Post Office Scheme: పోస్టాఫీసు పేరు చెప్పగానే ఒకప్పుడు ఉత్తరాలకు కేరాఫ్‌గా ఉండేది. ఇప్పుడు పథకాలకు పుట్టినిల్లుగా మారింది. ఎందుకంటే అక్కడ అన్ని వయసుల వారికి పొదుపు పథకాలను అందుబాటులో ఉంటాయి. చిన్న మొత్తాల పొదుపుతో నిధులను కూడబెట్టుకోవచ్చు. చిన్న పొదుపు పథకాలపై మంచి వడ్డీ రేటుతో పాటు పెట్టుబడి భద్రతకు హామీ ఇస్తుంది.
ఇక పోస్టాఫీసులో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అంటే పోస్ట్ ఆఫీస్ ఎన్ఎస్సి పథకం లాభదాయకమైనది కనిపిస్తుంది. ఎందుకంటే అందులో పెట్టుబడి ద్వారా వడ్డీ రూపంలో రూ. 4,50,000 సంపాదించవచ్చు. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం. కేవలం వెయ్యి రూపాయలతో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్-NSC అనేది పోస్టాఫీస్ అందించే చిన్న పొదుపు పథకం. మధ్యతరగతి ప్రజలు, పదవీ విరమణ కోసం ప్రణాళిక వేసుకుంటున్న వారికి ఇదొక ప్రముఖ పెట్టుబడి. కనీసం రూ. 1,000ను ఐదేళ్ల వరకు పెట్టుబడిగా పెట్టవచ్చు. పెట్టుబడికి గరిష్ట పరిమితి అంటూ ఏమీలేదు. ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే వచ్చే రాబడి అంత ఎక్కువగా ఉంటుంది.
ఈ రోజుల్లో పోస్టాఫీస్ పథకాలు అంత ప్రజాదరణ పొందడానికి అతిపెద్ద కారణం. రిస్క్ రహితంగా ఉండటమే దాని సీక్రెట్. నిజానికి ఈ పథకంలో చిన్న లేదా పెద్ద పెట్టుబడి భద్రతకు ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఇందులో పెట్టుబడి పెట్టిన డబ్బు పూర్తిగా సురక్షితం. అధిక వడ్డీని కూడా అందిస్తాయి. మీరు పెద్ద మొత్తంలో నిధిని కూడ బెట్టుకోవడం నుండి ఆదాయం పొందడం వరకు హామీ ఇస్తుంది. ప్రభుత్వం PO NSC పై 7.7 శాతం వడ్డీని ఇస్తోంది.
ఈ పథకాన్ని భారతీయులై ఉండాలి. ఎన్ఆర్ఐలు, కంపెనీలు, ట్రస్టులు, హిందూ అవిభక్త కుటుంబాలు (HUFs) అర్హులు కారు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. ఈ పథకాన్ని వారి స్వంత పేరు మీద లేదా మైనర్ పేరు మీద పొందవచ్చు. పోస్టాఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఏటా రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లు 7.7 శాతం వార్షిక వడ్డీ రేటు ఇస్తుంది.
ALSO READ: బుధవారం జీఎస్టీ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్, అదే జరిగితే బంగారం-వెండి ధరలకు రెక్కలు
ఒక పౌరుడు NSC పథకంలో రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే ఐదేళ్లలో వడ్డీ రూపంలో రూ. 4,49,034 వస్తుంది. అంటే ఐదేళ్ల తర్వాత అందుకునే మొత్తం సుమారుగా రూ. 14,49,034 అవుతుందన్నమాట. తొలి ఏడాది రూ. 77,000, రెండో ఏడాది రూ. 1,59,929, మూడో సంవత్సరం రూ. 2,49,044, నాలుగో ఏడాది రూ. 3,45,620 మరియు ఐదో సంవత్సరంలో రూ. 4,49,034 వడ్డీ లభిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించి వివరాలు తెలుసుకోండి. నచ్చితే వెంటనే పొదుపు చేయండి.