Telugu Serials : ప్రతిరోజు ప్రేక్షకులను అలరించేందుకు సీరియల్స్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటాయి. ఇటీవల కాలంలో సీరియల్స్ కు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు కూడా టీవీ చానల్స్ పోటీపడి మరి కొత్త కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తుంటాయి.. ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకవైపు స్టార్ మా లో బిగ్ బాస్ షో ప్రారంభం అవడంతో సీరియల్స్ కి డిమాండ్ తగ్గుతుందని అందరూ అనుకున్నారు కానీ కొన్ని సీరియల్స్ కి నిజంగానే డిమాండ్ తగ్గింది. ఇటీవల కాలంలో ప్రసారం పోతున్న ప్రతి సీరియల్ కి కూడా మంచి రేటింగ్ ఉండేది ఇప్పుడు బిగ్ బాస్ వల్ల కూడా సీరియల్స్ రేటింగ్ మాత్రం అస్సలు తగ్గలేదు. మరి కాలస్యం ఎందుకు ఈ వారం టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్స్ కి ఎప్పుడు డిమాండ్ ఉండనే ఉంటుంది. కానీ ఒకవైపు బిగ్ బాస్ కూడా రావడంతో డిమాండ్ కూడా భారీగానే పెరుగుతూ వస్తుంది. మంచి రేటింగ్ ని నమోదు చేసుకుంటున్న సీరియల్స్ తో పోలిస్తే బిగ్ బాస్ కాస్త తేలిపోయిందనే చెప్పాలి. ప్రతిరోజు ప్రసారమవుతున్న సీరియల్స్ కి డిమాండ్ కూడా పెరుగుతూనే ఉంది. ప్రతిరోజు ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఎక్కువగా ఈ మధ్య గుండె నిండా గుడి గంటలు సీరియల్ కి డిమాండ్ పెరుగుతూ వస్తుంది. ఇప్పటికీ పెరుగుతున్న డిమాండ్ ను బట్టి చూస్తే ప్రస్తుతం గుండెనిండా గుడి గంటలు సీరియల్ కి మాత్రమే ఎక్కువ డిమాండ్ ఉందని టిఆర్పి రేటింగ్ చూస్తే తెలుస్తుంది.. ఈమధ్య ఈ సీరియల్ లో అనేక ట్విస్ట్ లు కూడా ఉండటంతో ఈ సీరియల్ కి రేటింగ్ ఎరిగింది వరకు కార్తీకదీపం సీరియల్ టాప్ లో ఉండేది. కానీ ఇప్పుడు ఈ సీరియల్ మొదటి స్థానంలోకి రావడంతో సీరియల్ లవర్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు.. ఇప్పుడు ఈ సీరియల్ టాప్ లోకి రావడంతో మిగతా సీరియల్ పై కాస్త ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ వస్తుంది..
గుండె నిండా గుడి గంటలు సీరియల్ స్టోరీ విషయానికి వస్తే ఇటీవల ప్రతి ఎపిసోడ్లో ఎన్నో ట్విస్టులు చోటుచేసుకున్నాయి.. ముఖ్యంగా రోహిణి బండారం బయటపడిన తర్వాత కొత్త కొత్తగా నిజాలు అన్నీ కూడా బయటకు వచ్చేసాయి. మోహిని ఎప్పుడైతే మలేషియా నుంచి రాలేదని ప్రభావతి తెలుసుకుందో అప్పటినుంచి రోహిణికి ఎప్పుడు ఊహించని విధంగా ప్రభావతి ట్రీట్మెంట్ చేస్తూ వస్తుంది.. గత కొంతకాలంగా రోహిణి చేసిన తప్పులు మీద తప్పులు ఒక్కసారిగా బయటపడడంతో ఇంట్లోని వాళ్ళు కూడా రోహిణికి దూరంగానే ఉంటూ వస్తున్నారు. రోహిణి గురించి తెలిసిన తర్వాత మనోజ్ పూర్తిగా తనని దూరం పెట్టేసాడు. మరోవైపు మీనా కి వచ్చిన ఆర్డర్లను ప్రభావతి ఎలాగైనా సరే దూరం చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఈ సీరియల్ ఇప్పుడిప్పుడే ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా మారుతూ వస్తుంది. మరి నెక్స్ట్ వీక్ ఏ సీరియల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుందో చూడాలి…
Also Read :ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఆ రెండు సీరియల్స్ అవుట్..