E-Paper
Advertisement

రిలీజ్ కు ముందే కొత్త పల్సర్ 150 లీక్.. డిజైన్‌ అదిరింది భయ్యా!

రిలీజ్ కు ముందే కొత్త పల్సర్ 150 లీక్.. డిజైన్‌ అదిరింది భయ్యా!
Advertisement

Bajaj Pulsar 150 New Model Leak: బజాజ్ ఆటో పల్సర్ సిరీస్‌ లో మరో కీలక అప్‌ డేట్‌ కు సిద్ధమవుతోంది. న్యూ జెనరేషన్ బజాజ్ పల్సర్ 150 మోటార్‌ సైకిల్ విడుదలకు ముందే డీలర్‌ షిప్ దగ్గర కనిపించింది. దీంతో ఈ బైక్ త్వరలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త పల్సర్ 150లో డిజైన్ మార్పులతో పాటు కొత్త ఛాసిస్, మెరుగైన ఇంజన్ లాంటి కీలక అప్‌ డేట్స్ ఉండనున్నాయి.

ఆగస్టు 12న మార్కెట్ లోకి విడుదల

ఇటీవల బజాజ్ కొత్త పల్సర్ 125ను కూడా డీలర్‌షిప్‌ దగ్గర ప్రదర్శించింది. ఇప్పుడు అదే ప్లాట్‌ఫామ్ ఆధారంగా కొత్త పల్సర్ 150ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ రాబోయే నెలల్లో పల్సర్ శ్రేణిలో పలు కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అప్‌ డేట్ చేసిన పల్సర్ N160ను ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

కొత్త ఛాసిస్‌తో రానున్న పల్సర్ 150

Advertisement

కొత్త బజాజ్ పల్సర్ 150లో ప్రధాన మార్పుల్లో ఒకటి దీని కొత్త ఫ్రేమ్. ప్రస్తుతం ఉన్న మోడల్‌లో ఉపయోగిస్తున్న పాత ఛాసిస్‌కు బదులుగా, కొత్త సింగిల్ డౌన్‌ ట్యూబ్ ఫ్రేమ్‌ ను ఇందులో అందించనున్నారు. ఇదే ఫ్రేమ్‌ ను కొత్త పల్సర్ 125లో కూడా ఉపయోగిస్తున్నారు. సస్పెన్షన్ విభాగంలో కూడా మార్పులు కనిపించనున్నాయి. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ కొనసాగుతుండగా, వెనుక భాగంలో కొత్త మోనోషాక్ సస్పెన్షన్‌ ను అందించనున్నారు. ప్రస్తుత పల్సర్ 150లో ఉన్న ట్విన్ షాక్ సెటప్‌ తో పోలిస్తే ఇది మెరుగైన రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ ను అందించే అవకాశం ఉంది.

కొత్త ఆయిల్ కూల్డ్ ఇంజన్

కొత్త పల్సర్ 150లో మరో ముఖ్యమైన మార్పు ఇంజన్ విభాగంలో ఉండనుంది. ప్రస్తుతం ఉన్న పల్సర్ 150లో ఎయిర్ కూల్డ్ ఇంజన్ అందుబాటులో ఉంది. అయితే, కొత్త మోడల్‌లో ఎయిర్ కూలింగ్‌తో పాటు ఆయిల్ కూలింగ్ టెక్నాలజీని కూడా జోడించనున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పు వల్ల ఇంజన్ వేడిని కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అలాగే ఎక్కువ దూరం ప్రయాణించే సమయంలో మెరుగైన పనితీరు అందించే అవకాశం ఉంది. అయితే కొత్త ఇంజన్ పవర్, టార్క్ వివరాలు బయటకు రాలేదు.

కొత్త డిజైన్, అత్యాధునిక ఫీచర్లు

Advertisement

డిజైన్ పరంగా కొత్త పల్సర్ 150లో కీలక మార్పులు రాబోతున్నాయి. కొత్త హెడ్‌లైట్ కౌల్, మరింత స్పోర్టీగా కనిపించే ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్, కొత్త టెయిల్ సెక్షన్ లాంటి మార్పులు ఉండనున్నాయి. పల్సర్‌కు ప్రత్యేక గుర్తింపుగా ఉన్న ట్విన్ LED టెయిల్ లైట్లు కూడా కొనసాగనున్నాయి. ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త కలర్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండే అవకాశం ఉంది. ఇది రైడర్లకు అవసరమైన సమాచారాన్ని మరింత స్పష్టంగా అందించనుంది.

Read Also: KTM 390 అడ్వెంచర్ X ధర పెంపు, ఇప్పుడు కాస్ట్ ఎంత అంటే?

Tags

Related News

హ్యుందాయ్ బేయాన్ బుకింగ్స్ ఓపెన్.. క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV!

ఈ కారు తనంతట తానే రివర్స్ వెళ్తుంది.. టక్సన్ టెక్నాలజీ చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా థార్ OG వచ్చేసింది.. కొత్త మోడల్ లో ఏం మారిందంటే?

హైదరాబాద్‌లో వింత కార్ల మ్యూజియం.. ప్రపంచంలో ఎక్కడా చూడని కార్లు ఇక్కడే!

హోండా నుంచి 3 కొత్త అప్ డేటెడ్ మోడళ్లు.. ధరలు, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

145 కి.మీ రేంజ్ తో హోండా కొత్త ఈవీ.. QC3 లుక్ ఏముంది భయ్యా!

అమ్మకాల్లో బిగాస్ దూకుడు.. లక్షకు చేరువలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త కలర్.. సిగ్నేచర్ వైట్ అదిరిపోయిందిగా!

Big Stories

Advertisement
×