E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను తిట్టిన అమర్  

Nindu Noorella Saavasam Serial Today February 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను తిట్టిన అమర్  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  గుడిలో గంట కొట్టడానికి వెళ్లిన మిస్సమ్మను చూసిన అమర్‌ షాకింగ్‌ గా అలాగే ఉండిపోతాడు. మిస్సమ్మ కూడా అమర్ ను చూసి అలాగే ఉండిపోతుంది. ఇంతలో బయటి నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన మనోహరి వాళ్లిద్దరిని చూసి షాక్‌ అవుతుంది. వెనకాలే చంభా వచ్చి చూసి షాక్‌ అవుతుంది. మనోహరి భయంగా చంభా నేను అనుకున్నట్టుగానే అయింది.  అమర్‌, భాగీ ఎదురుపడ్డారు అనగానే.. చంభా ఇద్దరూ ఇప్పుడు కలిసిపోతారేమో అంటుంది. అంజు మనసులో దేవుడా డాడ్ మిస్సమ్మను తిట్టకూడదు, కోప్పడకూడదు.. అనుకుంటుంది. అమ్ము కూడా డాడ్‌ మిస్సమ్మతో మాట్లాడాలి. మిస్సమ్మను క్షమించాలి అనుకుంటుంది. ఆనంద్‌ కూడా డాడ్‌ మిస్సమ్మను ఇంటికి రమ్మని చెప్పాలి ఫ్లీజ్‌ దేవుడా అనుకుంటాడు. ఆకాష్‌ కూడా డాడీ మిస్సమ్మ కలిసిపోవాలి దేవుడా..? అని అనుకుంటాడు.

కరుణ కూడా దేవుడా ఎట్లాంటి గొడవ లేకుండా ఇద్దరూ కలిసిపోవాలి అని మనసులో అనుకుంటుంది. అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు. అప్పుడే అమర్‌ గట్టిగా రాథోడ్‌ బండి తీయ్‌ పూజ అయిపోయింది. ఇంటికి వెళ్దాం.. బండి తీయ్‌ అంటున్నాను.. అనగానే.. రాథోడ్‌ బాధగా అదేంటి సార్‌ ఇన్ని సంవత్సరాల తర్వాత మిస్సమ్మ ఎదురు పడితే ఏం మాట్లాడకుండా వెల్లిపోదామా..?  అంటాడు. దీంతో అమర్‌ కోపంగా ఏం మాట్లాడదాము రాథోడ్‌ చెప్పాపెట్టకుండా చంటి బిడ్డతో వెళ్లిపోయింది. ఏంటి తనతో నేనేం మాట్లాడాలి. ఒక్కరోజు కాదు  వారం కాదు నెల కాదు తను వెళ్లిపోయి ఐదు సంవత్సరాలు అయింది. ఎందుకు వెళ్లిందో తెలియదు.. ఎక్కడుందో తెలియదు.. తన గురించి ఏ ఇన్ఫర్మేషన్‌ లేదు. నాకు ఎంత కోపంగా ఉంటుంది. అంటూ అమర్ తిడుతుంటే మనోహరి, చంభా హ్యాపీ ఫీలవుతుంటారు. అమర్‌ కోపంగా చెప్పా పెట్టకుండా వెళ్లిపోయేంతగా నేనేం తప్పు చేశాను. నా వల్ల ఏం పొరపాటు జరిగింది. ఈ ప్రశ్న నన్ను నేను ఎన్నిసార్లు వేసుకున్నానో నాకే తెలుసు.. ఆ ప్రశ్నకు సమాధానం తెలియక.. నేను ఎంత బాధపడి ఉంటాను. వద్దు రాథోడ్‌ బండ్‌ తీయ్‌ వెళ్లిపోదాం.. పదండి పిల్లలు అనగానే..

Advertisement

అంజు డాడ్‌ ఇన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చిన మిస్సమ్మను వదిలేసి ఎలా వెళ్తాం డాడ్‌ అంటుంది. దీంతో అమర్‌ కోపంగా తను మనల్ని వదిలేసి వెళ్లిపోయింది కదా..? ఎందుకు వెళ్లిందో.. ఎక్కడికి వెళ్లిందో.. అంటాడు. దీంతో అమ్ము ఎందుకు వెళ్లిందో ఎక్కడికి వెళ్లిందో అడగండి డాడ్‌..మిస్సమ్మ కనిపిస్తే.. అడుగుతాను అన్నారు కదా..? ఇప్పుడు అడగండి అంటుంది. ఆనంద్‌ కూడా కారణం లేకుండా మిస్సమ్మ ఏ పని చేయదని మీకు తెలసు కదా డాడ్‌ ఆ కారణం ఏంటో అడగండి డాడ్‌.. అనగానే.. ఆకాష్‌ కూడా మిస్సమ్మ ఎప్పుడూ అలా చేయలేదు కదా డాడ్‌.. మమ్మల్ని బాగా చూసుకుంది కదా..? ఈ ఒక్కసారికి మిస్సమ్మను క్షమించండి డాడ్‌ అనగానే.. అమర్‌ కోపంగా తను మీతో కూడా చెప్పకుండా వెళ్లిపోయింది. అలాంటి దాన్ని క్షమించమంటున్నారా..? తన కన్న బిడ్డను తీసుకుని స్వార్థంతో వెళ్లిపోయిన దాన్ని ఏ కారణం అడగమంటారు..?  వెళ్లేటప్పుడు ఒక లెటర్‌ రాయలేదు.. వెళ్లిన తర్వాత ఒక ఫోన్‌ చేయలేదు.. మనం బతికున్నామా..? చచ్చామా అని పట్టించుకోలేదు. అలాంటి దాన్ని ఏం అడగమంటారు.. ఎలా క్షమించమంటారు..? అంటూ అమర్‌ కోప్పడుతుంటే..

మిస్సమ్మ ఏడుస్తూ.. మీరు నాకు కొంత టైం ఇస్తే అసలు ఏం జరిగిందో మీకు చెప్తాను అండి అనగానే.. అమర్‌ కోపంగా అవసరం లేదు అంటూ తిడతాడు. దీంతో మిస్సమ్మ షాక్‌ అవుతుంది. వెనక నుంచి గమనిస్తున్న మనోహిరి, చంభా నవ్వుకుంటారు.. అమర్‌ పిల్లలను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.. తర్వాత పిల్లుల మిస్సమ్మకు ఫోన్ చేసి బుజ్జమ్మను చూడాలని ఉంది అంటారు. బుజ్జమ్మ పార్క్‌కు వెల్లిందని మిస్సమ్మ చెప్పగానే.. అయితే మేము పార్క్‌కు వస్తాము అని పిల్లలు రాథోడ్‌ను తీసుకుని పార్క్‌కు వెళ్తారు.. అక్కడ మిస్సమ్మను కలిసి బుజ్జమ్మ ఎక్కడ అని అడుగుతారు. మిస్సమ్మ దూరంగా ఆడుకుంటున్న బుజ్జమ్మను చూపిస్తే.. మేము అడిగింది ఈ బుజ్జమ్మను కాదు.. మన బుజ్జమ్మను అంటారు.. ఈ బుజ్జమ్మనే మన బుజ్జమ్మ అని మిస్సమ్మ చెప్పగానే.. పిల్లలు అందరూ వెళ్లి బుజ్జమ్మను హగ్‌ చేసుకుంటారు.. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×