E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:   ఆరు ఫోటో హాల్‌ లోకి తీసుకొచ్చిన అమర్‌ – పై నుంచి హాల్‌లోకి వచ్చిన మిస్సమ్మ  

Nindu Noorella Saavasam Serial Today December 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:   ఆరు ఫోటో హాల్‌ లోకి తీసుకొచ్చిన అమర్‌ – పై నుంచి హాల్‌లోకి వచ్చిన మిస్సమ్మ  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode :  అమర్‌ స్టోర్ రూంలోకి వెళ్లి ఆరు ఫోటో తీసుకుంటాడు. ఫోటో చూస్తూ.. ఆరుతో ఉన్న మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఏడుస్తుంటాడు. చావు కూడా మనల్ని వేరు చేయలేదని నువ్వు అంటే నేను ఏమో అనుకున్నాను. కానీ నువ్వు చనిపోయినా కూడా నా చుట్టే ఉన్నావా..? అనుకుంటాడు. మరోవైపు మిస్సమ్మను బయటకు తీసుకుకెళ్లిన రాథోడ్‌.. మనోహరి స్మశానానికి వచ్చిన విషయం చెప్తాడు. దీంతో అసలు మనోహరి ఏం చేయాలనుకుంటుంది. మనోహరికి కావాల్సింది ఆయన పక్కన ఉండటం.. నేను లేకుండా పోవడం అయినా అక్క ఆస్థికలు తీసుకుని ఏం చేసుకుంటుంది. అంటూ ఆలోచిస్తారు.

ఇంతలో మనోహరి కచ్చితంగా ఘోర కోసమే ఆస్తికలు తీసుకోవాలని చూస్తుంది అని మిస్సమ్మ చెప్పగానే..  అంత కచ్చితంగా ఎలా చెప్తున్నావు మిస్సమ్మ అని రాథోడ్‌ అడుగుతాడు. నువ్వే ఆలోచించు అక్క ఆత్మ మన చుట్టే తిరుగుతుంది. అక్క చనిపోయిన  తర్వాతే ఘోర ఈ ఇంటి చుట్టు తిరుగుతున్నాడు. ఇంట్లోకి ఇన్ని సార్లు వచ్చిన ఘోర ఇంట్లోంచి ఏమీ తీసుకెల్లలేదు. ఘోరాకు హెల్ప్‌ చేస్తుంది మనోహరి అనే అనుమానం ఉంది. జరిగినవన్నీ ఒక్కసారి ఆలోచిస్తే క్లారిటీ వస్తుంది అని మిస్సమ్మ చెప్పగానే.. అంతే మిస్సమ్మ.. అసలు మా మేడం ఇంత కసాయి వ్యక్తితో ఎలా స్నేహం చేసింది అంటాడు రాథోడ్‌.

Advertisement

తన మాటలతో అందరినీ మాయ చేస్తుంది అని మిస్సమ్మ చెప్తుంది. అయితే సార్‌కు చెప్తామని రాథోడ్‌ అనగానే వద్దని ఎవ్వరూ నమ్మరని మనవి అనుమానాలు మాత్రమే అవి నిజం అవ్వాలంటే మనం సాక్ష్యాలు సంపాదించాలి. ఇక మనోహరి టైం దగ్గర పడింది అని మిస్సమ్మ చెప్పగానే మనం ఏదో ఒకటి చేయడానికి ముందే ఆ మనోహరి ఆస్థికలు తీసుకెళ్లి ఘోరాకు ఇస్తుందేమో అంటూ అనుమానం వ్యక్తం చేయగా.. అందుకే మనం ఒక ప్లాన్‌ చేద్దాం అని తన ప్లాన్‌ రాథోడ్‌కు చెప్పగానే.. సరే మిస్సమ్మ అంటాడు.

అమర్, ఆరు ఫోటో పెట్టకుండా ఏదైనా చేయాలని మనోహరి మనసులో అనుకుంటుంది. కిటికీలోంచి చూస్తున్న ఆరు కూడా భగవంతుడా ఇన్ని రోజులు మిస్సమ్మ నా ఫోటో చూడకుండా ఆపావు.. ఇంకొక మూడు రోజులు ఆపు స్వామి. పౌర్ణమి ముగిసిన తర్వాత ఎలాగో నేను పైకి వచ్చెదను అంత వరకు ఎలాగైనా ఆపు స్వామి అని ప్రార్థిస్తుంది. సమయం ముగిసిపోయాక ఆ జగన్నాథుడిని ప్రార్థించినా లాభం లేదు బాలిక అంటాడు గుప్త.

Advertisement

ఫోటో కోసం వెళ్లిన అమర్‌ ఇంకా రాలేదని పిలుచుకురావడానికి నిర్మల వెళ్తుంది. ఆరు ఫోటో చూస్తూ ఏడుస్తున్న అమర్‌ను ఓదారుస్తుంది. అరుంధతి ఎక్కడ పోలేదని ఎప్పుడు నీ పక్కనే ఉంటుందని పద నాన్నా వెళ్దాం అని చెప్పగానే అమర్‌ ఫోటో తీసుకుని హాల్‌ లోకి వస్తాడు. మనోహరి షాక్‌ అవుతుంది. బయటకు వెళ్లిన మిస్సమ్మ ను అమర్ పిలుస్తాడు. మిస్సమ్మ వస్తున్నాను అంటూ కిందకు వస్తుంది. అమర్‌, ఆరు ఫోటోను హాల్ లో పెడుతుంటే మనోహరి ఆపుతుంది. ఒక్క నిమిషం ఆగు అమర్‌ అని చెప్తుంది. స్వామిజీ చెప్పినట్టు చేయడం మంచిదే అందుకు ఆరు ఎక్కడ ఉన్నా సంతోషిస్తుంది. కానీ అంతకు మించి బాధపడుతుంది.

అని మనోహరి చెప్పగానే ఏం మాట్లాడుతున్నారు మనోహరి గారు అని మిస్సమ్మ అడుగుతుంది. ఆంటీ ఆరు బతికి ఉన్నప్పుడు మనం ఎలా చేసేవాళ్లం.. ఈ ఇంటి దేవతలా చూసేవాళ్లం. అలాంటిది ఆరు చనిపోయిన తర్వాత ఇన్ని రోజులకు ఆరు ఫోటో ముందు దీపం పెట్టి ఆస్థికలు పుణ్య నదుల్లో కలపాలనుకున్నాం. కానీ ఇలా ఆస్థికలు పెట్టి, దీపం వెలిగించి నన్ను దూరం చేసుకుంటారా…? అని బాధపడుతుంది. మనం ఇంట్లో దేవుడిని ఎలా పూజిస్తామో.. ఆరును కూడా అలాగే పూజిద్దాం అని చెప్తుంది. దీంతో శివరాం కూడా మనోహరి చెప్పింది నిజమే.. రేపు ఉదయం దేవుడి ముందు దీపం వెలిగించి ఆరు ఫోటో ముందు దీపం పెడదాం అంటాడు.

సరే నాన్నా.. మిస్సమ్మ రేపు ఉదయం మనిద్దరం కలిసి దీపం వెలిగిద్దాం అని చెప్పి ఫోటో నిర్మలకు ఇచ్చి వెళ్లిపోతాడు.. అస్థికలు లోపలికి తీసుకెళ్లు అంటూ నిర్మల, మిస్సమ్మకు చెప్పగానే అలాగేనని మిస్సమ్మ పైకి వెళ్తుంది. దీంతో ఊపిరి పీల్చుకున్న మనోహరి ప్రస్తుతానికైతే ఆపాను.. కానీ రేపు అది ఫోటో చూడకుండా పర్మినెంట్‌గా దాన్ని పంపించే ఏర్పాట్లు చేయాలి అని మనసులో అనుకుంటుంది. కిటికీలోంచి అంతా చూస్తున్న ఆరు కూడా హ్యాపీగా ఫీలవుతూ.. గుప్తను తిడుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

Karthika Deepam 2 Serial Today Episode November 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఇంట్లో వాళ్లతో చాలెంజ్ చేసిన జ్యోత్స్న 

Podarillu Today Episode : ముద్దులతో రెచ్చిపోయిన జంటలు.. పాపం చక్రీ.. మహాకు ముద్దుపెడతాడా..?

Brahmamudi Serial Today Episode November 8th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  ఇంట్లో మార్పులకు రాజు  శ్రీకారం – అయోమయంలో రేఖ

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న రమ్య .. పల్లవికి మరో షాక్.. రమ్యను కొట్టిన పల్లవి..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి అడ్డంగా ఇరుక్కుంటుందా..? అడ్డంగా బుక్కయిన అరుణ్.. హైలెట్ సీన్ ఇదే..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ దెబ్బకు భద్ర ఫ్యూజుల్ అవుట్.. ఇది కదా సర్ప్రైజ్.. నర్మదా ప్లానేంటి..?

Telugu TV Serials: టీవీ సీరియల్స్ వీక్లీ రిపోర్ట్.. ఆ సీరియల్ కు బిగ్ షాక్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Big Stories

Advertisement
×