Nindu Noorella Saavasam Serial Today Episode : ఎవరెన్ని చెప్పినా వినకుండా అమర్ ఫారెస్ట్ లోకి వెళ్తాడు అమర్. టార్చిలైట్ తీసుకుని పిల్లల ఉన్న బంగ్లా కోసం వెతుకుతుంటాడు. ఇంతలో ఆరు ఆత్మ పిల్లలు ఉన్న బంగ్లా దగ్గరకు వెళ్లి పిల్లలను చూస్తుంది. అందరూ బాధపడుతుంటే ఆరు బాధపడుతుంది. మీ నాన్నా వస్తున్నారు మిమ్మల్ని కాపాడతాడు అంటుంది. అంజు, అమ్ము, ఆకాష్, ఆనంద్ మీరేం కంగారు పడకండి మీ డాడీ వస్తున్నారు అని చెప్తుంది. మరోవైపు ఫారెస్ట్ లోపలకి వెళ్లిన అమర్ ఏమైందని మేజర్ అడగ్గానే లాండ్‌మైన్ మీద కాలు పెట్టానని చెప్తాడు. దీంతో అందరూ భయపడతాడు. ఇంతలో గజమయూరి పాము అమర్ దగ్గరకు వస్తుంది.
అది అమర్‌ను చంపడానికి ప్రయత్నిస్తుంది. వాకీటాకీలో అమర్ ఏమైందని అడుగుతారు మేజర్, మిస్సమ్మ.. వాకీటాకీ దూరంగా పడటంతో అమర్ మాట్లాడడు. దీంతో మిస్సమ్మ భయంతో ఫారెస్ట్ లోకి వెళ్తుంది. అక్కడ అమర్ గజమయూరి పాము అమర్ మీద దాడి చేయడం చూసిన మిస్సమ్మ దగ్గరలో ఉన్న నిప్పు కణికలు విసురుతుంది. పాము తిరిగి మిస్సమ్మ వైపు చూసి మిస్సమ్మ మీదకు వెళ్తుంది. మిస్సమ్మ పారిపో.. అంటూ చెప్తాడు. మిస్సమ్మ ఎంత పరిగెత్తినా.. పాము వెనకాలే వెళ్తుంది. కొండల చివరకు వెళ్లిన మిస్సమ్మ ప్రాణాలతో పోరాడుతుంది.
ఇంతలో లాండ్‌మైన్ మీద పెద్ద బండరాయి పెట్టి అమర్ పరుగెత్తుకెళ్లి మిస్సమ్మను కాపాడతాడు. ఇంతలో రాథోడ్ వస్తాడు. రాథోడ్ మిస్సమ్మను తీసుకెళ్లు అని చెప్తాడు. పదమ్మా మిస్సమ్మ వెళ్దాం అంటాడు. మిస్సమ్మ వెళ్లదు. నేను ఉన్నాను. పిల్లలను తీసుకుని వస్తాను. నువ్వు వెళ్లు అని చెప్తాడు అమర్. పద మిస్సమ్మ సార్ చూసుకుంటారు. అని మిస్సమ్మను తీసుకెళ్తాడు. ఆర్మీ ఆఫీసర్ ఏం జరిగిందని అడగ్గానే అక్కడ జరిగిన విషయం గజమయూరి చనిపోయిన విషయం చెప్తాడు రాథోడ్.
అమర్ బిల్డింగ్ దగ్గరకు వెళ్తాడు. వాకీటాకీలో సార్ పిల్లలు ఉన్న బిల్డింగ్ కనబడింది అని అమర్, మేజర్ కు చెప్తాడు. సూపర్ అక్కడ సిచ్చుయేషన్ ఏంటి అని మేజర్ అడుగుతాడు. నేను చూసుకుంటాను సార్ అని చెప్తాడు అమర్. బీకేర్ ఫుల్ అమర్ అంటూ మేజర్ జాగ్రత్తలు చెప్తాడు. అమర దగ్గరకు వెళ్లి ఒక్కోక్క రౌడీని చంపుతూ లోపలికి వెళ్తాడు. దగ్గరకు వచ్చిన అమర్‌ను అంజు చూసి డాడ్ అని పిలుస్తుంది. సైలెంట్‌గా ఉండమని అమర్ సైగ చేస్తాడు.. సరేనని అంజు అమ్ము, ఆకాష్, ఆనంద్‌లకు డాడ్ వచ్చాడని చెప్తుంది.
అమర్‌ను చూసిన పిల్లలు హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో అరవింద్, అమర్‌ను వెనక నుంచి తల మీద గట్టిగా కొడతాడు. దీంతో అమర్ స్పృహ తప్పి పడిపోతాడు. అమర్‌ను తాళ్లతో కట్టేసిన అరవింద్, అమరేంద్ర గారు ఎప్పుడూ చేయోద్దన్న పనే ఎందుకు చేస్తారు. నాకు మళ్లీ మళ్లీ కోపం వస్తుంది. రావొద్దన్నాను కదా..? ఎందుకు వచ్చారు అంటాడు. అరేయ్ ఇదొక్క పెద్ద స్నేక్ జోన్ అని అమర్ అనగానే మళ్లీ అదే కథా.. అంటాడు అరవింద్. ఇంతలో వాకీటాకీలో మేజర్ అమర్.. అంటూ పిలవగానే అరవింద్ ఏంటి మేజర్ గారు మీరు కూడా మాట మీద నిలబడరా..? దాన్ని చూస్తేనే మీలో సగం మంది చచ్చిపోతారు.
మీకు చెప్తే అర్థం కావడం లేదనే అమర్ వచ్చాడు. ముందు అక్కడి నుంచి వచ్చేయండి అంటూ మేజర్ వార్నింగ్ ఇవ్వగానే.. ఏంటి మేజరు పాము పడగ అని కొత్త కథలు నాకు చెప్పొద్దు. ఎలాగూ నా గిఫ్టు నాకు అందింది కాబట్టి అమరేంద్ర సంగతి చూసుకుంటా.. పొద్దున కళ్లా మా వాళ్లందరూ ఇక్కడికి వచ్చేలా చేయ్ అంటూ వాకీటాకీ కట్ చేస్తాడు. అమర్ కోపంగా అరేయ్ నీకు కావాల్సింది నా ప్రాణాలే కదా..? తీసుకో మీ వాళ్లను వదిలేస్తారు. నా మాట విని పిల్లలను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపో.. అంటాడు. అబ్బబ్బా ఏంటి అమరేంద్ర కొత్తగా ఏదైనా మాట్లాడతావు అంటే మళ్లీ పాత కథే మాట్లాడతావు.. నీకు చేయాల్సిన అతిథి మర్యాదలు చాలా ఉన్నాయి అవన్నీ చేసేస్తా.. అంటూ అరవింద్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అమర్ కోపంగా అరేయ్ అరవింద్ ఇక్కడకు రా.. అంటూ అరుస్తాడు.
మరుసటి రోజు తెల్లవారుతుంది. అమర్ కట్లు విప్పుకోవడానిక ప్రయత్నిస్తాడు. వాకీటాకీ పని చేయదు. మేజర్ రాథోడ్ తో మనం ఎన్ని సార్లు కాల్ చేసినా వాడు ఫోన్ తీయడం లేదు అంటాడు. మరేం చేద్దాం సార్ మిలటరీని రప్పిద్దామా..? అంటే వద్దు అమర్ వాళ్ల దగ్గర ఉన్నాడు అని చెప్తాడు. అరవింద్ రౌడీల దగ్గరకు వెళ్లి పిల్లలను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలి అని చెప్తాడు. బంగ్లా వెనక కొంచెం దూరం వెళితే హైవే వస్తుంది. అక్కడి నుంచి మనం నెక్స్ట్ స్టాప్ కు వెళ్దాం అని చెప్తాడు. సరే అంటాడు రాకీ.
అమరేంద్రను ఏం చేద్దాం అని రాకీ అడిగితే అమరేద్రంను తీసుకెళ్లడం అంటే పిన్ తీసిన గ్రెనేడ్ చేతిలో పెట్టుకున్నట్లు అందుకే అమర్ కథ ఇక్కడే ముగించేద్దాం అని చెప్పి వెళ్లి అమర్ కూర్చున్న కుర్చీకి టైం బాంబ్ పెట్టి వెళ్లిపోతారు. అంతా గమనిస్తున్న ఆరు బాధపడుతుంది. బాంబు ఏంట్రా మా ఆయన్ని ఏమీ చేయోద్దు అంటుంది. అరవింద్, రౌడీలు కలిసి పిల్లలను అక్కడి నుంచి తీసుకెళ్తారు. ఈ విషయం మిస్సమ్మకు చెప్పాలని ఆరు అక్కడి నుంచి వస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?