Satyabhama Today Episode March 1st: నిన్నటి ఎపిసోడ్లో.. రుద్ర బయటికి వస్తుంటాడు. అక్కడున్న ట్రాఫిక్ ఎస్ఐ కానిస్టేబుల్ ఇద్దరు అతని ఆపుతారు. ఏమైంది నన్నెందుకు ఆపారని రుద్ర అడుగుతాడు. ఎవరో తెలిసే నన్ను ఆపారా మహదేవ కొడుకుని మహదేవ గురించి తెలుసా మీకు అని రుద్రా అంటాడు. ముందు లైసెన్స్ తియ్యు ఆ తర్వాత ఏం చేయాలి మేము చెప్తామని ఎస్సై అంటాడు. కానీ రుద్ర ఎస్ఐ అన్న మాటలకు కోపంతో రగిలిపోతూ ఎస్ఐ కాలర్ పట్టుకుంటాడు. అది వీడియో షూట్ చేస్తారు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ చొక్కా పట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా అని అతని అరెస్ట్ చేస్తారు. అర్థమైందిరా నువ్వు ఎవరి దగ్గర ఎంత తీసుకున్నావు అంతకుమించి నేను ఇస్తాను అని రుద్రా అంటాడు మాకు ఏదైనా మొదటిసారి కమిట్మెంట్ ఉంటుంది ఆ తర్వాత మాకు అవసరం లేదని ఎస్ఐ అంటాడు. ఆస్తి కోసం రుద్ర అడ్డును తొలగించుకొనే ప్రయత్నం చేస్తాడు. ప్లాన్ ప్రకారమే పోలీసులకు పట్టిస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. క్రిష్ రాత్రి తాగేసి ఇంటికి వస్తాడు. క్రిష్ ను అలా చూసి సత్య కన్నీళ్లు పెట్టుకుంటుంది.. కృష్ణ ఇలా తాగేసి వస్తావని నేను అస్సలు అనుకోలేదు నీకు బాధ ఉంది తప్పు కాదు కానీ ఇలా తాగేసి నీ ఆరోగ్యం పాడు చేసుకోవడం అవసరమా అని సత్య అంటుంది. ఇకనుంచి మనిద్దరం ఇక్కడే ఉండాలని సంగతి నువ్వు మర్చిపోతున్నావు క్రిష్ అతను నీ బాపు కాదు ఇదే మన ఇల్లు ఇక్కడే మనం ఉండాలి అని సత్య క్లారిటీగా చెప్తుంది. కానీ క్రిష్ మాత్రం మా బాబు కోపం తాటాకుమట్ట లాంటిదే అలా వస్తుంది తర్వాత తగ్గుతుంది. ఇక క్రిష్ మాత్రం బాపు మీద ప్రేమను చంపుకోలేక బాపు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కారణం నేనే.. నేను రెచ్చగొట్టడం వల్లే ఇది నిజం బయటపడింది దాన్నే నువ్వు సహించలేకపోతున్నావని సత్య బాధపడుతుంది. బాపు ఫోన్ చేస్తే నన్ను లేపు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే బాధపడతాడని సోఫాలోనే పడుకుండిపోతాడు క్రిష్..
ఇక ఉదయం లేవగానే హర్ష నందిని మాట్లాడుకుంటారు. ఇక అప్పుడే మైత్రి ఫోన్ చేస్తుంది. మైత్రి ఫోన్ రావడం చూసి నందిని షాక్ అవుతుంది. ఇది ఎందుకు నీకు ఫోన్ చేస్తుందని అడుగుతుంది. ఫారిన్ వెళ్లాలని ఉంది కదా ఆ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడాలనుకుంటుందేమో అని మైత్రి ఫోన్ లిఫ్ట్ చేయబోతాడు హర్ష అయితే నందిని స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమని అడుగుతుంది. మైత్రి నందిని కి డౌట్ రాకుండా డాక్యుమెంట్స్ కోసం ఫోన్ చేస్తుంది. నేను ఇంకొక రెండు రోజుల్లో తెచ్చిస్తానని హర్ష అంటాడు. నిద్రమంటే ఏదో జరుగుతుంది అని అనుమానం నాకు వచ్చిందంటే చాలు ఇక నేను ఏం చేస్తున్నా నాకు తెలియదని ఇండైరెక్టుగా నందిని వార్నింగ్ ఇస్తుంది.
ఇక తర్వాత సత్య మహదేవయ్య ఇంటికి వెళుతుంది. భైరవి మాత్రం ఇంట్లోకి ఎందుకు వచ్చారు ఇదేమి నువ్వు డైరెక్టుగా రావడానికి మీ అత్తగారిల్లు ఏమీ కాదు అని సత్యను అంటుంది. ఇక సంజయ్ కూడా ఆస్తి కోసమో ఇంకేదని కోసమో వచ్చినట్టున్నారు అని భైరవి తో అంటాడు. జయము మాత్రం ప్రతి ఎందుకొచ్చిందో తెలుసుకోకుండా ఎందుకలా మాట్లాడుతారు అని అరుస్తుంది. సత్య మాత్రం నేను ఒకసారి ఇంట్లోంచి వెళ్లిపోయిన తర్వాత మళ్లీ ఎలా వస్తాను అనుకున్నారు రాను అని అంటుంది. ఇక మహదేవయ్యను సత్య పిలుస్తుంది నీకోసం ఒక గుండె పరితపిస్తుంది ఎదురుచూస్తుంది.
ఇక భైరవి మా చిన్నా ఎవరు ఎవరి గురించి మాట్లాడాలని వచ్చావు అసలు నువ్వు ఎవరు అన్నట్లుగా సత్యతో మాట్లాడుతుంది సత్య. చిన్న ఎవరో గుర్తు లేదా నేను గుర్తు చేయమంటావని ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పి భైరవికి దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తుంది. సత్య మాటలకు మహదేవయ్య కౌంటర్ ఇస్తాడు మాటలకు మహదేవయ్య కౌంటర్ ఇస్తాడు. ఇక మహదేవయ్య క్రిష్ నా కొడుకు అని మీ మామయ్య తీసుకెళ్లిపోయాడు కదా ఇకమీదట నుంచి అతనే మీ మామయ్య మరి నువ్వు ఎందుకు ఇలా వచ్చావు అని అడుగుతాడు. కానీ సత్యం మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూ మీకోసం పరితపిస్తున్నాడు క్రిష్ అని బాధపడుతుంది. మహదేవయ్య గుండె కరగదు కానీ సంజయ్ మాత్రం సత్యను తిడతాడు. ఇక సత్య చెప్పిన మాటలు ఆ ఇంట్లో ఎవరూ వినరు దాంతో క్రిష్ ఏమైపోతాడు అని బాధతో బయటికి వచ్చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..