E-Paper
Advertisement

ఈ గుర్తింపు బిగ్ బాస్ పెట్టిన భిక్ష.. రోహిత్ తీరుపై కౌశల్ మండిపాటు!

ఈ గుర్తింపు బిగ్ బాస్ పెట్టిన భిక్ష.. రోహిత్ తీరుపై కౌశల్ మండిపాటు!
Advertisement

Kaushal Manda: బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచి, భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న నటుడు కౌశల్ మండా (Kaushal Manda) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పలు స్టార్ హీరోల చిత్రాలలో ఫ్రెండ్ క్యారెక్టర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఆ తర్వాత కొన్ని చిత్రాలలో హీరోగా కూడా నటించి మెప్పించారు. అయితే సినిమాల ద్వారా రాని గుర్తింపు కేవలం బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారానే తనకు లభించింది అంటూ.. ఈ గుర్తింపు బిగ్ బాస్ పెట్టిన భిక్ష అంటూ చేసే కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ తీరును తప్పుపడుతూ.. బిగ్ బాస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్ కామనర్ రోహిత్ నాయుడు (Rohith Naidu) పై తనదైన శైలిలో మండిపడుతూ ఒక వీడియో విడుదల చేశారు కౌశల్.

రోహిత్ పై కౌశల్ మండా ఫైర్..

కౌశల్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక వీడియో విడుదల చేస్తూ రోహిత్ పై మండిపడ్డారు.. ముఖ్యంగా రోహిత్ పై వీకెండ్స్ లో భాగంగా హోస్ట్ నాగార్జున ఫైర్ అవుతూ “గెట్ అవుట్” అంటూ బిగ్ బాస్ హౌస్ గేట్స్ ఓపెన్ చేయడం, అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై కూడా కౌశల్ మాట్లాడుతూ..” నాగార్జున గారి స్థానంలో ఎవరు ఉన్నా సరే అక్కడ టీవీలు పగిలిపోయేవి.. అయినా ఆయన ఇంకా తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నారు కాబట్టే గెట్ అవుట్ అనే మాటతో సరిపెట్టుకున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. బిగ్ బాస్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి.

ఈ గుర్తింపు బిగ్ బాస్ పెట్టిన భిక్ష..

Advertisement

బిగ్ బాస్ లేకపోతే నువ్వు ఎవరు అనే విషయం కూడా ఎవరికీ తెలియదు . ఈ గుర్తింపును బిగ్ బాస్ మనకు పెట్టిన బిక్ష.. ముఖ్యంగా మీరు ఎవరో తెలియకపోయినా.. ఈ రియాల్టీ షో లోకి అడుగుపెట్టారు అంటే.. మీరేంటో పదిమందికి తెలుస్తుంది. మీకు గుర్తింపు వస్తుంది. ప్రతిరోజు కూడా రెమ్యూనరేషన్ లభిస్తుంది. అంతేకాదు మీరు మీ పర్ఫామెన్స్ తో మెప్పించగలిగితే..విజేత గా నిలిచి డబ్బు కూడా తీసుకొని ఇంటికి వెళ్తారు . ఇన్ని ఇస్తున్న బిగ్ బాస్ ను మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం.. ఎవరికైనా కోపాన్ని తెప్పిస్తుంది.

బిగ్ బాస్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి..

అందుకే చెప్తున్నా బిగ్ బాస్ హౌస్ లో కి కంటెస్టెంట్ గా పాల్గొన్న ప్రతి ఒక్కరూ బిగ్ బాస్ రూల్స్ గురించి తెలుసుకోవాలి. ఆ రూల్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి..హోస్ట్ నాగార్జున , బిగ్ బాస్ లకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ముఖ్యంగా ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు.. వేరే కంటెస్టెంట్స్ కూడా ఖండించడం నేర్చుకోండి.. ఒకవేళ మీరు బిగ్బాస్ కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే , ప్రజలు కూడా మిమ్మల్ని ద్వేషిస్తారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు” అంటూ తనదైన శైలిలో మండిపడ్డారు.

Advertisement

also read:లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

అసలేం జరిగిందంటే?

అసలేం జరిగింది అనే విషయాన్ని వస్తే.. రోహిత్ నాయుడు తన తోటి కంటెస్టెంట్స్ త్రిగుణ్, చరణ్ లతో బిగ్ బాస్ గురించి అనుచితంగా మాట్లాడడమే కాకుండా.. అసభ్యకరంగా సైగలు చేయడం, అందుకు సంబంధించిన విజువల్స్ ను హోస్ట్ నాగార్జున వీకెండ్స్ లో చూపించి మరీ రోహిత్ కి వార్నింగ్ ఇవ్వడం షో చూసిన వారందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ను గౌరవించని వారు హౌస్ లో అవసరం లేదు. గెట్ అవుట్ అంటూ నాగార్జున బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ చేశారు.అయితే తన తప్పు తెలుసుకున్న రోహిత్ నాయుడు అటు బిగ్ బాస్ కి ఇటు నాగార్జునకు ఇద్దరికి క్షమాపణలు చెప్పారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

Big Stories

Advertisement
×