Podarillu Today Episode July 30th: చక్రి సంబంధం చెడగొట్టడానికి చూసిన ఆ వ్యక్తి మళ్ళీ వెతుక్కుంటూ అతని దగ్గరకు రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎవడ్రా ఇక్కడ నా కూతురుకి లవ్ అని చెప్పింది అని చక్రీ పై అరుస్తాడు ఒక వ్యక్తి.. నా కూతురికి ఎవరితో ఎక్కడా ఏ సంబంధాలు లేవు అని మహాలక్ష్మి ఆపగానే వెళ్ళిపోతాడు.. శైలు వరాలుకి షాక్ ఇచ్చేలా తయారవుతుంది.. వరలు మాత్రం ఇది పెళ్లి చూపులకు వస్తుందా లేదా లేచిపోతుందా అని కన్ఫ్యూజన్లో ఉండిపోతుంది. ఇక మొత్తానికి శైలు పెళ్లిచూపుల్లో కూర్చోవాలని అనుకుంటుంది అక్కడికి వెళ్లి కూర్చోగానే అక్కడి వాళ్ళందరూ కూడా తనని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు.. శైలు పద్ధతిగా పెళ్లి చూపుల్లో కూర్చున్న తర్వాత నేను ఒకసారి మీ అబ్బాయి తో మాట్లాడాలి అని అడుగుతుంది.. శైలు ఎంతగా మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా అబ్బాయి సిగ్గుపడిపోతూ మెలికలు తిరుగుతూ ఉంటాడు.. అయితే శైలు మాట విని పెళ్ళికొడుకు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక శైలు పెళ్ళికొడుకుని దారుణంగా తిడుతూ ఉంటుంది.. పెళ్లి సంబంధం క్యాన్సిల్ అవుతుంది. దాంతో వరాలు రెచ్చిపోతుంది.
ఇంట్లో వాళ్లకి ఆ పెళ్ళికొడుకు ఆ విషయాన్ని చెప్పి అందరికీ షాక్ ఇస్తాడు. ఇక వరాలు కోపంతో శైలు పై రెచ్చిపోతుంది. శైలు నేను చేసుకుంటే కేశవ అనే చేసుకుంటాను అని తేల్చి చెప్పేస్తుంది.. వాడికి చచ్చినా నేను ఇచ్చి పెళ్లి చేయను అని వరాలు ఎంతగా చెబుతున్నా సరే.. శైలు మాత్రం అస్సలు వినకుండా నేను వాడిని పెళ్లి చేసుకుంటాను అని మొండిగా అంటుంది.. అలాంటి మెకానిక్ గారితో నీ పెళ్లి ఎలా చేస్తానని అనుకుంటున్నావు అని వరాలు దారుణంగా మాట్లాడుతుంది.. నువ్వు అలాంటి వాడితో పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని వరాలు తేల్చి చెప్పేస్తుంది. ఆ మాట వినగానే శైలు దిమ్మ తిరిగిపోయేలా షాక్ అవుతుంది.. అయితే వరాలు ఎంత చెబుతున్నా సరే అసలు వినకుండా శైలు సరే నీకు నేనంటే ఇష్టం లేదు కదా అలానే వెళ్ళిపోతాను అని అంటుంది..
శైలు నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని వాళ్ళ అమ్మ చెప్పడంతో ఇక అస్సలు మాట్లాడకుండా ఇంట్లో నుంచి వచ్చేయాలని అనుకుంటుంది. నువ్వు నన్ను ఇష్టం లేదు వెళ్ళిపోని అన్నావు కదా.. మరి ఇప్పుడు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని శైలు అంటుంది.. ఆ మాట వినగానే వరాలతో పాటు వాళ్ళింట్లోని వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఆమెకి నేనంటే ఇష్టం లేదు కాబట్టే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటుంది. అయితే నేను ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండను నన్ను చదివించారు కదా నాన్న ఆ చదువుకి థాంక్స్ నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని శైలు అనగానే అందరూ ఒక్కసారిగా బాధపడతారు కానీ శైలు మాత్రం అస్సలు మాట వినకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది.
శైలు సడన్గా బ్యాగ్ తో సహా ఇంట్లోకి రావడంతో అందరూ ఒక్కసారిగా ఏమైంది అని అడుగుతారు. అసలు నువ్వు బ్యాడ్ తో సహా ఎందుకు వచ్చావు నేను ఏమైనా అక్కడ ఎవరైనా అన్నారా అని కేశవ అడుగుతాడు. ఏమైంది అని అనగానే మా అమ్మ పెళ్లి సంబంధం చెడగొట్టానని నన్ను ఇంట్లోంచి ఉండదు అని చెప్పింది నేను పెళ్లి చేసుకుంటే కేశవ అనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఉండడంతో నేను ఇంట్లో నుంచి వచ్చేసాను అని చెప్పగానే నువ్వు మంచి చేశావో చెడు చేసావో నాకు అర్థం కావడం లేదు అమ్మ అని బాధపడతాడు. నువ్వు మంచి చేశావో చెడు చేసావో నాకు అర్థం కావడం లేదు అని మాధవ్ అంటాడు. కానీ శైలు మాత్రం నేను పెళ్లి చేసుకుని నా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను అని వాళ్ళతో చెప్తుంది.
ఇంట్లో నుంచి బ్యాగ్ తో సహా వచ్చేసింది ఇక ఇంటికి వెళ్తుంది అన్న నమ్మకం మాకు లేదు కాబట్టి తన పెళ్లి చేయాలి అని అనుకుంటారు. కానీ శైలు మాత్రం నేను ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది. కేశవ చక్రీని పక్కకు తీసుకుని వెళ్లి అన్నయ్యకు పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోవడం మంచిదేనా అని అడుగుతాడు.. అన్నయ్యకు పెళ్లయిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకోవాలంటే కష్టం రా ఇప్పుడు పెళ్లి చేసుకుంటేనే మంచిది.. నీకోసం అమ్మాయి ఇల్లు వదిలేసి వచ్చింది.. కాబట్టి నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందే అని చక్రి చెప్తాడు.. చక్రి ఎంత చెప్తున్నా సరే కేశవ్ మాత్రం అన్నయ్యకు పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోలేను అని అంటాడు.. అయితే నాకిష్టం నారాయణ మధ్యలో వచ్చి వాడికి పెళ్లి అయ్యేంతవరకు నువ్వు ఏడ్చాలంటే అది జన్మలో జరగదు నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మంచిది అని సలహా ఇస్తాడు..
మహాలక్ష్మి శైలుని బాధపడుతూ మీ పెళ్లి జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తారు అని అంటుంది.. అయితే శైలు మాత్రం ఒంటరిగా ఉండి మా ఇద్దరి పెళ్లి అవుతుందా లేదా అని ఆలోచిస్తుంది.. ఇకపోతే మహాలక్ష్మి నువ్వు రెస్ట్ తీసుకొని బయటికి రాగానే కేశవ వాళ్ళు మా పెళ్లి గురించి మేము మాట్లాడుకోవాలి అని అనుకుంటారు. శైలు తో మాట్లాడాలి అని బయటకు తీసుకెళ్లిన కేశవ.. తన మనసులో ఉన్న మాటని శైలు తో చెప్తాడు.. శైలు తనని ప్రేమిస్తుంది అని చాలా సంతోషంగా ఉంటాడు.. శైలు మనసు చాలా గొప్పది అని కేశవ పొగడ్తల వర్షం కురిపించడంతోపాటుగా.. నీ తింగరితనమైన నన్ను ప్రేమించేలా చేసింది అని చెప్పడంతో ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు.. ఈ ఎపిసోడ్ కి ఈ సీన్ హైలెట్ గా నిలుస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..