Nindu Noorella Saavasam Serial Today Episode: ఇన్వెస్టిగేషన్‌కు హైదరాబాద్ వచ్చిన వైజయంతి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక తల పట్టుకుంటుంది మనోహరి. ఎలాగైనా వైజయంతి నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తుంది. అప్పుడే యాదమ్మ వచ్చి ఏమైంది మనోహరి భయపడుతున్నావా..? అని అడిగితే.. భయమా ఈ మనోహరికా..? అంటూ అవసరమైతే ఇంకో హత్య చేయడానికి కూడా నేను రెడీ అంటుంది. మనోహరి మాటలకు యాదమ్మ భయపడుతుంది. ఇప్పటికే పార్థు హత్య కేసులో నన్ను అనుమానితురాలిగా చేర్చారట ఇక కొత్తగా హత్య చేస్తే మనం నేరుగా జైలుకే వెళ్తాం మనోహరి అంటూ భయపడుతుంది మనోహరి కోపంగా యాదమ్మను తిడుతుంది.
వైజయంతి చెప్పడంతో సరస్వతి, రాజు ఇద్దరు కలిసి అమర్ ఇంటికి వెళ్తారు. వాళ్లను చూసిన మిస్సమ్మ ఏంటి మేడం చెప్పకుండా వచ్చేశారు. వస్తున్నామని ఒక్క కాల్ కూడా చేయలేదు.. ఏంటి విశేషం.. అంటూ అడగ్గానే.. ఏం లేదమ్మా.. వైజయంతి మేడం రమ్మన్నారు అందుకే వచ్చాము అంటుంది సరస్వతి. సరస్వతి ఆ మాటలు చెప్పగానే.. మిస్సమ్మ షాక్ అవుతుంది. మీరు వైజయంతి గారికి ఎలా తెలుసు అంటుంది. ఆమె పోలీస్ కదా మిస్సమ్మ పసిగట్టి ఉండొచ్చు అని రాథోడ్ చెప్తాడు. అయితే మనోహరి గురించి నిజం చెప్తారా మేడం అని మిస్సమ్మ అడిగితే.. నిజం చెప్పడానికే కదా మేడం వచ్చాము అంటాడు రాజు.
అయితే మనోహరి గురించి నిజం చెప్పొద్దని ఆ నిజం తెలిస్తే అమర్ తట్టుకోలేడని అందుకే నిజం చెప్పొద్దని అంటుంది మిస్సమ్మ. కానీ నిజం చెప్పకపోతే ఆ దుర్మార్గురాలి ఆగడాలు ఇంకా పెరిగిపోతాయి. ఇప్పటికే రెండు హత్యలు చేసింది. మనం మౌనంగా ఉంటే ఇంకా ఎంత మందిని చంపేస్తుందోనని సరస్వతి చెప్తుంది. ఎవరో కాదు మిస్సమ్మ అమర్ సార్నే చంపాలనుకుంది కదా ఆ రాక్షసిని నువ్వు ఇంకా క్షమిస్తావా..? అంటూ రాథోడ్ కోపంగా చెప్తాడు. కానీ మిస్సమ్మ మాత్రం మనోహరి గురించి వైజయంతి గారికి నిజం చెప్పొద్దని ప్రాదేయపడుతుంది.
అప్పుడే డోర్ చాటు నుంచి అమర్ వస్తాడు. అమర్‌ను చూసి అందరూ షాక్ అవుతారు. అమర్ మొత్తం విన్నాడేమోనని మిస్సమ్మ భయపడుతుంది. అమర్ మాత్రం తనకేమీ తెలియనట్టే ఏం చెప్పొద్దు భాగీ అని అడగ్గానే.. హమ్మయ్య ఆయన ఏమీ వినలేదన్నమాట అని మనసులో అనుకుంటుంది. అమర్ తానే వైజయంతికి వార్డెన్ గురించి చెప్పానంటాడు. మీరు మాత్రం మనోహరి గురించి తెలిసిన నిజాలు మొత్తం చెప్పండి అంటాడు అమర్. సరే సార్ మొత్తం చెప్పేస్తాము అంటుంది సరస్వతి.
సరస్వతి వార్డెన్, వైజయంతికి నిజం చెప్పడానికి వచ్చిందని తెలుసుకున్న మనోహరి టెన్షన్‌తో అటూ ఇటూ తిరుగుతుంది. యాదమ్మ వచ్చి ఏంటి మనోహరి దొరికిపోతావని భయంగా ఉందా.. ? ఆ సరస్వతి వార్డెన్ నిజం చెప్తే నీ పరిస్థితి ఏంటి..? నువ్వు జైలుకు పోతావా..? మనోహరి అంటూ అడగ్గానే.. మనోహరి కోపంగా అంతదాకా వస్తే పార్థుకు పట్టిన గతే ఆ వార్డెన్‌కు పడుతుంది అనగానే..
యాదమ్మ షాక్ అవుతుంది. ఏంటి మనోహరి చంపేయడం అంటే నీకు ఈజీ అయిపోయింది అంటూ భయపడుతుంది. అప్పుడే మనోహరి రూంలోకి రాథోడ్ వస్తాడు. ఆవిడ పిలుస్తుంది రండి అనగానే.. ఎవరు సరస్వతి వార్డెన్ పిలుస్తుందా రాథోడ్ అని యాదమ్మ అడిగితే మనోహరి కోపంగా చూస్తుంది. రాథోడ్ కోపంగా అంటే సరస్వతి వార్డెన్ వచ్చింది దొంగచాటుగా చూశారన్నమాట అంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.