Satyabhama Today Episode February 14th: నిన్నటి ఎపిసోడ్లో.. సత్య సంధ్య ను మహాదేవయ్య ప్లాన్ నుంచి ఎలా కాపాడుకోవాలి అని భయపడుతూ ఉంటుంది. ఇక వృద్ధాశ్రమంలోని ఆమెకి ఫోన్ చేస్తుంది. బామ్మ నేను ఎన్నికల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాను నాకు కత్తి మీద సాములు అంటే ఒక సమస్య వచ్చి పడింది అనేసి అనగానే ఆ బామ్మ నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి అమ్మ నీ ఇష్టం వచ్చినట్లు చెయ్ అమ్మ మాకు నువ్వు అండగా ఉంటామని అనుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం తప్పుకోవాలనుకుంటున్నావ్ అప్పుడు ఒక ప్రాణం అయింది ఇప్పుడు 20 మంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది మరేం పర్లేదు అమ్మ మా పరిస్థితి ఇంతే అనేసి అనుకుంటాము అని అంటుంది అక్కడితో సత్య ఫోన్ పెట్టేస్తుంది. ఇక సంజయ్ దగ్గరకు వచ్చి క్రిష్ వార్నింగ్ ఇస్తాడు. అక్కడ ఎక్కడో రిసార్ట్ లో శోభనం చేసుకోవడం ఏంటి బ్రో ఇంట్లో వీళ్ళందరూ చేస్తుంటే దాని కంటే ఒక పద్ధతిపాడు ఉండాలి కదా అనేసి క్రిష్ గట్టిగా అరుస్తాడు. సంజయ్ కు సంధ్యకు ఏమైనా అయితే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తాడు. సత్య మహాదేవయ్యాకు వీడియోతో షాకిస్తుంది. ఆ తర్వాత ఎన్నికలను ఎత్తేయించాలని మహాదేవయ్య, రుద్ర ప్లాన్ చేస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మహదేవయ్య రుద్ర నరసింహ మనసులు అటాక్ చేసినట్టు యాక్ట్ చేస్తారు. ఇక ఇంట్లో అందరూ టెన్షన్ పడతారు క్రిష్ ను కావాలని మహదేవయ్య రెచ్చగొడతాడు. ఇక సత్యా కృష్ణ రెచ్చగొడితే బాగోదని అంటుంది. కానీ క్రిష్ మాత్రం వినడు. సత్య ఎంతగానో కృష్ణ ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఎన్నికల టైం లో ఇలా చేస్తే బాగోదు ఎన్నికలు ఆగిపోవాలని మీ బాపు అలా చేస్తున్నాడని రెచ్చగొడుతుంది. నాకు అనుకూలంగా రావడంతో ఎన్నికలు ఆగిపోవాలని అనుకున్నాడు అందుకే ఇదంతా చేస్తున్నాడు అడవిలో మృగాలు లాగా నువ్వు ప్రవర్తించదు క్రిస్ నేను నీకోసం బాధపడుతున్నాను నీ వెనకాల నేనున్నానని ఆలోచించు అనేసి సత్య ఎన్ని సార్లు బ్రతిమలాడినా క్రిష్ మాత్రం మాట వినకుండా వెళ్ళిపోతాడు. సత్య ఎమోషనల్ గా క్రిష్ బ్లక్మెయిల్ చేసిన కూడా క్రిష్ వినడు. సత్య తన మాట వినట్లేదని నా మీద ప్రేమ ఇంతేనా ఎంత బ్రతిమలాడుకున్నా కూడా క్రిష్ వినకుండా తనని వదిలేసి వెళ్ళిపోతాడు.. ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు.
నరసింహ తన మనుషులతో కలిసి కూర్చొని మందు తాగుతూ ఉంటాడు అప్పుడే క్రిస్టియన్ లోకి ఎంట్రీ ఇస్తాడు. మహాదేవయ్య ఓడిపోవడం ఖాయం ఆ సంతోషంతోనే నేను తాగుతున్నానని ఫుల్ ఖుషి అవుతుంటాడు. కోడలి చేతిలో మహదేవయ్య ఓడిపోవడం ఆ మొహాన్ని చూడాలని నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు ఇప్పుడు చూస్తానని వెయిట్ చేస్తున్నానని నరసింహా అంటాడు. అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన క్రిష్ తన మనుషుల్ని చితక్కొట్టేస్తాడు. అసలు చిన్న గాడికి ఏమైంది? ఎందుకు ఇలా విజృంభించాడు ఎందుకు ఇంతగా కొడుతున్నాడని నరసింహ షాక్ లో ఉంటాడు. నరసింహను చంపకుండా వదిలేస్తాడు. సత్య దేవతలాగా నిన్ను కాపాడింది అనేసి నరసింహతో అంటాడు.. ఇంట్లో ఉన్న నేను మారిపోయాను నీ నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు నేను ఇక మీదట ఇలాంటి గొడవలకి రాను అని క్రిష్ అంటాడు. సింహం వదిలేసి క్రిష్ బయటకొచ్చేస్తాడు కానీ వెనకాలే రుద్ర అక్కడికి వచ్చి నరసింహను చంపేస్తాడు.
ఇక జయమ్మ టెన్షన్ గా ఉంది రేణుక టీవీ పెట్టి ఏదైనా భక్తి పాటలు పెట్టు అంటుంది అప్పుడే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరసింహ చనిపోయాడని అందుకే ఎన్నికలు రద్దు చేయబోతున్నట్టు ఎన్నికల కమిషన్ పేర్కొన్నారని న్యూస్ వస్తుంది.. అప్పుడే ఇంటికి క్రిష్ వస్తాడు. మహదేవయ్యా ఫుల్ ఖుషి అవుతాడు సత్య షాక్ అవుతుంది. ఒక క్రిష్ ఏమైందని అయోమయంలో ఉంటాడు. భైరవి టీవీ చూసి ఆ న్యూస్ నువ్వు కూడా విను అని అంటుంది. అది చూసి షాక్ అవుతాడు క్రిష్. సంజయ్ కూడా నువ్వు నరసింహ లాంటి వ్యక్తిని చంపేసావు హ్యాట్సాఫ్ బ్రో అనేసి ప్రశంసల కురిపిస్తాడు. మాత్రం టెన్షన్ పడుతూ కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే రుద్ర బయటి నుంచి వస్తాడు. నేను బెదిరించి విడిచి పెట్టాను కానీ ఇవన్నీ ఎవరు చంపారో నాకు తెలియదు అనేసి క్రిష్ అంటాడు. నేను చంపలేదు అని చెప్తున్నాను కదా నేను చంపలేదు అని క్రిష్ గట్టిగా అరుస్తాడు.. ఇక సత్యా క్రిష్ నిజంగానే ఆ మర్డర్ చేశాడని భయపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో సత్యా ఇంట్లోంచి వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తుంది.. అది ఏం జరుగుతుందో చూడాలి…