Nindu Noorella Saavasam Serial Today Episode: లోయ దగ్గరకు పార్థును తీసుకెళ్లిన మనోహరి లోయలోకి తోసేస్తుంది. దీంతో పార్థు పక్కనే ఉన్న చెట్టు కొమ్మను పట్టుకుని వేలడుతూ మనోహరి ఎంత పని చేశావు అంటే మనోహరి షాక్ అవుతూ పార్థు నువ్వు ఇంకా చనిపోలేదా..? అంటూ పక్కనే ఉన్న కర్ర తీసుకుని పార్థు చేతులను కొడుతుంది. పార్థు చేతులు వదిలేయగానే లోయలోకి పడిపోతాడు. అంతా కారు డ్రైవర్ సీతారాం చూసి స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడే అక్కడకు వచ్చి అమర్, మిస్సమ్మ చూసి షాక్ అవుతారు. వాళ్లను చూసిన మనోహరి గట్టిగా ఏడుస్తున్నట్టు పార్థు అంటూ పిలుస్తూ నాటకం ఆడుతుంది. దగ్గరకు వెళ్లి పార్థు లోయలోకి పడిపోయాడని చూసిన మిస్సమ్మ స్పృహ కోల్పోతుంది. అమర్, మిస్సమ్మను లేపేందుకు ప్రయత్నిస్తాడు కానీ లేవదు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తాడు. పోలీసులు వచ్చి పార్థు కోసం వెతుకుతుంటారు.
యమలోకంలో ఉండి మాయాదర్పణంలో అంతా చూస్తుంటాడు గుప్త. పార్థు లోయలోకి పడిపోగానే.. మాయాదర్పణం మూసేసి ఎమోషనల్ అవుతాడు. ఈ విషయం తెలిస్తే అరుంధతి బాలిక ఆత్మ ఎంత బాధపడుతుందోనని మనోహరి ఆగడాలకు అంతే లేదా అంటూ నారదుడిని ప్రశ్నిస్తాడు. అందుకు నారదుడు ఏంటి గుప్త నువ్వు మానవుడిలా ప్రవర్తిస్తున్నావు అంటూ చెప్తాడు. కానీ గుప్త ఎమోషనల్ అవుతూనే ఉంటాడు.
పార్థు చనిపోయిన విషయం ఢిల్లీ పోలీస్ కమీషనర్ అయిన వైజయంతి ఐపీఎస్‌కు చెప్తారు పోలీసులు. ఆవిడ గుడిలో పార్థు పేరు మీద అర్చన చేయిస్తుంది. అప్పుడే కులుమనాలిలో పార్థు శవం కోసం పోలీసులు వెతుకుతుంటారు. అదే సమయంలో ఆవిడ దగ్గరకు ఢిల్లీ పోలీసులు వెళితే తాను లీవ్‌లో ఉన్నానని లీవ్ లో ఉండే కూడా ప్రశాంతంగా ఉండనివ్వారా అంటూ కోప్పడుతుంటే పార్థు గురించి చెప్తారు పోలీసులు. దీంతో ఆమె షాకింగ్‌గా గుడి నుంచి వెళ్లిపోతుంది.
స్పాట్‌లో ఏడుస్తూ నటిస్తున్న మనోహరి అసలు అమర్, మిస్సమ్మలు ఈ ప్లేస్‌కు ఎలా వచ్చారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చి ఇక్కడి దాకా ఇంత త్వరగా ఎలా వచ్చారు. ఇంకా నయం వాళ్లు రాక ముందే పార్థు పని చేసేశాను.. అయినా ఈ సీతారాం గాడు చూశాడు. ఇప్పుడు వాడు స్పృహలోకి వస్తే ఏం చెప్తాడో ఏంటో.. ఈ భాగీ కూడా స్పృహలోకి వస్తే ఏం మాట్లాడుతుందో ఏంటో అని మనసులో ఆలోచిస్తూ… బయటకు మాత్రం ఏడుస్తున్నట్టు నటిస్తుంది.
అప్పుడే కింద వెతుకుతున్న పోలీస్ ఒకరు పైకి అమర్ దగ్గరకు వస్తారు. ఏమైంది బాడీ ఆచూకీ తెలిసిందా అని అమర్ అడిగితే.. దొరకలేదని పోలీస్ చెప్తాడు. ఇంకా కిందకు వెళ్లి వెతకండని అమర్ చెబితే.. ఇంకా కిందకు వెళితే ఆక్సిజన్ ఉండదని ఆ కిందకు పడిపోయి ఉంటే పార్థు చనిపోయి ఉంటాడని డెడ్ బాడీ మంచులో కూరుకుపోయి ఉంటుందని.. ఇది సూసైడ్ స్పాట్.. ఇక్కడ రోజు ఇలాంటి కేసులు మామూలే సార్ అంటూ చెప్తాడు. అంతా వింటున్న మనోహరి హమ్మయ్య ఇందాకటి నుంచి పార్థు చచ్చాడా..? బతికాడా అనే అనుమానం ఉండేది ఇప్పుడు చనిపోయాడని క్లారిటీ వచ్చి ఇక నేను ఫ్రీబర్డ్ అని మనసులో అనుకుంటూ బయటకు ఏడుస్తున్నట్టు నటిస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.