E-Paper
Advertisement

టెస్లాకు చైనా షాక్.. 43 లక్షల కార్ల రీకాల్, అసలేం జరిగిందంటే?

టెస్లాకు చైనా షాక్.. 43 లక్షల కార్ల రీకాల్, అసలేం జరిగిందంటే?
Advertisement

Tesla recall China: చైనాలో టెస్లా సహా పలు ప్రముఖ వాహన తయారీ సంస్థలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రమాదాల సమయంలో వాహనాల్లో చిక్కుకున్న ప్రయాణికులు బయటకు రావడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో దాదాపు 43 లక్షల వాహనాలను రీకాల్ చేస్తున్నారు. టెస్లా ఒక్కటే దాదాపు 30 లక్షల కార్లను వెనక్కి పిలిపించనుంది. ఈ చర్యలతో వాహన భద్రతపై చైనా ప్రభుత్వం ఎంత కఠినంగా ఉంటుందో అర్థం అవుతోంది.

టెస్లా సహా 9 కంపెనీలపై చర్యలు

చైనాలో చేపట్టిన ఈ రీకాల్‌ లో టెస్లాతో పాటు మరో ఎనిమిది కంపెనీలు ఉన్నాయి. వీటిలో షియోమీ, లీప్‌ మోటార్, ఎక్స్‌ పెంగ్, గీలీ హోల్డింగ్ లాంటి సంస్థలు కూడా ఉన్నాయి. మొత్తం మీద సుమారు 43 లక్షల వాహనాలు రీకాల్ ఎఫెక్ట్ ను ఎదుర్కోనున్నాయి. రీకాల్‌లో భాగంగా కొన్ని కార్లకు సాఫ్ట్‌ వేర్ అప్‌డేట్లు ఇవ్వనున్నారు. మరికొన్ని వాహనాల్లో వార్నింగ్ స్టిక్కర్లు, అత్యవసర డోర్ హ్యాండిల్స్‌ కు స్పష్టమైన గుర్తులు ఏర్పాటు చేయనున్నారు. సమస్యను బట్టి తయారీదారులు వేర్వేరు పరిష్కారాలను అందించనున్నారు.

టెస్లా రీకాల్ ఎంత పెద్దదంటే?

Advertisement

మొత్తం రీకాల్‌ లో టెస్లా వాటా చాలా ఎక్కువగా ఉంది. చైనాలో తయారైన, అలాగే దిగుమతి చేసుకున్న దాదాపు 2.98 మిలియన్ల మోడల్ 3, మోడల్ వై, మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ వాహనాలు ఇందులో ఉన్నాయి. ఈ రీకాల్ సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభం కానుంది.  తీవ్రమైన ప్రమాదం, విద్యుత్ వ్యవస్థలో లోపం ఏర్పడిన తర్వాత మెకానికల్ ఎమర్జెన్సీ డోర్ రిలీజ్ హ్యాండిల్స్‌ ను గుర్తించడం కష్టంగా మారే అవకాశం ఉందని టెస్లా తెలిపింది.  అలా జరిగితే కారులో ఉన్నవారు బయటకు రావడం, బయట ఉన్న రక్షణ సిబ్బంది లోపలికి చేరుకోవడం కష్టమవుతుంది. ఈ సమస్యను తగ్గించేందుకు టెస్లా హెచ్చరిక లేబుల్స్‌తో పాటు సాఫ్ట్‌ వేర్ అప్‌డేట్ ఇవ్వనుంది. ప్రమాదం తర్వాత కారు కిటికీలు ఆటోమేటిక్‌గా కిందకు దిగేలా సాఫ్ట్‌ వేర్‌లో మార్పులు చేయనున్నట్లు సమాచారం.

చైనాలో డోర్ హ్యాండిల్స్‌ పై కొత్త నిబంధనలు

వెహికల్ భద్రత విషయంలో చైనా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. 2027 నుంచి వాహనం బయట కనిపించకుండా ఉండే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ ను నిషేధించే ప్రణాళికను ప్రకటించింది. టెస్లా కార్ల ద్వారా ఈ డిజైన్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ తర్వాత పలు చైనీస్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాయి. అయితే, అత్యవసర సమయంలో వీటిని గుర్తించడం, తెరవడం కష్టమవుతుందనే కారణంతో ఇప్పుడు ఈ డిజైన్‌పై ఆంక్షలు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Advertisement

Read Also: కొనుగోలుదారులకు టాటా బిగ్ షాక్.. సెప్టెంబర్ 1 నుంచి ధరలు పెంపు!

Tags

Related News

స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవే!

BE 07 TO విజన్ T.. మహీంద్రా నుంచి రాబోతున్న పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ SUVలు ఇవే!

హోండా కార్లపై అక్టోబర్‌ లో అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.2.34 లక్షల తగ్గింపు!

మారుతి స్విఫ్ట్‌ లో కొత్త టర్బో ఇంజిన్.. కళ్లు చెదిరే పవర్‌ తో మార్కెట్ లోకి ఎంట్రీ!

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!

టాటా కార్లపై కళ్లు చెదిరే అక్టోబర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల బెనిఫిట్!

Big Stories

Advertisement
×