Ayyanna Patrudu: అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. స్పీకర్-డిప్యూటీ స్పీకర్ జగన్ అసెంబ్లీకి రావాలని ఎందుకు పట్టుబడుతున్నారు? రాకుంటే చర్చలు తప్పవా? స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మెట్టు దిగుతారా? గతంలో మాదిరిగా వ్యవహరిస్తారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. అసలేం ఏం జరగబోతోంది?
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు వచ్చేవారం నుంచి మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారా? ముఖ్యంగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రావడం ఈసారి డౌటేనా? అసలు వైసీపీ నేతలు ఏమంటున్నారు? దీనిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు.
మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు. నర్సీపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చారని, ఎలా మెలగాలో తెలియదా? అంటూ ప్రశ్నించారు. జగన్‌ని అతని తండ్రితో పోల్చలేమన్నారు. వైఎస్ఆర్ వేరు.. జగన్ వేరని కుండబద్దలు కొట్టేశారు.
శాసన కర్తలకు అసెంబ్లీ ఒక దేవాలయం లాంటిదని, అందులో తాను పూజారిని మాత్రమేనన్నారు స్పీకర్. వరాలిచ్చే అధికారం లేదని, కేవలం దేవుడి మాత్రమే ఉంటుందన్నారు. రూల్స్ ప్రకారం తాను ప్రతిపక్ష హోదా జగన్‌కు ఇవ్వలేమన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ అంటున్నారని అన్నారు. దేవుడు రాసిన స్క్రిప్ట్ అని అందుకే పదకొండు సీట్లు ఇచ్చాడన్నారు.
ALSO READ: ఇకపై తిరుపతి నుంచి షిర్డీకి ప్రతీ రోజూ
ప్రెస్ మీట్‌లు పెట్టి మాట్లాడే మాటలు, అసెంబ్లీ కొచ్చి మాట్లాడాలని జగన్‌కి సూచన చేశారు స్పీకర్. తప్పులు జరిగితే అసెంబ్లీలో ప్రశ్నించే దమ్ము గానీ.. ధైర్యంగానే మీకు లేదా అంటూ ప్రశ్నించారు. మీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, మంచి సూచనలు చెయ్యాలన్నారు. తాను అసెంబ్లీకి రాను.. ఇంట్లోనే కూర్చొంటానని అంటే కుదరదన్నారు.
శవాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్తానని జగన్ అనుకుంటే దాన్ని ఫాలో కావాలన్నారు. ఏ రాజకీయ పార్టీకైనా రాష్ట్రం బాగుండాలనే దృక్పథం ఉండాలన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన మీరు, సమావేశాలకు రావాలన్నారు. సభకు రాకుండానే జీతాలు తీసుకునేందుకు మీకు మనసెలా అంగీకరిస్తోందని సూటిగా ప్రశ్నలు లేవనెత్తారు. దయచేసి ప్రజాస్వామాన్ని అవహేళన చేయకూడదని హితవు పలికారు.
వైసీపీ నేత సజ్జల కామెంట్స్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు స్పీకర్. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి జగన్ వస్తారని అంటున్నారని, భగవంతుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నారు. కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయన్నారు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం తాను అన్ని తనిఖీలు చేశానని, ఎక్కడ ఇవ్వాలని లేదన్నారు.
అయ్యన్నపాత్రుడు అనుకుంటే ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చని మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. ఈనెల 18 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు జగన్‌ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మిగతా ఎమ్మెల్యేలకు ఎంత సమయం ఇస్తున్నానో అంత సమయం జగన్‌కి ఇస్తానన్నారు.
అసెంబ్లీలో జగన్ ఓపెన్‌గా మాట్లాడాలని, తప్పులుంటే చెప్పాలన్నారు. దొంగ ప్రెస్ మీట్‌లు పెట్టి దొంగలు, పనికిమాలిన వాళ్ళ చేత మాట్లాడించి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయొద్దన్నారు. అసెంబ్లీకి రాణి ఎమ్మెల్యేలపై చర్చించి ఏకగ్రీవంగా తీర్మానం చేసి అమలు చేస్తామని చెప్పకనే చెప్పారు.
ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అసెంబ్లీ సమావేశాలకు వస్తారా? పులివెందుల బైపోల్‌కి సిద్ధమవుతారా? ఆయన ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. మరి ఆయన ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి.
వైఎస్ జగన్‌పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
దేవుడు ఇచ్చిన స్క్రిప్ట్ అది.. 11 రావాలనుకున్నాడు 11 ఇచ్చాడు
ప్రెస్ మీట్‌లు పెట్టి మాట్లాడే మాటలు అసెంబ్లీకొచ్చి మాట్లాడాలి
నేను అసెంబ్లీకి రాను ఇంట్లోనే కూర్చుంటాననడం పద్ధతి కాదు
– అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు pic.twitter.com/4jQxAjUQBV
— BIG TV Breaking News (@bigtvtelugu) September 9, 2025