Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ సీజన్ 10 కార్యక్రమం నాలుగవ వారం పూర్తి కాబోతోంది. ఇప్పటికే విజయవంతంగా నాలుగు వారాలను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం నుంచి ముగ్గురు కంటెస్టెంట్ లో బయటకు ఎలిమినేట్ అయ్యారు. ఇక నేడు వీకెండ్ కావడంతో యధావిధిగా నాగార్జున (Nagarjuna)హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లతో సరదాగా మాట్లాడటమే కాకుండా కంటెస్టెంట్ల ప్రవర్తన గురించి కూడా ప్రస్తావిస్తూ మందలిస్తుంటారు. తాజాగా ఈ వీకెండ్ ప్రోమో వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లపై నాగార్జున తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
ఇక ఈ ప్రోమో వీడియోలో భాగంగా ఈ వీక్ లో కంటెస్టెంట్ లో ప్రవర్తించిన తీరుకు సంబంధించి చిన్న క్లిప్స్ వేశారు. ఇది చూసిన అనంతరం నాగార్జున కాంటెస్టెంట్లతో మాట్లాడుతూ అసలు ఈ హౌస్ లో ఏం జరుగుతుంది? మీరు హౌస్ లో కంటెస్టెంట్ల లేకపోతే వీధి రౌడీలా అంటూ రెచ్చిపోయారు. త్రిగుణ్,అమన్ ,రోహిత్ ముగ్గురిని లివింగ్ రూమ్ నుంచి గార్డెన్ ఏరియాలోకి వెళ్లాలని చెప్పారు. కెప్టెన్ అపూర్వ(Apoorva) గురించి మాట్లాడుతూ అపూర్వ గారు.. కెప్టెన్ రూమ్ నువ్వు వాడిన విధానం కరెక్టేనా? నాకు రెస్పెక్ట్ కావాలి, కెప్టెన్ అపూర్వ అని పిలవాలి అంటూ చాలా గట్టిగా చెప్పావు కదా.. అంతే గట్టిగా కెప్టెన్ రూమ్ వాడకూడదని తెలియదా? నువ్వు డిజాస్టర్ కెప్టెన్ అంటూ అపూర్వ పై ఫైర్ అయ్యారు..
ఇక ఆటో రాంప్రసాద్(Ramprasad) గురించి కూడా ప్రస్తావిస్తూ రాంప్రసాద్ నువ్వేమైనా పిస్తా అనుకుంటున్నావా? నీకు లాస్ట్ వీక్ నేను చెప్పాను నామినేషన్స్ గురించి మళ్ళీ డిస్కషన్ చేయకూడదు అని చెప్పాను కదా అని నాగార్జున ప్రశ్నించడంతో రాంప్రసాద్ ఏదో సంజాయిషీ చెప్పారు అందుకే నిన్ను కన్నింగ్ అని పిలిచేది అంటూ రాంప్రసాద్ పై ఫైర్ అయ్యారు. శాలిని పై కూడా నాగార్జున మండిపడ్డారు మీ ప్రవర్తన, మీరు మాట్లాడే విధానం ఆడియన్స్ కు కనుక నచ్చకపోతే మీరు ఎక్కడ ఉండాలి అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు అంటూ నాగార్జున కంటెస్టెంట్ లపై ఫైర్ అయ్యారు.
?stkn=MWE4NTZoM2lkMHVhag%3D%3D
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి గార్డెన్ ఏరియాకి పంపించిన త్రిగుణ్, అమన్,రోహిత్ గురించి నాగర్జున ఏం మాట్లాడుతారు వారు చేసిన తప్పులను నాగార్జున ప్రస్తావిస్తూ వారికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నారు అనేది తెలియాలి అంటే నేడు ప్రసారమయ్యే ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి. ఏది ఏమైనా కంటెస్టెంట్ల తీరుపై నాగార్జున పదింతలు రెచ్చిపోయి వారి తప్పొప్పులను గుర్తు చేస్తూ వారిని మందలిస్తున్నారు.
Also Read: నంది ఫిల్మ్ అవార్డుల పునరుద్ధరణ.. హర్షం వ్యక్తం చేసిన ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ !