E-Paper
Advertisement

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్
Advertisement

Michael Schumacher F1 Documentary: ఫార్ములా వన్‌ లోకి అడుగు పెట్టిన ఓ యువ డ్రైవర్… ఒక్క సీజన్‌ లోనే ప్రపంచ ఛాంపియన్‌గా మారితే ? 1994లో మైఖేల్ షుమాకర్ సాధించిన తొలి వరల్డ్ టైటిల్ వెనుక కేవలం వేగం మాత్రమే లేదు.. తీవ్ర ఒత్తిడి, వివాదాలు, విషాదాలు, ట్రాక్‌ పై హోరాహోరీ పోరాటం కూడా ఉన్నాయి. షుమాకర్ కెరీర్‌లో అత్యంత కీలకమైన ఆ సీజన్‌ను వ్యక్తిగత ఇంటర్వ్యూలు, అరుదైన ఆర్కైవ్ ఫుటేజ్‌తో మళ్లీ కళ్లముందుకు తీసుకొచ్చే స్పోర్ట్స్ డాక్యుమెంటరీ ‘షుమాకర్ 94 – ది బర్త్ ఆఫ్ ఎ లెజెండ్’ (Schumacher ’94 — The Birth of a Legend). మరి 1994 సీజన్ షుమాకర్ జీవితాన్ని ఎలా మార్చింది ? ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచే వరకు అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు ? అంటే..

కథలోకి వెళ్తే…

1994 ఫార్ములా వన్ సీజన్ ప్రారంభమైనప్పుడు మైఖేల్ షుమాకర్ అప్పటికే టాలెంట్ ఉన్న డ్రైవర్‌ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బెనెటన్ జట్టుతో పోటీ పడుతున్న అతడికి ఆ సీజన్ మాత్రం చాలా ప్రత్యేకమైనది. సీజన్ మొదటి రేసు బ్రెజిల్ గ్రాండ్ ప్రిక్స్‌ లోనే షుమాకర్ విజయం సాధించడంతో ఛాంపియన్‌షిప్ పోరులో తన ఉనికిని గట్టిగా చాటుకున్నాడు. ఆ తర్వాతి రేసుల్లో కూడా అతడి ప్రదర్శన కొనసాగడంతో టైటిల్ రేసు క్రమంగా అతడి వైపు మళ్లింది.

Advertisement

అయితే 1994 సీజన్‌ను కేవలం రేసింగ్ విజయాల కథగా చెప్పలేం. ఇమోలా గ్రాండ్ ప్రిక్స్ సమయంలో జరిగిన విషాద ఘటనలు ఫార్ములా వన్ ప్రపంచాన్ని కుదిపేశాయి. అయర్టన్ సెన్నా మరణం తర్వాత ఈ రేసింగ్ స్పోర్ట్స్ భద్రతపై చర్చ మొదలైంది. ఇలాంటి విషాదకరమైన వాతావరణంలోనే షుమాకర్ తన రేసింగ్ ప్రయాణాన్ని కొనసాగించాల్సి వచ్చింది. అప్పటికే ఛాంపియన్‌షిప్ కోసం ఒత్తిడి పెరుగుతుండగా, ట్రాక్ వెలుపల జరిగిన పరిణామాలు కూడా సీజన్‌ను మరింత ప్రత్యేకంగా మార్చాయి.

రేసులు ముందుకు సాగుతున్న కొద్దీ షుమాకర్‌కు ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. ప్రతి పాయింట్ కీలకంగా మారిన పరిస్థితుల్లో ఒక్క తప్పిదం కూడా ఛాంపియన్‌షిప్‌ను మార్చే అవకాశం ఉంది. వేగంతో పాటు రేస్ వ్యూహం, కారు పనితీరు, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం షుమాకర్‌కు కీలకంగా మారతాయి. మరోవైపు అతడి డ్రైవింగ్‌పై, బెనెటన్ కారు పనితీరుపై కూడా పలు చర్చలు, వివాదాలు తలెత్తుతాయి. డాక్యుమెంటరీ ప్రత్యేకత ఇక్కడే కనిపిస్తుంది. 1994లో ఏం జరిగిందనే విషయాన్ని కేవలం బయటి విశ్లేషణలతో కాకుండా… ఆ కాలానికి సంబంధించిన వ్యక్తిగత జ్ఞాపకాలు, పాత రేసింగ్ దృశ్యాలు, షుమాకర్‌కు సంబంధించిన ఆర్కైవ్ మెటీరియల్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తుంది.

Advertisement

అప్పటి షుమాకర్ ఎలా ఉండేవాడు? ప్రపంచ ఛాంపియన్‌షిప్ తనకు ఎంత ముఖ్యమైంది? అతడి చుట్టూ ఉన్న వ్యక్తులు ఆ ప్రయాణాన్ని ఎలా చూశారు? అనే అంశాలపై డాక్యుమెంటరీ దృష్టి పెడుతుంది. మైఖేల్ షుమాకర్‌తో పాటు కొరిన్నా షుమాకర్ కూడా ఇందులో కనిపిస్తారు. సీజన్ చివరి దశకు చేరుకునే కొద్దీ టైటిల్ పోరు మరింత ఉత్కంఠగా మారుతుంది. 25 ఏళ్ల వయసులో ఉన్న షుమాకర్ తన కెరీర్‌లో తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అత్యంత దగ్గరగా వస్తాడు. చివరకు బెనెటన్ తరఫున 1994 వరల్డ్ డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుని తన తొలి ప్రపంచ టైటిల్‌ను అందుకుంటాడు. అదే విజయం తర్వాత షుమాకర్ పేరు ఫార్ములా వన్ చరిత్రలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోవడానికి పునాది వేసింది.

అయితే ఆ తొలి టైటిల్ వెనుక ఉన్న ప్రయాణం ఎలా సాగింది ? సెన్నా మరణం తర్వాత మారిన ఫార్ములా వన్ ప్రపంచంలో షుమాకర్ ఎలా ముందుకు వెళ్లాడు ? టైటిల్ పోరులో ఎదురైన వివాదాలు, ఒత్తిళ్లు అతడిపై ఎలాంటి ప్రభావం చూపాయి ? 1994 సీజన్‌ను తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మార్చుకుని.. తర్వాతి సంవత్సరాల్లో రేసింగ్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి షుమాకర్ ఎలా ఎదిగాడు ? ఆ లెజెండరీ ప్రయాణాన్ని తెలుసుకోవాలంటే ఈ డాక్యుమెంటరీ చూడాల్సిందే.

తెలుగులో చూడొచ్చా ?

మైఖేల్ షుమాకర్ (Michael Schumacher), కొరిన్నా షుమాకర్ (Corinna Schumacher), ఫ్లావియో బ్రియాటోర్ (Flavio Briatore), బెర్నీ ఎక్లెస్టోన్ (Bernie Ecclestone), డేవిడ్ కౌల్తార్డ్ (David Coulthard) తదితరుల ఆర్కైవ్ ఫుటేజ్, ఇంటర్వ్యూలతో రూపొందిన ఈ జర్మన్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీకి క్రిస్టిన్ ఫ్రైటాగ్ (Christin Freitag) దర్శకత్వం వహించారు. సుమారు 1 గంట 45 నిమిషాల నిడివి ఉన్న ‘షుమాకర్ ’94 – ది బర్త్ ఆఫ్ ఎ లెజెండ్’ అక్టోబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ డాక్యుమెంటరీకి ప్రస్తుతం తెలుగు ఆడియో అందుబాటులో లేదు. జర్మన్, ఇంగ్లిష్ ఆడియో మాత్రమే ఉన్నాయి.

Read Also: ప్రేయసి ప్లేస్ లోకి వచ్చిన రోబోతో డేటింగ్… అది ఏం చేసిందో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే

Tags

Related News

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

జైలు నుంచి వచ్చిందే తమ్ముడి బెండ్ తీయడానికి.. రిహాబ్‌లో అన్నదమ్ముల మాస్ హంగామా… ఓటీటీలోకి ఇంటెన్స్ డ్రామా

24 ఏళ్లకే తండ్రి బాధ్యతలు తలపై పడితే… డైలీ సీరియల్ లెవెల్ గందరగోళం… క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

పాడుబడిన పిచ్చాసుపత్రిలో సెక్యూరిటీ మిస్సింగ్… తీరా చూస్తే స్పైన్ చిల్లింగ్ విజువల్స్

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పర్వతారోహణ… గుండె జారిపోయే అడ్వెంచర్

కోడలు రాకతో అత్తింట్లో మొదలయ్యే చావుల పరంపర… ఓటీటీలోకి డెడ్లీ హారర్ మూవీ

స్వేచ్ఛ కోసం జూ యానిమల్స్ చేసిన సాహసం… ఫన్నీ జంగిల్ జాతర

Big Stories

Advertisement
×