Vaibhav Sooryavanshi On Saim Ayub: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాక్ మధ్య ఫైనల్స్ జరిగింది. ఇందులో గెలిచిన టీమిండియా, గోల్డ్ మెడల్ ఎగురేసుకుపోయింది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీని పాక్ ఆల్ రౌండర్ అని చెప్పుకుని తిరిగే సైమ్ అయూబ్ వివాదస్పద సెలబ్రేషన్స్ చేశాడు. 15 ఏళ్ల వైభవ్ ను పట్టుకుని, ర్యాగింగ్ చేశాడు. అయితే, ఈ సంఘటనపై తాజాగా స్వయంగా వైభవ్ సూర్యవంశీనే స్పందించాడు.
ఆ సంఘటన జరిగినప్పుడు అభిషేక్ శర్మ భయ్యా నన్ను ఆపాడు, లేకపోయింటే సైమ్ అయూబ్ తల మైదానంలోనే పగిలేదంటూ వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు చేసినట్టు సోషల్ మీడియా ఓ పోస్ట్ వైరల్ గా మారింది. గొడవలు వద్దని ముందు నుంచి తనకు అభిషేక్ శర్మ సూచనలు చేశాడని, దీంతో సైమ్ అయూబ్ రెచ్చిపోయినా తాను పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. దీంతో వైభవ్ సూర్యవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
టీమిండియా వర్సెస్ పాక్ మధ్య ఫైనల్స్ మ్యాచ్ ప్రారంభమైన నుంచి పాకిస్తాన్ క్రికెటర్లు తనను హేళన చేస్తూ మాట్లాడారని వైభవ్ వెల్లడించారు. అందుకే రెండు సిక్సర్లు కొట్టి, కౌంటర్ ఇచ్చానన్నారు. ఆ తర్వాత సైమ్ అయూబ్ రెచ్చిపోయాడని ఆరోపణలు చేశారు. అభిషేక్ శర్మ తనను కూల్ చేశాడని వెల్లడించారు. వాళ్లు అలా రెచ్చగొట్టి, వికెట్లు తీస్తారని సూచించినట్టు తెలిపారు వైభవ్.
ఇక తన వికెట్ తీసిన తర్వాత సైమ్ మరింత రెచ్చిపోయాడని ఆగ్రహించారు. అభిషేక్ ఆపకపోయింటే..సైమ్ దవడలు పగలగొట్టేవాడిని అంటూ బాంబ్ పేల్చారు. కానీ తాను ఔట్ అయినప్పటికీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఇద్దరూ పాకిస్తాన్ ప్లేయర్లకు చుక్కలు చూపించారని వెల్లడించారు. దీంతో నా ఈగో సానిస్ఫై అయిందన్నారు.
వైభవ్ సూర్యవంశీని (Vaibhav Sooryavanshi) ఉద్దేశించి సైమ్ అయూబ్ వివాదస్పద సెలబ్రేషన్స్ చేసుకోవడంపై పాకిస్తాన్ మాజీ లే విమర్శలు చేస్తున్నారు. 15 ఏళ్ల కుర్రాడి జోలికి ఎందుకు వెళ్లావని నిలదీస్తున్నారు. కొంచెమైనా బుద్ది ఉందా ? నీకు పాకిస్తాన్ జట్టులోనే స్థానం లేదంటే…వైభవ్ ను ర్యాగింగ్ చేస్తావా? అంటూ ఫైర్ అవుతున్నారు. వైభవ్ సూర్యవంశీ కాలి గోటికి కూడా సైమ్ అయూబ్ సరిపోడని కౌంటర్లు ఇస్తున్నారు. ఈ విషయంలో సైమ్ అయూబ్ దే 100 శాతం తప్పని స్పష్టం చేస్తున్నారు. ఇకపై ఇలాంటి చిల్లర వేశాలు వేస్తే, పాకిస్తాన్ దేశం నుంచే తరిమేస్తామని హెచ్చస్తున్నారు.