Satyabhama Today Episode March 7th : నిన్నటి ఎపిసోడ్లో.. మహదేవయ్య బయటకు వెళుతూ ఉంటాడు. బయట కార్ ఆగిపోతుంది. ఏమైందని డ్రైవర్ని అడిగితే పాత కారు కదయ్యా ఆగిపోయింది అని అనగానే వేరే కార్ని పంపించమని చెప్పు అనేసి అంటాడు. అప్పుడే క్రిష్ అటు వెళ్తూ మహదేవయ్య చూసి అక్కడికి వస్తాడు. నా తప్పేంటి బాబు నేను చేసిన తప్పు ఏంటి అసలు పాతికేళ్లు నీ దగ్గరే ఉన్నాను నీ గురించి ఆలోచించను ఇప్పుడు అంత పరాయిడ్ని అయిపోయానా అనేసి క్రిష్ అడుగుతాడు.. కానీ మహదేవయ్య ఏం మాట్లాడాడు. క్రిష్ కార్ని రిపేర్ చేసి మహదేవను అడుగుతాడు. రక్తం పంచుకు పుట్టిన బిడ్డని నీ కళ్ళముందే కొట్టడం నా తప్పే సంజయ్ కాళ్ళ మీద పడతాను నన్ను క్షమించమని అడుగుతాను కానీ నాతో మాట్లాడు బాపు అనేసి క్రిష్ బతిమిలాడుతాడు మహదేవ మాత్రం క్రిష్వైపు కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. సత్య మైత్రికి వార్నింగ్ ఇస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సంజయ్ మహదేవయ్యను చంపే ప్లాన్ వేస్తాడు. క్రిష్ కి ఎలాగైనా నిజం చెప్పాలని అప్పుడు మహదేవ్ క్రీస్తు చంపేస్తాడు ఈ ఆస్తికి నేనే వారసులని అనుకుంటాడు. అనుకున్న విధంగానే పక్కా ప్లాన్ తో సంజయ్ భైరవికి హింట్ ఇస్తాడు. ఒక పంతులు చేత ఫోన్ చేయించి మహదేవయ్యకు ప్రాణగండం ఉంది హోమం చేయించాలి గుడికి రమ్మని చెప్తాడు. ఇక సంజయ్ కి ఆ విషయం చెప్పి టెన్షన్ గా భైరవి గుడికి వెళుతుంది. అడ్డుగా ఉంటావు అందుకే నేను పంపించాలి నీ ప్లాన్ వేసాము అని సంజయ్ అనుకుంటాడు.
అటు హర్ష వాళ్ళ ఇంటికి మైత్రి వస్తుంది.. మైత్రి ని చూసి హర్ష షాక్ అవుతాడు..హర్ష చూసి షాక్ అయిపోతాడు. మైత్రి మాటలకు హర్ష మైత్రిని కొట్టబోతే నందిని రావడంతో ఆగిపోతాడు. ఇక మైత్రి నందినితో హర్షలో గిల్ట్ చూశావా నందిని ఏదో తప్పు చేసినట్లు భయపడటం ఇన్నీ గమనించావా అని అంటే నా మొగుడుని నేను చూసుకుంటా అంటుంది. మైత్రి విశ్వనాథం, విశాలాక్షిలను చూసి అత్తయ్యా మామయ్య అని పలకరిస్తుంది. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నావ్ అంటే కాబోయే కోడలిని మామయ్య హర్ష నందిని మెడలో తాళి కట్టినా నాతో ఒక రాత్రి గడిపాడు అని చెప్తుంది. నందిని తిట్టి మైత్రిని గెంటేస్తే రాసలీలల వీడియోలు ఉన్నాయి కంప్లైంట్ ఇస్తాను అని మైత్రి అంటుంది. దాంతో సత్య వచ్చి కంప్లైంట్ ఇచ్చుకో అంటుంది. అన్నయ్య ఏం చేయలేదు వదినా అని చెప్పి హర్ష తప్పు చేయలేదు అని చెప్పిన వీడియో చూపిస్తుంది..
వదిన ఇంకా చూస్తావ్ ఏంటి నీకు సవతి అవ్వాలని వచ్చిన దాన్ని నువ్వు ఇలానే మర్యాదలు చేస్తావా మంచి మర్యాదలు చేయాలి అని సత్య అనగానే హర్ష వాళ్ళ నాన్నమ్మ ఆ మూల చీపురుంది ఇట్ట తీసుకురావే అనేసి అంటుంది ఇక నందిని ఆ చీపును తీసుకొచ్చి మైత్రికి సన్మానం చేసి ఇంట్లోంచి తరిమేస్తుంది. అప్పుడే సంధ్య కూడా అక్కడికి వస్తుంది. నేను మోసపోయాను మీరు ఎంత చెప్పినా వినకుండా అతని గుడ్డిగా నమ్మాను అతను నిజ స్వరూపం నాకు బయటపడింది మీ అక్కకు లైన్ ఏసాను నిన్ను తాళి కట్టి వదిలించు కోవాలనుకున్నాను కానీ కుదరలేదు అని చెప్పాడు అని అందరితో చెప్పి సత్య కాళ్ళు పట్టుకుంటుంది.
ఇదంతా నాకు తెలుసు నేను ఎంత చెప్పినా నువ్వు వినలేదు ఇప్పుడు నీ కాపురం చాలా దూరం వచ్చింది నువ్వు అతని వదిలించుకోవడం కన్నా అతని మార్చుకొని నీ దారిలోకి తెచ్చుకోవాలి అని సంధ్యతో సత్య అంటుంది. ఇక ఇదే కాదు బావగారిని దెబ్బ కొట్టాలని మరో ప్లాన్ వేస్తున్నాడు అక్క అనేసి అంటుంది. ఏంటది అంటే బావగారి వల్ల అసలు తల్లిని చంపింది మావయ్య అంట. ఆవిషయాన్ని బావగారికి చెప్పి మామయ్య అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేస్తున్నాడు అని చెబుతుంది. అది విన్న క్రిష్ వెంటనే కోపంతో మహదేవయ్య దగ్గరికి వెళ్తాడు..
ఆవేశంగా బయటకు వెళ్లడం సత్యతో పాటు అందరూ చూస్తారు. సత్య, సంధ్యలు మహదేవయ్య ఇంటికి పరుగులు తీస్తారు. సంజయ్ తన తండ్రిని క్రిష్ చంపేస్తాడనని కలలు కంటూ ఎంజాయ్ చేస్తుంటాడు. మహదేవయ్య చనిపోతే తనకు అడ్డులేదని ఈ సామ్రాజ్యం అంతా తనదే అని గెంతులేస్తాడు. క్రిష్ మహదేవయ్య ఇంటి తలపులు తన్ని లోపలికి వెళ్లడం చేతిలో కత్తి చూసిన మహదేవయ్య చిన్నా అని భయపడతాడు. ఎందుకు చంపినావ్ మా అమ్మని ఎందుకు చంపావ్ అని క్రిష్ అడిగితే క్రిష్కి నిజం తెలిసిపోయిందని మహదేవయ్య క్రిష్ని బతిమాలుతాడు. నా కన్న తల్లిని ఎందుకు చంపావ్ అని క్రిష్ అడుగుతూ నువ్వు చేసిన ద్రోహం తెలియగానే నా గుండె ముక్కలు అయిపోయిందని కేకలేస్తాడు..
ఆ తర్వాత మహదేవయ్య చేతిలో కత్తి పెట్టి నన్ను చంపే బాబు నీకు కావాల్సింది ఇదే కదా అప్పుడు మా అమ్మని దూరం చేసావు నన్ను నా తల్లిదండ్రులకు దూరం చేశావు ఇప్పుడు ఇది కూడా వచ్చేసి మంచి పని చేస్తావు అనేసి క్రిష్ అంటాడు. ఇదెక్కడి సంతరా ఎవరూ చంపుకోవడం లేదని సంజయ్ అనుకుంటాడు. నాకు నీ మీదే ప్రేమ ఎక్కువ అని అంటాడు క్రిష్. నువ్వు ఇష్టపడేవాళ్లు నీకు విలువ ఇవ్వకపోతే నువ్వు ఎంత బాధ పడతావో నేను అంతే బాధ పడతాను బాపు అని అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఇప్పుడు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..