో కలిసి  పని చేయడం అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో సూరజ్‌ కాఫీ తాగుతూ.. కాఫీ బాగుంది అంటూ వెటకారంగా మాట్లాడతాడు. జ్యోత్స్నకు ఐలవ్యూ చెప్తాడు. దీంతో సూరజ్‌ను తిడుతుంది. సూరజ్‌ థాంక్స్‌ చెప్పి వెళ్లిపోతాడు. దీప దగ్గరకు వెళ్లి సూరజ్‌ సమస్యకు పరిష్కారం గతంలోకి వెళితే దొరకొచ్చు అంటూ చెప్పగానే.. దీప గతంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్తుంది. దీంతో సూరజ్‌ తనకు ఒక ఐడియా వచ్చింది పదండి అంటూ సూరజ్‌ చెప్పగానే.. దీప ఎక్కడికి అని అడుగుతుంది. మీ గతంలోంచి మన సమస్యకు ఇప్పుడు పరిష్కారం దొరికింది అంటూ చెప్తాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

Big Stories

Advertisement
×