NTR Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) .. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎన్టీఆర్ అంటే పేరు మాత్రమే కాదు బ్రాండ్. అంతలా దేశ విదేశాలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తో పాటు సెపరేట్ ఫ్యాన్ బేస్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇకపోతే రాజమౌళి (Rajamouli )దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్థాయిలో ఈయన పేరు మారుమ్రోగుతోంది. ‘కొమరం భీం’ పాత్రలో చాలా చక్కగా నటించి, అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ (NTR ) కొరటాల శివ(Koratala shiva) దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేశారు. ఈ సినిమా మొదట్లో మిక్స్డ్ టాక్ సొంతం చేస్తున్నప్పటికీ, ఆ తర్వాత సైలెంట్ గా రూ.600 కోట్ల క్లబ్లో చేరిపోయి సక్సెస్ అందుకుంది.
దేవర 1 కోసం ఎదురుచూపు..
సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఇందులో విలన్ పాత్ర పోషించగా.. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. 2024 సెప్టెంబర్ 27న ఈ సంవత్సరం గ్రాండ్ గా విడుదలైంది.తెలుగులో రూపుదిద్దుకున్నప్పటికీ కూడా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చాలా గ్రాండ్ గా సుమారుగా రూ.300 కోట్ల బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించారు. ఇకపోతే ఈ సినిమా విడుదలై 7 నెలలు దాటినా.. ఇంకా ఈ సినిమా టీవీ లోకి రాకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. థియేటర్లలోకి వచ్చి ఇన్ని నెలలైనా ఎందుకు టీవీ లోకి రావడం లేదు అని పలువురు పలు రకాలుగా ప్రశ్నిస్తున్నారు
ఇప్పటికీ అమ్ముడుపోని శాటిలైట్ హక్కులు..
అయితే తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా విడుదలై 7 నెలలవుతున్నా.. శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం డిజిటల్ రైట్స్ మాత్రమే అమ్మారని, శాటిలైట్ హక్కులను ఇంతవరకు అమ్మకుండా ఉంచడం వెనుక ఏదైనా కారణం ఉంటుందా? అని చర్చించుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకోవడం విశేషం. రూ.155 కోట్లకు అమ్ముడుపోయింది.2024 నవంబర్ నుంచే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఈ సినిమా విడుదలై ఏడు నెలలు కావస్తున్నా ఇంకా శాటిలైట్ హక్కులు అమ్మకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక దేవర పార్ట్ 2 షూటింగ్ కి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.మరొకవైపు ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ లో తన డెబ్యూ మూవీ ‘వార్ 2 ‘ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరొకవైపు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. డ్రాగన్ అనే టైటిల్ ని కూడా పరిశీలనలో ఉంచారు. ఇక ఇక త్వరలోనే షూటింగ్ పూర్తి చేయాలని అటు మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ డ్రాగన్ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
ALSO READ:Vijay Deverakonda: బన్నీకి సర్ప్రైజ్ ఇచ్చిన రౌడీ హీరో… ఎప్పుడూ ఇంతే అంటూ బన్నీ పోస్ట్ వైరల్