Gautam Gambhir blames MS Dhoni : 2007, 2011 వన్డే వరల్డ్ టోర్నమెంట్ల రియల్ హీరో యువరాజ్ సింగ్ అంటూ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గతంలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ రెండు మెగా టోర్నమెంట్లలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడని.. అతడు లేకపోతే ట్రోఫీలు వచ్చేవి కావంటూ బాంబు పేల్చారు. అయితే కష్టపడింది ఒకరైతే.. క్రెడిట్ మాత్రం మరో వ్యక్తికి వెళ్లిందని ధోనిపై పరోక్షంగా హాట్ కామెంట్స్ చేశారు. తనతో పాటు యువరాజ్ సింగ్ టీమిండియా కోసం ఎంతో కష్టపడ్డామని… కానీ టైటిల్ గెలిచిన తర్వాత ఆ క్రెడిట్ ధోని దొంగిలించాడని మండిపడ్డారు. కెప్టెన్ హోదాలో ఉన్న ధోనీ ఏం చేయకపోయినా… క్రెడిట్ అతడికే అభిమానులు ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం తనను నిత్యం బాధపెడుతూనే ఉంటుందని షాకింగ్ నిజాలను పంచుకున్నారు. దీంతో గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా కు రెండు ఐసీసీ వరల్డ్ కప్ లు అందించిన రియల్ హీరో యువరాజ్ సింగ్ అంటూ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ క్రెడిట్ అతనికి దక్కలేదని షాకింగ్ నిజాలను పంచుకున్నారు. 2007 అలాగే 2011 వరల్డ్ కప్ టోర్నమెంట్స్ సమయంలో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో యువరాజ్ సింగ్ రాణించి… ఓడిపోయే మ్యాచ్లను సైతం గెలిపించాలని గుర్తు చేశారు. తనకు అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా జట్టు కోసం పోరాడాడని వివరించారు. కానీ చివరకు క్రెడిట్ మొత్తం ధోని కొట్టేసాడని మండిపడ్డారు. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా తాను 90 కి పైగా పరుగులు చేశానని గౌతమ్ గంభీర్ గుర్తు చేశారు.
97 పరుగుల వద్ద సెంచరీ చేయాలని తనను ధోని రెచ్చగొట్టి.. అవుట్ అయ్యేలా కుట్రలు చేశాడని కూడా గంభీర్ ఆరోపణలు చేశారు. ఆ తర్వాత సిక్సర్ తో మ్యాచ్ ఫినిష్ చేసి… క్రెడిట్ మొత్తం లాగేసుకున్నాడని ఫైర్ అయ్యారు. దీంతో గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు రేపుతున్నాయి. అయితే గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలకు ధోని అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. కెప్టెన్ గా ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకొని వరల్డ్ కప్ తెచ్చింది ధోని అంటూ కితాబు ఇస్తున్నారు. సరైన సమయాల్లో సరైన బౌలర్లను అటు బ్యాటర్లను వాడుకొని జట్టును నడిపించాడని కొనియాడుతున్నారు. ఈ విషయం తెలియక గౌతమ్ గంభీర్ వెధవ వాగుడు వాగుతూనే ఉంటాడని మండిపడుతున్నారు. ఇది ఇలా ఉండగా, ధోని కెప్టెన్సీలోనే 2007, 2011 వరల్డ్ కప్స్ టీమిండియాకు దక్కాయి.