Nindu Noorella Saavasam Serial Today Episode : రామ్మూర్తి ఇంట్లోకి వెళ్లిన అమర్, మిస్సమ్మను మా ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చానని చెప్తాడు. దీంతో రామ్మూర్తి తీసుకెళ్లమని ఆడపిల్లకు పెళ్లాయ్యాక పుట్టినిల్లు కేవలం చుట్టాల ఇంటి లాంటిదని మెట్టినిల్లే తనకు శాశ్వతం అని చెప్తాడు. రామ్మూర్తి మాటలకు అమ్ము సంతోషంగా అయితే ఇప్పుడే మిస్సమ్మను తీసుకుని వెళ్తామని అడుగుతుంది. మిస్సమ్మకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వెళ్లండి. రెండు రోజుల తర్వాత వెళ్తానన్న నాకేం అభ్యంతరం లేదంటాడు రామ్మూర్తి. రామ్మూర్తి మాటలకు మిస్సమ్మ అయితే నేను రెండు రోజులు ఉండి వస్తాను అంటుంది.
రాథోడ్ గుర్రుగా చూస్తూ మిస్సమ్మ సారే వచ్చి అడిగాక మళ్లీ రెండు రోజులు అంటున్నావేంటి అంటాడు. అంటే ఆయన గట్టిగా పిలవడం లేదు.. మా నాన్నేమో రెండు రోజులు ఉండి వెళ్లమని ప్రేమగా అడుగుతున్నాడు అంటుంది మిస్సమ్మ. దీంతో అమర్ లేచి మిస్సమ్మ ఇంటికి వెళ్దాం పద. నేను పిల్లలు నిన్ను తీసుకెళ్లడానికే వచ్చాం. రెండు రోజులు ఆగి కాదు. ఇవాళే మాతో రా.. సరేనా..? అంటాడు. అమర్ మాటలకు ఎగిరిగంతేసినంత హ్యాపీగా మిస్సమ్మ సరేనండి ఇప్పుడే బట్టలు తెచ్చుకుంటాను అంటుంది. ఇంతలో రామ్మూర్తి బాబుగారు గంటన్నర సేపు రాహుకాలం ఉంది. అది వెళ్లాక మీరు వెళ్లండి అంతవరకు ఇబ్బందేం లేదు కదా..? అని అడుగుతాడు.
అమర్ ఏం లేదని చెప్తాడు. రామ్మూర్తి సంతోషంగా పిల్లలకు ఐస్ క్రీమ్ తీసుకురావడానికి బయటకు వెళ్తుంటే.. అమర్ కూడా బయటకు వెళ్లి మిస్సమ్మను మొన్న నేను ఇంట్లో తిట్టాను అని సారీ చెప్పబోతుంటే రామ్మూర్తి వద్దు బాబు మీరేం నాకు సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు. మిస్సమ్మను మీరు పెళ్లి చేసుకున్నాక మీ మధ్య ఏం జరిగినా దానికి మీకు మీరే సమాధానం చెప్పుకోవాలి అంటూ ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్తాడు. లోపలికి వచ్చిన అమర్ ఆశ్చర్యంగా మిస్సమ్మ పిల్లలకు అన్నం తినిపించడం చూస్తాడు.
గార్డెన్ లో పడుకుని ఉన్న యముడు సడెన్ గా నిద్ర లేచి ఎవరు నన్ను నా నిద్రను భంగం చేసింది అని గుప్తను అడుగుతాడు. దీంతో గుప్త ఎవరో పని గట్టుకుని వచ్చి మీ నిద్రా భంగం చేయరు ప్రభు.. ఆదిగో ఆ బాలిక వస్తుందిగా ఆమె చప్పుడే మీకు నిద్రాభంగం కలిగించింది అంటాడు. అయినా ఇంత కష్టంలో కూడా ఆ బాలిక అంత సంతోషంగా ఎలా ఉంది గుప్త అని యముడు అడుగుతాడు. అయ్యో ప్రభు ఇంత జరిగినా మీకు ఇంకా ఆ బాలిక గురించి అర్థం కాలేదా.. అంటూ ఆరు గురించి చెప్తాడు గుప్త. ఏది ఏమైనా ఈ అమావాస్య నాడు ఆ బాలికను మనం మన లోకానికి తీసుకెళ్లాలి గుప్త అంటాడు యముడు. దీంతో గుప్త వెటకారంగా నవ్వుతూ.. నా అనుభవంతో చెప్తున్నాను ప్రభు మనం అనుకున్నప్పుడు ఆ బాలిక రాదు అని చెప్తుంటే అప్పుడే అక్కడకు ఆరు వస్తుంది. యముడిని తన పొగడ్తలతో మెచ్చుకుంటుంది. దీంతో యముడు ఆరు చెప్పిన దానికి సరే అంటుంటాడు.
అమర్, మిస్సమ్మ, పిల్లలు, రాథోడ్ అందరూ ఇంటికి వస్తారు. వాళ్లను చూసిన ఆరు సంతోష పడుతుంది. నిర్మల వాళ్లకు దిష్టి తీయడానికి డోర్ దగ్గరకు వస్తుంది. అప్పుడే తన రూంలోంచి వచ్చిన మనోహరి మిస్సమ్మను చూసి కుళ్లుకుంటుంది. ఇంతలో అంజు ఇరిటేటింగ్ గా దిష్టి తీయడానికి వచ్చిన నిర్మలను నిమ్ము డార్లింగ్ ఇది నీకు కొంచెం ఎక్కువగా అనిపించడం లేదా..? అని అడుగుతుంది. లేదని.. ఇలా మీ అందరిని సంతోషంగా చూశారు కాబట్టే మిస్సమ్మ మ. ఇంట్లోంచి వెళ్లాల్సి వచ్చింది. మళ్లీ ఆ దేవుడి దయ వల్ల మీరందరూ కలుసుకున్నారు అంటుంది నిర్మల అయితే హారతి మిస్సమ్మకు కదా.. ఇచ్చుకోండి నేను వెళ్లిపోతాను అని అంజు వెళ్లబోతుంటే..
నువ్వు కూడా ఉంటేనే మన ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది అంజు నువ్వు కూడా ఉండు. మీరు తీయండి అత్తయ్యా.. అని మిస్సమ్మను అంజును పట్టుకుంటుంది. నిర్మల దిష్టి తీస్తుంది. మిమ్మల్ని చూసి ఈర్ష్య పడుతున్నవాళ్ల కండ్లు పోవాలి అంటూ శాపనార్థాలు పెడుతుంది నిర్మల. అంతా చూస్తున్న మనోహరి లోపలికి వెళ్లి డోర్ వేసుకుంటుంది. అందరూ వెళ్లిపోతారు. మిస్సమ్మ మాత్రం మనోహరి రూంలోకి వెళ్తుంది. ఏమైంది మను ముఖం అలా పెట్టుకున్నాను ఎందుకో నీ కాలు విరిగిందట కదా..? అదే బెణికిందట కదా..? ఎక్కడ పడితే అక్కడ కాలు దూరిస్తే ఇలాగే ఉంటుంది మను..
నన్ను పర్మినెంట్ గా పంపించేసి ఆయనతో నువ్వు పర్మినెంట్ గా సెటిల్ అవుదామనుకున్నావా..? అవును ఆరోజు పిల్లలు ఎందుకు అక్క ఫోటో చూసిన తర్వాతే నన్ను తిట్టుకోవడం మొదలు పెట్టారు. అంతా తెలుసుకుంటా మను. అంటూ మిస్సమ్మ వార్నింగ్ ఇవ్వడంతో మనోహరి షాకింగ్ గా చూస్తుంది. ఒక్కసారి తిరిగి వచ్చానని సంతోషపడకు అని మను అంటుంటే ఒక్కసారి కాదు నువ్వు ఎన్ని సార్లు పంపంచినా ప్రతిసారి మళ్లీ తిరిగి వస్తాను ఎందుకంటే అది నా పవర్ కాదు నా మెడలో ఉన్న దీని పవర్ అటూ తాళిబొట్టు చూపిస్తుంది మిస్సమ్మ.
గార్డెన్ లో ఉన్న యముడు ఉలిక్కిపడి లేస్తాడు. గుప్ప ఆశ్చర్యంగా ఏమైంది ప్రభు అని అడుగుతాడు. అటు గుప్త అంటాడు యముడు. గుప్త ఆకాశం వైపు చూసి అంటే అమావాస్య గడియలు ప్రారంభం అయ్యాయి. ప్రభు ఇంతకీ ఆ బాలికను ఎలా తీసుకెళ్లాలి అని గుప్త అడగ్గానే యముడు యమపాశం చూపిస్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.