Karthika Deepam 2 serial today Episode: జ్యోత్స్న విషయంలో మాలిని వారించిన సూరజ్‌ను మాలిని ఆనుమానిస్తుంది. సూరజ్ రూంలోకి వెళ్లి పర్సు చెక్ చేస్తుంది. పర్సులో జ్యోత్స్న ఫోటో ఉండదు. అది చూసిన తర్వాత సూరజ్ ఎప్పటికైనా నా కొడుకే ఈ మాలిని కొడుకే అనుకుంటూ అనుమానంగా తలగడ తీసి చూస్తుంది. తలగడ కింద జోత్స్న ఫోటో ఉంటుంది. అది చూసి షాక్ అవుతుంది. వెంటనే తన మనిషిని పిలిచి జ్యోత్స్న ఎవ్వరికీ కనిపించడకుండా చేయమని చెప్తుంది. అందుకు ఆ వ్యక్తి సరేనంటూ వెళ్లిపోతాడు.
ఇంట్లో ఉన్న శివనారాయణ కాళ్లకు కొబ్బరినూనెతో మర్దన చేస్తుంటే.. శివనారాయణ తిడుతూ నువ్వు కాళ్లు కాదురా నా గొంతు నొక్కు అంటాడు. కార్తీక్ నీ బాధ ఏంటి..? మర్దన చేస్తుంటే.. హాయిగా పడుకోవచ్చు కదా అంటే నువ్వు ఇక్కడ ఉంటే నాకు నిద్ర ఎలా పడుతుందిరా అంటాడు శివనారాయణ అప్పుడే వచ్చిన దశరథ కార్తీక్‌ను పక్కకు తప్పుకుకోమని తాను కాళ్లకు మర్దన చేస్తానంటాడు. అందుకు కార్తీక్ ఒప్పుకోడు అప్పుడే సుమిత్ర టాబ్లెట్ తీసుకొస్తాను అంటే నాకు ఈ పనులన్నీ అలవాటే నా పనులు నేను చేసుకుంటాను అంటూ చెప్తుంటే.. సరేలే తాత మీరు పడుకోండి.. వయసు పెరిగింది కానీ పౌరుషానికి మాత్రం ఇంకా పాతికేళ్లే మీరు వెళ్లండి మామయ్య.. వెళ్లండి అత్త అని చెప్పగానే.. దశరథ, సుమిత్ర వెళ్లిపోతారు. కార్తీక్ ఏమోషనల్ అవుతూ మర్దన చేస్తుంటే.. శివనారాయణ నిద్రపోతాడు.
సూరజ్ జ్యోత్స్నకు ఫోన్ చేస్తాడు. జ్యోత్స్న లిఫ్ట్ చేయదు. ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయకపోయే సరికి కోపంగా వాట్సాప్ మెసేజ్ చేస్తాడు సూరజ్. మెసేజ్‌కు కూడా రిప్లై ఇవ్వకపోయే సరికి ఆడియో రికార్డ్ చేసి సెండ్ చేస్తాడు. అందులో జ్యోత్స్న పీఏ జాబ్‌కు పనికిరాదని.. ఆ జాబ్ తాను చేయలేదని.. ఇక మండే నుంచి ఆఫీసుకు రావొద్దని వాయిస్ రికార్డ్ చేసి సెండ్ చేస్తాడు. అప్పుడే దక్షిణమూర్తి వచ్చి అంతా వింటాడు. దక్షిణమూర్తిని చూసిన సూరజ్ షాక్ అవుతాడు. దక్షిణమూర్తి మాత్రం ఎందుకురా ఇంత కోపం అని అడిగితే.. జ్యోత్స్న తనకు రిప్లై ఇవ్వడం లేదు అని చెప్పగానే..నువ్వు జ్యోత్స్న ప్రేమిస్తున్నావు కాబట్టి ఇంతలా ఇరిటేట్ అవుతున్నావు.. కొన్ని ప్రశ్నలకు కాలం సమాధానం చెబితే.. ఈ ప్రశ్నకు నీ మనసే సమాధానం చెప్పాలి. ఎందుకంటే జ్యోత్స్న నీ మాటల్లో లేదు.. నీ మనసులో ఉంది అంటూ వెళ్లిపోతాడు దక్షిణమూర్తి. సూరజ్ తలగడ కింద ఉన్న జ్యోత్స్న ఫోటో చూస్తూ ఇరిటేట్ అవుతుంటాడు.
శివనారాయణ టిఫిన్ బండి దగ్గర దశరథ, సుమిత్ర పని చేస్తుంటారు. వాళ్లను చూసిన కార్తీక్, దీప బాధపడుతుంటారు. వీల్లను ఇలా చూస్తుంటే బాధగా ఉందని దీప ఎమోషనల్ అవుతుంది. మాలినిని తలుచుకుంటేనే కోపం వస్తుంది నా కుటుంబానికి ఎలాంటి గతి పట్టించాడు అంటూ తిట్టుకుంటుంటే.. అప్పుడే దక్షిణమూర్తి, మాలిని, సూరజ్ వస్తారు. వాళ్లను కస్టమర్లలా ట్రీట్ చేస్తారు సుమిత్ర, దశరథ. శివనారాయణ మాత్రం ఊర్లో ఉన్న చెత్తంతా నా బండి ముందుకే వచ్చింది అంటాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంటే.. కార్తీక్, దీప వచ్చి ఆపేస్తారు.
దక్షిణమూర్తి బాధగా అక్కడే కూర్చుంటే.. దశరథ, సుమిత్ర వచ్చిన కస్టమర్లందరికీ సర్వ్ చేస్తుంటారు. సూరజ్ మాత్రం అందరూ ఇక్కడే ఉన్నారు జ్యోత్స్న ఎక్కడా కనిపించడం లేదేంటి అనుకుంటాడు. కస్టమర్లు అందరూ వెళ్లిపోయాక దక్షిణమూర్తి, సుమిత్ర దగ్గరకు వెళ్లి నేను నిన్ను యువరాణిలా చూసుకున్నాను.. కానీ ఈ దరిద్రుడు శివనారాయణ నిన్ను ఎంగిలి పాత్రలు ఎత్తేలా చేశాడు అనగానే.. శివనారాయణ కోపంగా దక్షిణమూర్తికి కొట్టబోతే అందరూ ఆపేస్తారు. గొడవ పెద్దగా అవుతుంది. దక్షిణమూర్తిని కార్తీక్ తిడుతుంటే.. మీరు మీరు ఒక్కటేగా అంటూ శివనారాయణ అనగానే కార్తీక్, దీప బాధపడుతుంటారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.