BigTV English

Janhvi Kapoor: తమిళంలో జాన్వీ కపూర్ లాంచ్‌కు సర్వం సిద్ధం.. రంగంలోకి కాంట్రవర్షియల్ డైరెక్టర్..

Janhvi Kapoor: తమిళంలో జాన్వీ కపూర్ లాంచ్‌కు సర్వం సిద్ధం.. రంగంలోకి కాంట్రవర్షియల్ డైరెక్టర్..

Janhvi Kapoor: ఈరోజుల్లో సౌత్ సినిమాలపై కూడా పట్టు ఉండాలని బాలీవుడ్ నటీనటులు అనుకుంటున్నారు. సీనియర్, యంగ్ అని తేడా లేకుండా బాలీవుడ్ నటీనటులంతా సౌత్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలా గత కొన్నేళ్లలో ఎంతోమంది నేరుగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఆ లిస్ట్‌లో ఇటీవల జాన్వీ కపూర్ కూడా యాడ్ అయ్యింది. గతేడాది విడుదలయిన ‘దేవర’ అనే సినిమాతో తెలుగులో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది శ్రీదేవి వారసురాలు. ఇప్పుడు కోలీవుడ్‌లో కూడా తన అడుగు పడనుందని తెలుస్తోంది. కాంట్రవర్షియల్ డైరెక్టర్ చేతుల మీదుగా జాన్వీ కపూర్ కోలీవుడ్ డెబ్యూ గ్రాండ్‌గా జరగనుంది.


కోలీవుడ్ డెబ్యూ

శ్రీదేవి వారసురాలిగా లాంచ్ అయిన తర్వాత జాన్వీ కపూర్‌కు తనదైన గుర్తింపు రావడానికి చాలాకాలమే పట్టింది. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ ప్రేక్షకులు.. జాన్వీని, తన సినిమాల సెలక్షన్‌ను, యాక్టింగ్‌ను మెచ్చుకోవడం మొదలుపెడుతున్నారు. అదే సమయంలో తనకు తెలుగులో డెబ్యూ చేసే ఛాన్స్ లభించింది. అది కూడా ‘ఆర్ఆర్ఆర్’ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్‌టీఆర్ నటిస్తున్న తరువాతి సినిమాలో తనకు హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. దీంతో జాన్వీకి తెలుగులో కూడా సక్సెస్ ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. సినిమా సక్సెస్ అయ్యింది కానీ అందులో తన పాత్ర మాత్రం ఏమీ లేదని ప్రేక్షకలు ఫీలయ్యారు. అందుకే ప్రస్తుతం తన కోలీవుడ్ డెబ్యూపైనే జాన్వీ ఆశలు పెట్టుకుంది.


అన్నీ కాంట్రవర్సీలే

కోలీవుడ్‌లో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సినిమాతో కాదు.. ఒక వెబ్ సిరీస్‌తో డెబ్యూ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. వెబ్ సిరీస్ కోసం తెరకెక్కే ఒక ఒరిజినల్ వెబ్ సిరీస్‌తో మొదటిసారి తమిళ ప్రేక్షకులను పలకరించాలని ఫిక్స్ అయ్యిందట జాన్వీ. అయితే ఈ వెబ్ సిరీస్‌ను కాంట్రవర్షియల్ డైరెక్టర్ అయిన పా రంజిత్ నిర్మించబోతున్నట్టు సమాచారం. గత కొన్నాళ్లుగా తన పొలిటికల్ ఆలోచనలు అన్నీ తన సినిమాల రూపంలో బయటికి తీసుకురావడంతో పా రంజిత్‌పై ప్రేక్షకుల్లో నెగిటివిటీ విపరీతంగా పెరిగిపోయింది. అలాంటిది జాన్వీ కపూర్ కోలీవుడ్ డెబ్యూ బాధ్యతలు ఈ కాంట్రవర్షియల్ డైరెక్టర్ చేతికి వెళ్లాయా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

Also Read: ఏంటి.. సంయుక్త మీనన్ కు ఆ పాడు అలవాటు ఉందా..?

బోరింగ్ ఉంటుందేమో

గత కొన్నేళ్లుగా పా రంజిత్ (Pa Ranjith) ఖాతాలో ఒక్క సరైన హిట్ కూడా లేదు. తన దర్శకత్వంలో నటించడానికి రజినీకాంత్ లాంటి స్టార్ హీరోలు సైతం ముందుకొస్తున్నా వారికి తగిన హిట్ మాత్రం అందించలేకపోతున్నాడు రంజిత్. జాన్వీ కపూర్ తమిళ డెబ్యూ వెబ్ సిరీస్‌ను తానే నిర్మిస్తుండడంతో ఇది కూడా తన సినిమాల్లాగానే బోరింగ్ ఉంటుందా అని ప్రేక్షకులు అప్పుడే విమర్శించడం మొదలుపెట్టారు. సరకునమ్ దీనిని డైరెక్ట్ చేయడానికి రంగంలోకి దిగనున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో జాన్వీ కపూర్‌తో పాటు మరో స్టార్ హీరో కూడా నటించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం జాన్వీ కపూర్.. ‘ఆర్సీ 16’, ‘పరమ్ సుందరి’ లాంటి సినిమాలతో బిజీగా గడిపేస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×