Hyderabad: తెలంగాణలో రాజకీయాలు ఇప్పుడు నేతల ఆస్తుల చుట్టూ తిరుగుతున్నాయి. గడిచిన పదేళ్లలో కేసీఆర్ ఫ్యామిలీ ఎంత నష్టం చేసింది అనేది విడతల వారీగా సిన్మా చూపిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. తొలుత ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ఇప్పుడు కేసీఆర్‌తోపాటు ఆయన పిల్లల ఆస్తుల చిట్టాను అసెంబ్లీ వేదికగా గుట్టు విప్పారు.
తెలంగాణలో రాజకీయాలు గడిచిన రెండు వారాలుగా నేతల ఆస్తుల చుట్టూనే తిరుగుతున్నాయి. అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుల గుట్టు విప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. దీనిపై ఇంటా బయటా పెద్ద రచ్చ జరుగుతోంది. ఈ విషయంలో నేతల మధ్య ఆరోపణలు-ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. వీలు చిక్కినప్పుడల్లా సీఎం రేవంత్.. వాటి గురించి బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అధికార-విపక్షాల మధ్య రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఇది నాణెనికి ఒక వైపు మాత్రమే.. రెండోవైపుకు వద్దాం. తెలంగాణ ఉద్యమానికి ముందు, రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తుల చిట్టాలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఫైట్ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, మద్దతుదారులు సైతం కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తుల చిట్టాను పేపర్ల, వీడియోల రూపంలో బయటపెడుతున్నారు. ఈ క్రమంలో సెలబ్రిటీల టాక్ షో పేరుతో ఓ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.
ALSO READ: తొలిపార్ట్ రెండున్నర నిమిషాలే.. సెకండ్ పార్టీలో గుట్టు అంతా
సెలబ్రిటీల టాక్ షోలో ఇద్దరు స్టార్ నటులు ఉన్నారు. జడ్జి అడిగిన ప్రశ్నలు కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూనే తిరిగాయి. ఈ వీడియోకు నెట్టింటో మాంచి స్పందన వస్తోంది. తెగ వైరల్ అవుతోంది. రెండున్నర నిమిషాల వీడియోలో కేవలం ఫస్ట్ పార్ట్ మాత్రమేనని, సెకండ్ పార్ట్ త్వరలో రాబోతోందని ఉంది. ఇప్పుడు ఈ వీడియో మీకోసం.
ఇందిరమ్మ రాజ్యం పేజీ వారు సమర్పించు
“తెలంగాణను దోచుకుంది ఎవరు?” Part – 1
ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎంత మందికి ముందే తెలుసు? pic.twitter.com/BkGG2JMac7
— Indiramma Rajyam (@IndirammaRajya) October 1, 2026