Dinesh Karthik On Virat Kohli 100 : టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పై ( Virat Kohli ) దినేష్ కార్తీక్ ( Dinesh Karthik ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ లోపు విరాట్ కోహ్లీ 100 సెంచరీల మార్క్ దాటలేడని.. ఒకవేళ దాటితే తన పేరు మార్చుకుంటానని దినేష్ కార్తీక్ చాలెంజ్ విసిరారు. వన్డే క్రికెట్ మ్యాచ్ ల లెక్కలు పరిశీలిస్తే.. ఈ విషయం అందరికీ స్పష్టం అవుతుందని వ్యాఖ్యానించారు. విరాట్ కోహ్లీ మరో 14 సెంచరీలు చేస్తే.. 100 మార్క్ దాటతాడని గుర్తు చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ లోపు విరాట్ కోహ్లీ దాదాపు 22 నుంచి 25 మ్యాచ్ లు ఆడతాడని లెక్కలు బయటపెట్టారు దినేష్ కార్తీక్.
ఈ మ్యాచ్ లలో 14 సెంచరీలు సాధించడం చాలా కష్టమని… విరాట్ కోహ్లీ తాతలు దిగివచ్చినా ఇది సాధ్యపడదు అంటూ కుండబద్దలు కొట్టి చెప్పారు. అనవసరంగా క్రికెట్ అభిమానులు 100 సెంచరీల మార్కుపైన ఆశలు వదులుకోవాలని బాంబు పేల్చారు. అయితే 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించకుండా…అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగితే, కచ్చితంగా కోహ్లీ 100 సెంచరీల మార్క్ దాటడతాడని ప్రకటించారు. 2027 వన్డే వరల్డ్ కప్ లోపు మాత్రం సాధ్యం కాదని చెప్పే ప్రయత్నం చేశారు దినేష్ కార్తీక్. దీంతో కోహ్లీ సెంచరీలపై దినేష్ కార్తీక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
విరాట్ కోహ్లీ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు అన్న సంగతి తెలిసిందే. టి20లు, టెస్టులకు మనోడు ఎప్పుడో రిటైర్మెంట్ ఇచ్చేశాడు. టెస్టుల్లో 30 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, టీ20లలో ఒకే ఒక్క సెంచరీ నమోదు చేసుకున్నాడు. వన్డేలలో 55 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న నేపథ్యంలో… సెంచరీలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 86 సెంచరీలు నమోదు చేసిన విరాట్ కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ సమయం వరకు 22 నుంచి 25 వన్డేలు ఆడతాడు. ఇందులో 11 ద్వైపాక్షిక సిరీస్ లకు సంబంధించిన వన్డేలు ఉండగా… ఆసియా కప్ 2027 టోర్నమెంట్లో మరో 4 మ్యాచ్ లు ఆడతాడు.
అలాగే 2027 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా 9 మ్యాచ్ లు ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కనీసం 22 నుంచి 25 మ్యాచ్ లు ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇందులో మరో 14 సెంచరీలు చేస్తే… 100 సెంచరీలు పూర్తి అవుతాయి. 22 వన్డేలలో 14 సెంచరీలు చేయడం చాలా కష్టమేనని క్రీడా విశ్లేషకులు కూడా చెబుతున్నారు. అందులో వన్డే వరల్డ్ కప్ తో పాటు ఆసియా కప్ ఉందని… ఈ మెగా టోర్నమెంట్ అనే పద్యంలో తీవ్ర ఒత్తిడి కోహ్లీ పైన ఉంటుందని తెలిపారు. అలాగే గాయాల కారణంగా కొన్ని వన్డేలకు దూరమయ్యే ప్రమాదం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి 14 సెంచరీలు కష్టమేనని స్పష్టం చేస్తున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత కూడా కోహ్లీ ఆడితే… 100 సెంచరీల మార్కు వెల్లడిస్తున్నారు.