E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode June 15th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ, అమర్ లను రౌండప్ చేసిన రౌడీలు

Nindu Noorella Saavasam Serial Today Episode June 15th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ, అమర్ లను రౌండప్ చేసిన రౌడీలు
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మను తీసుకుని బయటకు వెళ్లిన అమర్‌ కొంచెం దూరం వెళ్లాక కారు టైర్‌ పంచర్‌ అవుతుంది. కారు పక్కకు ఆపేస్తాడు అమర్‌. ఏమైందని మిస్సమ్మ అడగ్గానే.. కారు టైర్‌ పంచర్‌ అయినట్టు ఉంది అని చెప్పి కారు దిగి చూస్తాడు అమర్‌. మిస్సమ్మ కూడా కారు దిగి డిక్కీలో స్టెపినీ ఉంది సార్‌ అని చెప్పగానే.. అమర్‌ అనుమానంగా అంటే నువ్వు రెగ్యులర్‌గా నా కారులో వస్తుంటావు అన్నమాట అనగానే.. మిస్సమ్మ కంగారు పడుతూ.. అంటే ప్రతి కారులో స్టెపినీ ఉంటుంది కదా సార్‌ అలా చెప్పాను అనగానే.. అమర్‌ అనుమానంగా కారు గురించి కాదు నా గురించి నీకు చాలా విషయాలు తెలుసు కదా.. అయినా చెప్పవు కదా.. అనగానే..

మిస్సమ్మ అంటే అది సార్‌ అంటూ నసుగుతుంటే.. అమర్‌ అర్థం అయింది నాగతం గురించి చెబితే నాకు హెల్త్‌ ప్రాబ్లమ్‌ వస్తుంది. పోనీ నీ గురించి అయినా చెప్పొచ్చు కదా..? అని అడగ్గానే.. నా గురించి ఏముంటుంది సార్‌ అంటుంది మిస్సమ్మ. అయితే అమర్‌ మాత్రం నువ్వు ఎవరు..? ఈ ఇంట్లో ఎందుకున్నావు.. ఆ విషయం చెప్పొచ్చు కదా..? అని అడగ్గానే.. మిస్సమ్మ మనోహరి చెప్పింది కదా సార్‌.. నేను జస్ట్‌ కేర్‌ టేకర్‌ను అని చెప్పగానే.. అమర్‌ అనుమానంగా నువ్వు కేర్‌ టేకర్‌ అంటే నాకు నమ్మబుద్ది కావడం లేదు భాగీ.. మన మధ్య ఇంకా ఏదో ఉంది అని చెప్పగానే.. మిస్సమ్మ అలాంటిదేం లేదు సార్‌ అంటుంది. అప్పుడే అటు నుంచి కారులో వెళ్తున్న రౌడీలు అమర్‌ను చూసి కారు ఆపేసి దగ్గరకు వెళ్లి అమర్‌తో గొడవపడుతూ.. మిస్సమ్మతో మిస్‌ బిహేవ్‌ చేస్తారు.

Advertisement

అమర్‌ ఎవరు మీరు అని అడగ్గానే.. ఏంటి హీరో అప్పుడే మమ్మల్ని మర్చిపోయావా..? అప్పుడోసారి ఈ బేబీని టచ్‌ చేయబోతే.. మమ్మల్ని కొట్టావు కదా..? అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నాము.. మీ గురించి మొత్తం తెలుసు మాకు అని రౌడీలు అనగానే.. అమర్‌ మా గురించి మీకేం తెలుసు.. అంటాడు. మిస్సమ్మ మాత్రం టెన్షన్‌ పడుతుంది. మాకు పెళ్లైన విషయం చెప్తారేమో అని మనసులో అనుకుంటూ.. ఏయ్‌ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. లేదంటే పోలీసులకు ఫోన్‌ చేస్తాను అంటూ బెదిరిస్తుంటే.. నువ్వుండు భాగీ వీళ్లకేదో తెలుసు అంటున్నారు కదా..? అనగానే.. మిస్సమ్మ మాత్రం వాళ్లు రౌడీలు సార్‌ వాళ్లతో మనకెందుకు..? అనగానే.. మేము రౌడీలమని సార్‌కు తెలియదా..? ఏంటి..? మమ్మల్ని అంత సులభంగా మర్చిపోరులే..? రేయ్‌ సార్‌కు ఈ మధ్య యాక్సిడెంట్‌ అయి చిప్పు పోయిందట. మెమెరీ లాస్‌ అంటా.. అని ఇంకో రౌడీ చెప్పగానే..

అవునా అదేదో సినిమాలో హీరో గారి తలకు దెబ్బ తగిలి గతం మర్చిపోతే మళ్లీ తట మీద కొడితే మళ్లీ గతం గుర్తుకొస్తుంది కదా అలా జరుగుతుందా..? అని ఇంకో రౌడీ అంటాడు. అయితే అక్కడకు వెళ్లి రాడ్‌ తీసుకురాపోరా చెక్‌ చేద్దాం.. అంటూ రౌడీలు కర్ర తీసుకొచ్చి అమర్‌ను కొట్టబోతుంటే.. మిస్సమ్మ దయచేసి ఆయన్ని కొట్టొద్దు అంటూ ఆడ్డుపడితే మిస్సమ్మను తోసేసి రౌడీలు అమర్‌ను కొట్టబోతే.. అమర్‌ వాళ్లతో ఫైట్‌ చేస్తాడు.  రౌడీలందరూ రౌండప్‌ చేసి అమర్‌ను బిగ్గరగా పట్టుకుని కర్రతో తల మీద కొట్టబోతుంటే.. అప్పుడే మిస్సమ్మ వచ్చి రౌడీలందరినీ కొట్టి అమర్‌ను సేవ్‌ చేస్తుంది. మిస్సమ్మ రౌడీలను కొడుతుంటే.. అమర్‌ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

పవన్‌తో రీతూ పెళ్లి.. మొత్తానికి బయటపెట్టేశారు, ట్విస్ట్ ఏమిటంటే?

అవినాష్ దెబ్బకు నవ్యస్వామి షాక్!

ఎక్స్ లవర్ తో అడ్డంగా బుక్ అయిన రోహిణి.. !

సర్వస్వం అన్నాడు..8 ఏళ్లు వాడుకొని వదిలేసాడు- జబర్దస్త్ బ్యూటీ

Gundeninda GudiGantalu Today episode: మాణిక్యం పై ప్రశంసలు.. అడ్డంగా బుక్కయిన రోహిణి… బాలు ట్విస్ట్ అదుర్స్..

Podarillu Today Episode : కేశవ మాట విన్న శైలు.. చక్రీ మాటపై ఫైర్ .. శైలు ఎంట్రీతో వరాలు షాక్..

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న రామారాజు.. అయ్యో పాపం వేదవతి.. ధీరజ్, ప్రేమ కలిస్తారా..?

Brahmamudi Serial Today Episode July 31st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు వార్నింగ్ ఇచ్చిన ఐశ్వర్య

Big Stories

Advertisement
×