E-Paper
Advertisement

Ninnu kori Serial Today Episode October 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎండింగ్ ఏపిసోడ్ ఇలా ముగుస్తుందనుకోలేదు

Ninnu kori Serial Today Episode October 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎండింగ్ ఏపిసోడ్ ఇలా ముగుస్తుందనుకోలేదు
Advertisement

Ninnu kori serial today Episode: విరాట్‌ నిజం చెప్పడంతో దాక్షాయణి ఏడుస్తుంది. నా కొడుకుని చివరి చూపులు కూడా చూసుకోలేకపోయాము అంటూ బాధపడుతుంది. ఎమోషనల్ అవుతూ రూంలోకి వెళ్లిపోతుంది. కేవవ ఏడుస్తూ కనీసం వాడికి ఘనంగా అంతక్రియలు కూడా జరిపించలేకపోయాము అంటాడు. సామ్రాట్ కు చంద్ర అంత్యక్రియలు జరిపించింది అని చెప్తాడు డాక్టర్‌. కేశవ థాంక్స్‌ చెప్తాడు.

రూంలోకి వెళ్లిన దాక్షాయణి నవ్వుకుంటుంది. అప్పుడే జీవన్‌ వెళ్తాడు. ఇక నీకు ఏ ప్రాబ్లమ్‌ లేదురా అంటుంది దాక్షాయణి. అవునమ్మా ఇక ఆ రామయ్య సంగతి తేల్చాలి అంటాడు జీవన్‌. వాడి గురించి వదిలేయ్‌రా మీ అన్నయ్య ప్రాణాలతో లేడన్న విషయం తెలిస్తే వాడు మనకు భయపడి ఎక్కడికో పారిపోతాడు అసలు నీకు బెంగే అవసరం లేదు.. ఇక ఈ ఆస్థి నీది అంటూ చెప్పగానే.. ఎలా అమ్మా అన్నయ్య పేరు మీద ఆస్థి నా పేరు మీదకు ఎలా వస్తుంది ఆయన రాసి ఇవ్వలేదు కదా అని జీవన్‌ అడిగితే అది నాకు వదిలేయ్‌ లాయరుకు ఇంత డబ్బు ఇస్తే అతనే చేస్తాడు. మీ నాన్న కూడా ఏమీ అనలేడు నేను రెండు కన్నీట్టి బోట్లు రాల్చి ఇక జీవనే మన వారసుడు అని ఏడిస్తే ఆయన కూడా ఏమీ అనడు అంటూ చెప్తుంటే.. అప్పుడే చంద్ర, విరాట్‌ వస్తారు.

Advertisement

దాక్షాయణి ఏడుస్తున్నట్టు నటిస్తుంది. విరాట్‌, చంద్ర ఇద్దరూ కలిసి దాక్షాయణి, సామ్రాట్‌ను చంపిన విషయం చెప్తారు. జీవన్‌ కోపంగా ఏయ్ ఏం మాట్లాడుతున్నారు మర్యాదగా బయటకు వెళ్లండి అంటే విరాట్‌ కోపంగా జీవన్‌ను కొడతాడు. దాక్షాయణి కోపంగా విరాట్‌ చోక్కా పట్టుకుని నా కొడుకు జోలికి వస్తే కొడుకు లాంటి వాణ్నే వదల్లేదు.. అలాంటిది నువ్వెంత నీ బతుకెంత అంటూ కొట్టబోతుంటే.. చంద్ర  అడ్డుపడుతుంది. నా భర్త జోలికి వస్తే నేను తక్కువ కాదు మేడం.. మర్యాదగా చేయి తీసి మీ మర్యాద కాపాడుకోండి అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. ఏం చేస్తున్నారు మీరు వీడు విరాటేనా..? లేక సామ్రాట్టా..? నా గురించి బయటపెట్టడానికి ఇదంతా చేస్తున్నారా..? అంటూ అడగ్గానే.. నేను విరాట్‌నే నాకు గతం మొత్తం గుర్తుకువచ్చింది.

ఇప్పటికిప్పుడు మీ గురించి బయట పెట్టొచ్చు కానీ సామ్రాట్ ఉంటే అలా చేసేవాడు కాదు అంటూ విరాట్‌ చెప్తే.. అసలు మీ గురించి మొత్తం తెలిసిన రోజే తన ఆస్థి మొత్తం మీ పేరు మీద రాశాడు. మీకు జీవన్‌కు తప్పు ఎవ్వరికీ ఈ ఆస్థి దక్కకూడదని వీలునామా రాశాడు అంటూ సామ్రాట్‌ రాసుకున్న డైరీని దాక్షాయణి చేతిలో పెడుతుంది. దాక్షాయణి డైరీ చదివి ఏడుస్తుంది. మా వల్ల నిజం ఎవ్వరికీ తెలియదు.. కానీ మీరు మారాలి. అలాగే రామయ్య కుటుంబాన్ని మీరే ఆదుకోవాలి అంటూ చంద్ర చెప్పగానే.. దాక్షాయణి ఏడుస్తూనే ఇక నేను జైలుకు వెళ్లాలి అంటూ ఏడుస్తుంటే.. వద్దని ఇకపై మంచి చేయండి. ప్రేమగా ఉండండి. ఈ ఊరి ప్రజలకు సామ్రాట్‌ లేని లోటు జీవన్‌ తీర్చాలి అంటూ చెప్పగానే.. దాక్షాయణి ఏడుస్తూ బయటకు పరుగెత్తి కేశవను హగ్‌ చేసుకుని బాధపడుతుంది.

Advertisement

బాధపడుతున్న శ్రీజను చంద్ర ఓదారుస్తుంది. నిజంగా మీ బావ తిరిగి వస్తే నిన్ను పెళ్లి చేసుకును మీ బావకు నిన్ను బాధపెట్టాను అనే గిల్టీ ఫీలింగ్‌ లేకుండా ఉండాలంటే నువ్వు ముందుకు మూవ్ అవ్వాలి అంటూ చెప్తుంది. నిన్ను చూశాక నాకు అక్కలా అనిపిస్తుంది. నిన్ను ఇన్ఫిరేషన్‌గా తీసుకుని నేను ముందుకు సాగుతాను అంటుంది శ్రీజ. ఇక విరాట్‌, చంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతారు. బయటకు వెళ్లిన చంద్ర మన ఇంటికి వెళితే మన వాళ్లు నిన్ను ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అని అనుమానపడితే.. ఇంట్లో వాళ్లను కన్వీన్స్‌ చేసే బాధ్యత నాది పద ఇంటికి వెళ్దాం అంటాడు. ఇద్దరూ కలిసి కారెక్కి వెళ్లిపోతారు. దీంతో నిన్ను కోరి సీరియల్‌ కు శుభం కార్డు పడుతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..

Saturday Tv Movies : శనివారం టీవీ సినిమా.. మూవీ లవర్స్ కు పండగే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సీతారాం ను మనోహరి చంపేస్తుందా..?  

రామ్ చరణ్ నన్ను నమ్మలేదు… ఒకేసారి అంత మాట అన్నారా: రంగస్థలం మహేష్

రెమ్యూనరేషన్ పై మహేష్ అచంట కామెంట్స్… రంగస్థలందే ఇప్పుడు తీసుకుంటున్నానంటూ!

రంగస్థలం మహేష్ బ్రేకప్స్ గురించి తెలుసా? అంతమంది ఎలా పడ్డారు బ్రో!

భార్యతో గొడవలు… సెలబ్రిటీల నుంచి ఫోన్లు.. అసలు విషయం చెప్పిన మహేష్!

Big Stories

Advertisement
×