Ninnu kori serial today Episode: రామయ్య గురించి ఆలోచిస్తుంటాడు సామ్రాట్. చంద్రతో తనకు వచ్చిన అనుమానం గురించి చెప్తుంటాడు. అప్పుడే వచ్చిన కేశవ దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడిగితే.. జీవన్ గురించి అడుగుతాడు. జీవన్ తప్పు చేశాడా లేదా అనే విషయం నిర్దారణ చేసుకోవాలి నాన్న అని అడిగితే.. తానైతే జీవన్‌ను పూర్తిగా నమ్ముతున్నానని ఎందుకంటే దాక్షాయణి జీవన్ గురించి చెప్పిందంటే నిజమే అయ్యుంటుందని కేశవ చెప్తాడు. ఆ మాటలకు చంద్ర షాక్ అవుతుంది. దాక్షాయణి చాలా తెలివిగా ఇంట్లో వాళ్లను నమ్మించిందని ముందు సామ్రాట్‌కు ఎలాగైనా నిజం తెలిసేలా చేయాలని చంద్ర మనసులో అనుకుంటుంది. ఒకవేళ జీవన్, దాక్షాయణిని కూడా మోసం చేస్తున్నాడేమో అంటూ సామ్రాట్ అనుమానం వ్యక్తం చేస్తే దాక్షాయణిని మోసం చేయడం అంత ఈజీ కాదు నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో అంటూ చెప్పి కేశవ వెళ్లిపోతాడు.
రామయ్య చెప్పింది నిజమా అబద్దమా అనేది తెలుసుకోవడం మీకు పెద్ద కష్టమేమీ కాదు అంటూ చంద్ర చెబితే.. మా అమ్మ ఏమనుకుంటుందో అంటే అయితే ఊరికే కూర్చోండి అంటుంది చంద్ర. నాకు కూడా రామయ్య మాటలు వింటుంటే నమ్మకంగానే ఉన్నాయని మీరు కూడా ఆదే కోణంలో ఆలోచించండి అంటూ చెప్పి వెళ్లిపోతుంది. చంద్ర వెళ్లిపోయాక సామ్రాట్ ఇది నిజమా అబద్దమా తెలుసుకోవాలి అనుకుంటాడు. రమేష్ అనే వ్యక్తిని పిలిచి జీవన్ గురించి రామయ్య కూతురు గురించి డీటెయిల్స్ అడుగుతాడు. తర్వాత రమేష్, జీవన్‌కు ఫోన్ చేసి సామ్రాట్ ఎంక్వైరీ చేస్తున్నాడని తనను కూడా ప్రశ్నించాడని చెప్తాడు. జీవన్ భయంగా అన్నయ్యకు పూర్తిగా నిజం తెలిసేలోపు ఏదో ఒకటి చేయాలి వెంటనే ఈ విషయం అమ్మకు చెప్పాలి అనుకుంటాడు.
ఇంటికి వచ్చిన జీవన్‌ను సామ్రాట్ విచారిస్తాడు. అందరూ వచ్చి ఆశ్చర్యంగా చూస్తుంటారు. దాక్షాయణి వచ్చి జీవన్‌ను వెనకేసుకొస్తుంది. అందుకు సామ్రాట్ కూడా జీవన్ తప్పు చేశాడేమో అనిపిస్తుందని వాడి మాటల్లో నిజాయితీ కనిపించడం లేదని జీవన్ అమ్మాయిని ఏడిపించడం ఊర్లో వాళ్లు చాలా మంది చూశారు. ఆ విషయం నాకు చెప్పారు. తమ్ముడి మీద ఓ కన్నేసి ఉంచాలమ్మా లేకపోతే వాడు చేయి దాటిపోతాడు అని చెప్పగానే.. నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను.. నువ్వు ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడుచేసుకోకు. వాడు నిజంగా అంత పని చేస్తే కొడుకు అని కూడా చూడను వాడి ప్రాణం తీస్తాను అంటూ చెప్పగానే.. అంతా వింటున్న చంద్ర బావను ఈవిడ ప్రాణాలతో ఉంచదు రేపే డాక్టర్ గారిని పిలిచి నిజం చెప్పించాలి అని మనసులో అనుకుంటుంది.
చంద్ర అనుమానించినట్టుగానే దాక్షాయణి తన రూంలోకి వెళ్లి దామెదర్‌కు ఫోన్ చేసి ఈ రాత్రికే సామ్రాట్ చనిపోవాలి.. నువ్వేమైనా చేయ్ అంటూ చెప్పగానే.. దామోదర్ సరే మేడం అంటాడు. తర్వాత రాత్రికి ముసుగేసుకుని వెళ్లి సామ్రాట్ రూంలో పడుకుంటుంటే.. ఒక ఇంజక్షన్ బయటకు తీసి సామ్రాట్‌కు ఇవ్వబోతుంటే చంద్ర వస్తుంది. చంద్రను చూసి దామోదర్ షాక్ అవుతాడు. చంద్ర ఇంజక్షన్ ఇవ్వకుండా అడ్డుపడుతుంది. ఆ పెనుగులాటలో సామ్రాట్ నిద్ర లేస్తాడు. దామోదర్‌ను కొడుతుంటే.. దామోదర్ బలంగా సామ్రాట్ తలకేసి కొడతాడు. సామ్రాట్ స్పృహ తప్పి పడిపోతాడు. చంద్ర గట్టిగా కేకలు వేస్తుంది. అందరూ వస్తారు. జరిగిన విషయం చంద్ర చెప్పగానే.. అందరూ షాక్ అవుతారు. దాక్షాయణి, జీవన్ కోపంగా చూస్తుంటారు. తేరుకుని దాక్షాయణి చంద్రకు థాంక్స్ చెప్తుంది. బయటకు వెళ్లి చంద్ర ఇక్కడ ఉన్నంత వరకు మన పని జరగదు అంటూ దాక్షాయణి చెబితే ఆ చంద్ర అన్నయ్య కోసం ఇదంతా ఎందుకు చేస్తుంది అని అడగ్గానే.. నిజమే నాకు అనుమానంగా ఉంది. చంద్ర విషయంలో ఏదో ఉంది. అది కనిపెట్టాలి. మీ అన్నయ్యకు గతం గుర్తుకు రాకముందే వాణ్ని చంపేయాలి అంటుంది.
మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన సామ్రాట్ అలియాస్ విరాట్‌కు గతం గుర్తుకు వస్తుంది. చంద్రను చూసి అమ్మ ఎక్కడ అంటూ అడుగుతుంది. అద్దంలో తన ముఖం చూసుకుని నా ముఖం ఏంటి ఇలా జరిగిపోయింది అంటూ అడుగుతాడు. అప్పుడే డాక్టర్ వచ్చి నీకు ప్లాస్టిక్ సర్జీరీ చేశామని చెప్తాడు. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.