E-Paper
Advertisement

సీనియర్ నటి షావుకారు జానకి తీవ్ర అస్వస్థత.. ఎలా ఉందంటే..?

సీనియర్ నటి షావుకారు జానకి తీవ్ర అస్వస్థత.. ఎలా ఉందంటే..?
Advertisement

Sowcar Janaki : తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న సీనియర్ నటి షావుకారు జానకి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించిన ఆమె వృద్ధాప్య సమస్యల కారణంగా ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.. అయితే ఈమెకు అనారోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చినట్లు ఓ వార్త ప్రస్తుతం మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. 95 ఏళ్ల వయసున్న ఆమె గత కొంతకాలంగా వృద్ధాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్యం బాగా క్షమించిందని ఆమెను పరీక్షించడం వైద్యులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థకు గురైన ఆమెను ఆసుపత్రిలో చేర్చడంతో వైద్యులు ఐసీయూలో ఆమెను ఉంచినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉంది అని వైద్యులు వెల్లడించారు. షావుకారు జానకి ఆరోగ్యపరిస్థితి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

షావుకారు జానకికి ఏమైంది..?

సినీ నటిషావుకారు జానకి గత వారం రోజుల క్రితం శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెను కుటుంబ సభ్యులు చేర్పించారు. అప్పుడు పర్వాలేదని అనుకున్నా మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. బుధవారం రాత్రి షావుకారు జానకి మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెను ఐసీయూకు తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. మరో రెండు రోజులు పాటు ఆమెను అబ్జర్వేషన్ లో ఉంచనున్నట్లు డాక్టర్లు వెల్లడించినట్లు తెలుస్తుంది. ఎన్నో సినిమాలలో నటించిన ఆమె ఇప్పుడు ఇలా ఆసుపత్రిలో ఉండడంతో ఆమె అభిమానులు చాలా బాధపడుతున్నారు.. ఆమెకు ఏమి కాకుండా ఉండాలి అంటూ దేవుడిని ప్రార్థించడంతోపాటు ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు..

ఈమె సినిమాల విషయానికొస్తే..

Advertisement

తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఆమె ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది. సహజమైన నటనతో ఆమె చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తెలుగులో మాత్రమే కాదు తమిళంలో కూడా ఆమె పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకున్న ఆమె.. వృద్ధాప్య సమస్యల కారణంగా ఈమధ్య సినిమాలకు కాస్త దూరంగా ఉన్న విషయం తెలిసిందే. 1949లో విడుదలైన ‘షావుకారు’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె, ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు.. వందల చిత్రాలలో నటించిన ఆమె ఇలా ఆసుపత్రిలో ఉండడంతో అభిమానులు బాధపడుతున్నారు. ఆమె త్వరగా కోలుకొని ఇంటికి రావాలి అని కోరుకుంటున్నారు. ప్రస్తుతం షావుకారు జానకి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అన్నది త్వరలోనే డాక్టర్లు బులిటెన్ లో వెల్లడించే అవకాశం ఉంది..

Also Read :Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. సుమతి, అరుణ్ రొమాన్స్.. అయ్యో మనోజ్..

Related News

ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న జబర్దస్త్ పవిత్ర.. వీడియో వైరల్!

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. సుమతి, అరుణ్ రొమాన్స్.. అయ్యో మనోజ్..

Karthika Deepam 2 Serial Today Episode August 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపే సుమిత్ర కూతురన్న నిజం చెప్తానన్న జ్యోత్స్న       

Podarillu Today Episode : శైలు మాటతో కన్నీళ్లు.. కేశవను కొట్టిన మాధవ్.. నారాయణను కొట్టిన దుర్గ..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో ప్రేమ ఫీల్.. ధీరజ్, ప్రేమ ఒక్కటవుతారా..?

Brahmamudi Serial Today Episode August 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు వార్నింగ్ ఇచ్చిన రేఖ      

Intinti Ramayanam Today Episode: పల్లవి మాటతో కమల్ ఫిదా.. అడ్డంగా బుక్కయిన అవని.. హైలెట్ ట్విస్ట్ ఇదే..

Big Stories

Advertisement
×