BigTV English
Advertisement

Nindu Noorella Saavasam Serial Today September 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ పరువు తీసేసిన మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today September 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ పరువు తీసేసిన మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today Episode:  స్వామిజీ రూపంలో వెళ్లిన గుప్త ఆరు ఆస్థికలను వీలైనంత త్వరగా గంగలో కలపమని  చెప్పి వెళ్లిపోతాడు. దీంతో మిస్సమ్మ ఎవరండి ఈయన అక్క ఆస్థికలు గంగలో కలపమని చెప్తున్నాడు అని అడుగుతుంది. దీంతో అమర్‌ అరుంధతి మంచి కోసం అని చెప్పాడు కదా..? తను మళ్లీ పుట్టాలి. రాథోడ్‌ ఆస్థికలు నిమజ్జనం చేద్దాం ఆ ఏర్పాట్లు చూడు అని చెప్తాడు అమర్. రాథోడ్‌ అలాగే సార్‌ అంటూ వెళ్లిపోతాడు. గుమ్మం దగ్గర నిలబడి అంతా వింటున్న ఆరు ఎమోషనల్‌ అవుతుంది.


తర్వాత రాథోడ్‌, మిస్సమ్మ దగ్గరకు వెళ్లి ఇతకీ సారుకు అసలు విషయం చెప్పావా లేదా అని అడుగుతాడు. ఏం విషయం రాథోడ్‌ అని మిస్సమ్మ అడగ్గానే.. రణవీర్‌ వైఫ్‌ మనోహరి అన్న విషయం చెప్పావా లేదా..? అని అడుగుతాడు. అది ఇంకా కన్ఫం కాలేదు కదా అంటుంది మిస్సమ్మ.. కానీ మనోహరి బ్లడ్‌ అంజుకు మ్యాచ్‌ అయింది కదా..? అంటాడు రాథోడ్‌. ఆ బ్లడ్‌ గ్రూప్‌ ఎవ్వరికైనా ఉండొచ్చు అంటుంది మిస్సమ్మ. ముందు నుంచి మనం డౌటు పడుతూనే ఉన్నాము కదా మిస్సమ్మ.. రణవీర్‌ వైఫ్‌.. అంజు పాప మథర్‌ మనోహరే అనటానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి అంటాడు రాథోడ్‌. ఆ సాక్ష్యం చెప్పాల్సింది సరస్వతి మేడం.. ఆవిడేమో మళ్లీ కనిపించకుండా పోయారు. ఎప్పుడు దొరుకుతారో ఏమో.. అని బాధపడుతుంటే.. ఆవిడ కోసం వెయిట్‌ చేయడం వేస్ట్‌ మిస్సమ్మ.. మన మనసుల్లో డౌట్స్‌ సారుకు చెబితే.. ముందు మనోహరిని ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు అంటాడు రాథోడ్‌.

దీంతో ఆయన ఆ పని చేయరు చేయకూడదు కూడా అంటుంది మిస్సమ్మ. ఎందుకు మిస్సమ్మ అని రాథోడ్‌ అడగ్గానే.. ఆయన అరుంధతి అక్కకు మాటిచ్చారు. ఈ విషయం ఆయనే నాతో స్వయంగా చెప్పారు. అందుకే మనోహరిని పంపించమని నేను ఆయనతో చెప్పలేను అంటుంది మిస్సమ్మ. అందుకని అరుందతి మేడంను చంపిన హంతకురాలిని.. కన్నబిడ్డను పురిటిలోనే వదిలించుకున్న కసాయిదాన్ని అలాగే వదిలేస్తావా మిస్సమ్మ.. తనకు శిక్ష పడేలా చేయవా..? అంటూ రాథోడ్‌ అడగ్గానే.. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది రాథోడ్‌. మనోహరి దుర్మార్గాల గురించి ఆయనతో చెబితే వెంటనే తనను ఇంట్లోంచి పంపించేస్తారు కానీ అక్కకు ఆయన ఇచ్చిన మాట పోతుంది అంటుంది మిస్సమ్మ..


కానీ తను నీ స్థానాన్ని ఆశిస్తుంది మిస్సమ్మ దాని కోసం తను ఎంత కైనా తెగిస్తుంది. అంటూ రాథోడ్ ఎమోషనల్‌గా చెప్పగానే.. తెలుసు రాథోడ్‌.. తన వల్ల నాకు ప్రమాదం ఉందని  తెలుసు.. తనన బయటకు పంపిస్తే.. ఆ ప్రమాదం ఆయనకో పిల్లలకో జరిగే అవకాశం ఉంది. మనోహరి ఇంటి నుంచి వెళ్లిపోతే.. ఆయన ఎప్పటికీ దక్కడనే కోపంతో మనోహరి దేనికైనా తెగించవచ్చు. నాకు ఏమైనా పర్వాలేదు రాథోడ్‌. కానీ ఆయనకు కానీ పిల్లలకు కానీ ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను అందుకే ఓపిక పడుతున్నాను.. మంచిగా మారడానికి ఆ మనోహరికి అవకాశం ఇస్తున్నాను.. తను మారకపోతే కాలమే తనకు బుద్ది చెప్తుంది అంటూ మిస్సమ్మ చెప్పగానే.. నీ మంచితనమే మనోహరికి బలమైంది మిస్సమ్మ.. మీరన్నట్టు దేవుడే తనను శిక్షించాలి అంటూ రాథోడ్‌ వెళ్లిపోతాడు.

తర్వాత  మేజర్‌ ఇంట్లో జరిగే పార్టీకి అమర్‌, మిస్సమ్మ వెళ్తారు. అక్కడ అమర్‌, మేజర్‌తో మాట్లాడుతుంటే.. మిస్సమ్మకు దాహం వేసి వాటర్‌ అనుకుని మందు తాగుతుంది. మరోవైపు మనోహరి రౌడీ నాగుకు ఫోన్‌ చేస్తుంది. ఒక పార్టీకి ఇద్దరు వెళ్లారు.. వాళ్లల్లో ఒకరిని చంపాలని చెప్తుంది. ఎవరిని చంపాలో క్లియర్‌గా చెప్పమని అడుగుతాడు నాగు.. మిస్సమ్మను చంపమని ఫోటో సెండ్‌ చేస్తుంది మనోహరి. సరేనని బాగా మందు తాగి మిస్సమ్మను చంపడానికి మేజర్‌ ఇంటికి వెళ్తారు. అక్కడ మందు తాగి మైకంలో ఉన్న మిస్సమ్మ అందరి ముందు డాన్స్‌ చేస్తుంది. అమర్‌ ఎంత పట్టుకున్నా ఆగదు. అమర్‌ను కూడా డాన్స్‌ చేయమని లాగుతుంది. అమర్‌ మాత్రం సిగ్గు పడుతూ మిస్సమ్మను ఊరుకోమని చెప్తుంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Rashmika Manadanna: ఆ ‘ రింగ్ ‘ నాకు స్పెషల్.. నిజం చెప్పేసిందండోయ్…

Jabardasth: జబర్దస్త్ షో నుంచి ఏకంగా 6 మంది గుడ్ బై.. అసలేం జరుగుతోంది?

Sai Kiran: 47 ఏళ్ల వయసులో శుభవార్త చెప్పిన సాయికిరణ్.. పోస్ట్ వైరల్!

Illu Illalu Pillalu Today Episode: అమూల్యకు ప్రపోజ్ చేసిన విశ్వం.. శ్రీవల్లికి కొత్త టెన్షన్.. భద్రకు బిగ్ షాక్..

Brahmamudi Serial Today November 4th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీని రాహుల్‌కు దూరం చేసిన గోల్డ్‌ బాబు

Intinti Ramayanam Today Episode: ప్రాణాలతో బయటపడ్డ అక్షయ్.. తల్లిని కలుసుకున్న అవని.. ఇంట్లో అంతా హ్యాపీ..

GudiGantalu Today episode: సుశీల కోసం వెనక్కి తగ్గిన బాలు.. దొరికిపోయిన మనోజ్.. ప్రభావతికి షాక్..

Nindu Noorella Saavasam Serial Today November 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: గుప్త రింగ్ కొట్టేసిన ఆరు  

Big Stories

×