Nindu Noorella Saavasam Serial Today Episode : రణవీర్ లాయర్ కలుస్తాడు. ఇద్దరూ కలిసి కారులో వెళ్తుంటారు. కోర్టు రేపు ఉదయం 10 గంటలకు టైం ఇచ్చిందని లాయర్ చెప్తాడు. నువ్వు మనోహరి ముందే కోర్టుకు వస్తే జడ్జి ముందు ఏం చెప్పాలో చెప్తాను అంటాడు. దీంతో రణవీర్ రేపు ఎలాగైనా నాకు మనోహరికి విడాకులు వచ్చేలా చూడమని చెప్తాడు. దీంతో లాయర్ సరే అంటాడు. కానీ విడాకులు వచ్చే వరకు ఆస్థి కేసుకు వాయిదాలు ఎందుకు తీసుకుంటున్నావు. అంజలిని తీసుకుని వెళ్లి నీ కూతురు అని చెప్పి చూపించి ఆస్థిని నీ పేరు మీదకు మార్పించుకోవచ్చు కదా..? అంటాడు. దీంతో రణవీర్ విడాకులు కాకుండా ఆస్థి నా పేరు మీదకు వస్తే మనోహరి ఊరుకుంటుందా..? సగం ఆస్థి దక్కించుకోవడానికి తను ఏమైనా చేస్తుంది.
అందుకే ఆస్థి నా పేరు మీదకు వచ్చే టైంకి మనోహరి నా భార్య అయి ఉండకూడదు. రేపు మాకు విడాకులు రాగానే అమరేంద్ర దగ్గరకు వెళ్లి మనోహరి గురించి మొత్తం నిజం చెప్పేస్తాను అంటాడు. దీంతో లాయర్ షాకింగ్ గా చెప్పేస్తావా..? అదేంటి మనోహరికి చెప్పనని మాటిచ్చావు కదా..? అంటాడు. దీంతో రణవీర్.. నేను ఏడేండ్లు ఇలా రోడ్లు పట్టుకుని తిరగడానికి కారణం ఆ మనోహరిని అంత సులువుగా ఎలా వదిలేస్తాను. అమరేంద్రను పెళ్లి చేసుకోవడానికి మనోహరి చేసిన ప్రతి తప్పు.. తీసిన ప్రతి ప్రాణం గురించి అమరేంద్రకు చెప్పేస్తాను. అమరేంద్రకు భార్య అవడం అమరేంద్ర ప్రేమను పొందడమే తన జీవిత ఆశయం అని చెప్పింది. అది మనోహరి జీవితంలో దక్కకుండా చేస్తాను. అందరూ మనోహరి గురించి తెలిసిన షాక్‌లో ఉండగా అంజలిని తీసుకెళ్లి కోర్టులో చూపిస్తాను. మనోహరి నీ పతనానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయింది అంటూ రణవీర్ చెప్తాడు.
మరోవైపు ఇంట్లో పిల్లలు, అనామిక భోజనం చేస్తుంటారు. ఆకాష్ మాత్రం అనామిక నేను నీతోనే మాట్లాడుతున్నాను నాకు డిన్నర్ చేయాలని లేదు. ఏంటి నా మాటలు వినిపించడం లేదా..? అంటాడు. దీంతో అనామిక నువ్వు నా మాటలు విననప్పుడు నేను నీ మాట ఎందుకు వినిపించుకోవాలి అంటూ భోజనం కలిపి తినిపిస్తుంది. వెనకాలే రూంలోంచి వచ్చిన మనోహరి సైలెంట్‌గా చూస్తుంది. ఇంతలో అమ్ము అవును అనామిక డాడీ, మిస్సమ్మ, తాతయ్య వాళ్లు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. దీంతో అనామిక అక్కడ వాళ్ల ఫ్రెండును కలవడానికి వెళ్లారు. స్టార్ట్ ఆయ్యారంట ఒక అరగంటలో వస్తామన్నారు అని చెప్తుంది. తల్లి లేని పిల్లల మీద జాలి చూపిస్తుందా..? లేక తల్లిలా ప్రేమను పంచుతుందా..? అని మనోహరి మనసులో అనుకుంటుంది.
నీకు పొట్ట లైటుగా ఉంటే నిద్ర కూడా లైటుగా వస్తుందని తెలిసి డిన్నర్ ఎందుకు స్కిప్ చేస్తున్నావో నాకు తెలియడం లేదు. పగలంతా ఆడతూ ఉంటావు రాత్రి తినకపోతే పొద్దున్నే ఎనర్జీ ఎలా వస్తుంది చెప్పు. రేపటి నుంచి డిన్నర్ స్కిప్ చేశావో పనిష్‌మెంట్ కింద ఎక్కువ ఫుడ్ పెట్టేస్తాను అంటూ తినిపిస్తుంది. పిల్లల అందరూ ఆరును గుర్తు చేసుకుంటారు. ఆరుతో కలిసి డిన్నర్ చేసిన విషయం గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంటారు. దీంతో అనామిక మీ అమ్మ మీకు దూరం అయ్యుండొచ్చేమో కానీ అమ్మ ప్రేమ దూరం కాలేదు. అరుంధతిగా మీ నుంచి దూరం అయిన ప్రేమ భాగీగా తిరిగి వచ్చింది. నాకు తెలుసు మీరు మీ అమ్మ స్థానాన్ని ఎవ్వరికీ ఇవ్వలేరని. కానీ ఒక్కసారి భాగీకి మీ అమ్మగా చాన్స్ ఇచ్చి చూడండి అని చెప్తుంది. దీంతో అమ్ము తనే మా అమ్మ ఇష్టపడిన ఆర్‌జే భాగీ అని తెలిశాక అంజు కూడా మిస్సమ్మ పార్టీలోకి వచ్చేసింది అని చెప్పగానే అంజు అవునని చెప్తుంది. దీంతో అనామిక మీరు చాన్స్ ఇవ్వమన్నది ఆర్‌జే భాగీకి కాదు మీ అమ్మ భాగీకి అని చెప్పగానే పిల్లలందరూ ఎమోషనల్ అవుతుంటారు. భాగీని గుర్తుకు తెచ్చుకుంటారు. మనోహరి షాక్ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?