E-Paper
Advertisement

ఓడిపోయిన చోటే గెలిచి చూపించాను.. అసలైన విజయం అదే అంటున్న సాయి పల్లవి!

ఓడిపోయిన చోటే గెలిచి చూపించాను.. అసలైన విజయం అదే అంటున్న సాయి పల్లవి!
Advertisement

Jayammu Nischayammu raa2: సినీ నటి సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఒకప్పుడు సౌత్ సినిమాలకు మాత్రమే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ ఇటీవల కాలంలో బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ కుమారుడితో కలిసి ఏక్ దిన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది దీంతో సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ అభిమానులను నిరాశకు గురి చేసింది.

సీజన్ 2 ఫస్ట్ గెస్ట్ గా సాయి పల్లవి..

ఇక త్వరలోనే మరో చిత్రం రామాయణ (Ramayana) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో  రణబీర్ కపూర్ సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని నవంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా సాయిపల్లవి జగపతిబాబు(Jagapathi Babu) హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్మూ నిశ్చయమ్మురా సీజన్ 2 (Jayammu Nischayammu Raa 2) కార్యక్రమంలో తొలి ఎపిసోడ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఓడిపోయిన చోటే  గెలిచాను..

Advertisement

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన మరొక ప్రోమో విడుదల చేశారు. ఇందులో భాగంగా జగపతిబాబు సాయి పల్లవిని ప్రశ్నిస్తూ.. నీ జీవితంలో జయమ్ము నిశ్చయమ్మురా అని అనిపించిన సంఘటన ఏది అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సాయి పల్లవి సమాధానం చెబుతూ తాను ఏ స్టేజ్ మీద అయితే ఓడిపోయానో అదే స్టేజ్ మీద ప్రభుదేవా మాస్టర్ గారి కొరియోగ్రఫీతో రౌడీ బేబీ సినిమా కోసం సాంగ్ చేశానని ఈమె తెలిపారు తన జీవితంలో ఇదే అసలైన విజయం అంటూ సాయి పల్లవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె కెరియర్ మొదట్లో డాన్సర్ గా పలు డాన్స్ షోలలో సందడి చేశారు అయితే ఒక షోలో విన్నర్ కావాల్సిన సాయి పల్లవి ఓడిపోవడంతో అదే ప్రభుదేవా మాస్టర్ కొరియోగ్రఫీలో సినిమా చేశారు ఈ విషయాన్ని తాజాగా గుర్తు చేసుకున్నారు.

?srtk=MWhsYnVodDVrbDdpNg%3D%3D

Advertisement

ఇక ఈ ప్రోమో వీడియోలో భాగంగా రణబీర్ కపూర్ (Ranbir Kapoor)వీడియో ప్లే చేశారు అయితే ఇందులో భాగంగా రామాయణ సినిమా గురించి రణబీర్ కపూర్ మాట్లాడుతూ సాయి పల్లవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని సీత పాత్రలో ఆమెను కాకుండా మరెవరిని ఊహించుకోలేమూ అంటూ రణబీర్ కపూర్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ఎపిసోడ్ శుక్రవారం జీ 5 ఓటీటీలో ప్రసారం కాబోతోంది.

Also Read: హైందవ టీజర్ రిలీజ్…విగ్రహాల చోరీ వెనుక రహస్యం ఏంటీ!

Related News

అగ్గిపెట్టి మచ్చ అంత్యక్రియల్లో అసలేం జరిగింది? బయటపెట్టిన వైజాగ్ సత్య!

అగ్గిపెట్టి మచ్చ చివరి కోరిక అదే.. కన్నీళ్లు పెట్టుకున్న ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య!

సింగర్ కనకవ్వ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

జూనియర్ బాలు అనుకుంటే ఇలా దొరికిపోయాడేంటి.. సరిగమపలో దైవిక్‌కు షాక్!

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

Big Stories

Advertisement
×