Canada Super 60 Bouncer Flies A Six: కెనడా సూపర్ 60 టీ10 లీగ్ (Canada Super 60) నేపథ్యంలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. బ్యాట్ కు తగలకుండానే బంతి సిక్స్ గేట్ లో పడింది. బీసీ ప్లేస్ మైదానంలో జరిగిన సెమీ ఫైనల్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో కిరాన్ పొలాల్డ్ ( Kieron Pollard) బ్యాటింగ్ చేస్తుండగా, అలీఖాన్ ( Ali Khan Bouncer ) 150 కిమీ స్పీడ్ తో బంతి విసిరాడు. ఈ తరుణంలోనే బంతి పిచ్ పై బౌన్స్ అయింది. బ్యాటర్ తో పాటు వికెట్ కీపర్ కు అందకుండా సిక్సర్ వెళ్లింది. ఈ తరుణంలోనే వైడ్ ఇచ్చిన అంపైర్, 6 పరుగులు ఇవ్వలేదు. ఐసీసీ రూల్స్ ఆధారంగా 4 పరుగులతో పాటు వైడ్ కు ఒక పరుగు ఇస్తున్నట్టు ప్రకటించారు. అంటే సిక్సర్ వెళ్లిన బంతికి 5 పరుగులకే దక్కాయన్న మాట. ఫుట్ బాల్ మ్యాచ్ లు జరిగే ఈ మైదానాల్లో సిక్సర్ గేట్ సైజ్ కేవలం 45 మీటర్లు మాత్రమే ఉండటంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి.
కెనడా సూపర్ 60 T10 లీగ్‌లో భాగంగా తాజాగా తొలి ఫైనల్స్ సందర్భంగా మిస్సిసౌగా మాస్టర్స్ vs టొరంటో సిక్సర్స్ జట్ల మధ్య ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన కిరాన్ పొలాల్డ్ ( Kieron Pollard) కెప్టెన్ గా వ్యవహరించిన టొరంటో సిక్సర్స్ విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో కిరాన్ పొలార్డ్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో మిస్సిసౌగా మాస్టర్స్ బౌలర్ అలీఖాన్ చాలా వేగంగా బంతి సంధించాడు. అయితే, పిచ్ నాణ్యత సరిగ్గా లేకపోవడంతో సిక్సర్ వెళ్లింది. బ్యాటర్ ప్రమేయం లేకుండానే సిక్సర్ వెళ్లడం హాట్ టాపిక్ అయింది. అయితే, సిక్సర్ వెళ్లినా కూడా వైడ్ బాల్ గా ప్రకటించి, మొత్తం 5 పరుగులు ఇచ్చారు. దీనిపై వివాదం రాజుకుంది.
తొలి ఫైనల్స్ సందర్భంగా మిస్సిసౌగా మాస్టర్స్ vs టొరంటో సిక్సర్స్ ( Masters vs Sixers, 1st Semi-Final at Vancouver, Canada Super60, ) మధ్య జరిగిన మ్యాచ్ కిరాన్ పొలార్డ్ సేన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టొరంటో సిక్సర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 7 వికెట్లు నష్టపోయిన మాస్టర్స్…121 పరుగులకే ప్యాకప్ అయింది. దీంతో 9 పరుగుల తేడాతో టొరంటో సిక్సర్స్ విక్టరీ అందుకుంది.
🚨 MAYBE FIRST TIME IN CRICKET HISTORY 🚨
Ali Khan bowls a bouncer, and the ball goes for a SIX 😳
That's a Wide + Six, possibly the first time this has happened in cricket history 😂
A must watch 👇🏻 pic.twitter.com/6QACwUgT2T
— Richard Kettlebourogh Fans (@RichKettle07) October 5, 2026