Illu Illaalu pillalu Srivalli : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా ఛానెల్లో ప్రసారమౌతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి.. కొన్ని సీరియల్స్ మంచి రేటింగ్ అందుకోవడంతోపాటుగా.. జనాలను కూడా అలరిస్తూ వస్తున్నాయి కేవలం సీరియల్స్ మాత్రమే కాదు ఆ సీరియల్స్లలో పలు క్యారెక్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి అలాంటి వాటిలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో శ్రీవల్లి క్యారెక్టర్ ఒకటి. ఆ ఇంట్లో తన ఆధిపత్యం కోసం ఏదో ఒకటి చేస్తూ జనాలని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. గత కొన్ని రోజులుగా శ్రీవల్లి క్యారెక్టర్ గురించి నర్మదకు అనుమానం వస్తుంది. ఇది శ్రీవల్లి క్యారెక్టర్ గత కొద్ది రోజులుగా ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నిజంగానే ఈ సీరియల్ నుంచి క్యారెక్టర్ వెళ్ళిపోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చందు కి జోడిగా కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్.. అందులో నిజమేంతో ఒకసారి తెలుసుకుందాం..
ఈ సీరియల్లో శ్రీవల్లి క్యారెక్టర్ ఇకమీదట కనిపించదు అని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పటివరకు ఎన్నో సార్లు శ్రీవల్లి వెళ్ళిపోతుందని వార్తలు వినిపించేయ్ కానీ శ్రీవల్లి ఇప్పటివరకు వెళుతున్నట్టు ఎక్కడ కనిపించలేదు. ఈ మధ్యకాలంలో శ్రీవల్లి క్యారెక్టర్ గురించి పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి.. అయితే ఇప్పుడు శ్రీవల్లి ఇచ్చిన డేట్స్ ప్రకారం ఆమె క్యారెక్టర్ కనిపించకుండా వెళ్ళిపోయే రోజు వచ్చేసింది అని వార్తలు వినిపిస్తున్నాయి. అందులోనూ నర్మదా శ్రీవల్లి బండారు అని బయట పెడతానని శపధం చేసింది కాబట్టి ఇక శ్రీవల్లి క్యారెక్టర్ కూడా కనిపించదు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ సీరియల్లో మరో హీరోయిన్ రాబోతుంది అని ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. త్వరలోనే శ్రీవల్లి క్యారెక్టర్ గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..
సీరియల్ నటి త్రివేణి యాదవ్ నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ అమ్మడు సుందరి అనే సీరియల్ తో తన కెరీర్ని మొదలుపెట్టిన త్రివేణి యాదవ్ ఆ తర్వాత ఒక్కో సీరియల్ తో తన టాలెంట్ నిరూపించుకుంటూ వస్తుంది. ఇకపోతే ఈమె తెలుగు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియలు ఆమె కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. అలాంటి త్రివేణి ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అని గతంలో కూడా చాలాసార్లు వార్తలు వినిపించాయి.. మరి ఇప్పుడు కూడా అదే రూమర్స్ అయి ఉంటాయని ఆమె అభిమానులు కొట్టి పడేస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే త్రివేణి యాదవ్ రోజుకి 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఈ లెక్కన ఈమె సీరియల్ కి దాదాపు నెలకి లక్షల్లోనే తీసుకుంటుంది.. అంతేకాదు ఈమె సోషల్ మీడియా ద్వారా కూడా బాగానే సంపాదిస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.