Bigg Boss 10: బిగ్ బాస్ 10వ సీజన్ ఎవరి ఊహకు అందని ట్విస్ట్ లతో ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే మూడు వారాలు పూర్తికాగా ,నాల్గవ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ హీటెక్కింది. ముఖ్యంగా ఎప్పటిలాగే ఈ వీక్ కూడా త్రిగుణ్ ను టార్గెట్ చేస్తూ కంటెస్టెంట్స్ అభిప్రాయాలను చెబుతూ నామినేట్ చేయడం వైరల్ గా మారింది. 23వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోను నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో నామినేషన్ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్స్ మధ్య గొడవ తారాస్థాయికి చేరింది.
ప్రోమో విషయానికి వస్తే.. బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్ మహా సంగ్రామానికి సమయం ఆసన్నమైంది. నామినేషన్స్ లో భాగంగా అమన్ మాట్లాడుతూ..” నా నామినేషన్ త్రిగుణ్ అంటూ చెప్పాడు. అరె తురె అని చాలాసార్లు మాట్లాడావు” అంటూ తన పాయింట్ చెప్పి నామినేట్ చేసే ప్రయత్నం చేశారు అమన్. దీనికి త్రిగుణ్ మాట్లాడుతూ..” నువ్వు చెప్పొద్దని అన్న తర్వాత.. నేను ఎప్పుడైనా పిలిచానా?” అంటూ త్రిగుణ్ వాదనను వినిపించారు. “అంత వీడియో ఇచ్చిన వాడివి.. నీకు అంత కాన్ఫిడెంట్ లేదా?” అని అమన్ అడిగితే “నాకు లేదు” అంటూ త్రిగుణ్ ఒక్క మాటలో చెప్పాడు.
అటు రోహిత్ కూడా త్రిగుణ్ ను నామినేట్ చేస్తూ.. “నరేటివ్ నేను సెట్ చేయడం కాదు.. నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి మీరు సెట్ చేస్తున్నారు.. నాపై ఉమ్ము పడింది. అది కావాలనే వేశారా లేక ఆక్సిడెంటల్ గా పడిందా? అన్నది మీ విజ్ఞానానికే వదిలేస్తున్నాను ” అంటూ నామినేట్ చేశాడు. దీనికి త్రిగుణ్ మాట్లాడుతూ..” లాంజ్ లో వెనకాల కూర్చొని మాట్లాడే బ్యాచ్ నేను కాదు.. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా కొట్టేస్తాను” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.
also read: స్టూడెంట్ నెంబర్.1 @ 25 ఏళ్లు.. ‘సత్య’ పై రాజీవ్ కనకాల స్పెషల్ వీడియో!
నరేష్ మాట్లాడుతూ.. సంచాలక్ గా సరిగ్గా చేయలేదేమో అని నాకనిపించింది అంటూ అమన్ ను నామినేట్ చేశారు. అమన్ మాట్లాడుతూ ..”అక్కడ నేను 100 చెయ్యొచ్చు బయ్యా.. కానీ నేను నా డెసిషన్ ఏమిచ్చాను” అంటూ చెప్పాడు. ఇంట్లో పది గొడవలు జరిగితే అందులో నాలుగు అమన్ వే ఉంటాయి అని నరేష్ చెబితే.. నీ మొఖం చూస్తే చిరాకు వస్తుంది. నిన్ను చూస్తే చిరాకు వస్తుంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ పడరు” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఈ వారం నామినేషన్ బాగా వేడెక్కింది అని చెప్పాలి.