Bathukamma Songs Views:తెలంగాణలో బతుకమ్మ పండగ మొదలు అవడంతో సోషల్ మీడియాలో బతుకమ్మ పాటలు ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సందర్భంగా ఇప్పటివరకు యూట్యూబ్ లో వచ్చిన పాటల్లో ఏవి ఎక్కువ వ్యూస్ కొల్లగొట్టాయంటూ ఆరాలు తీస్తున్నారు ఫోక్ లవర్స్ . మరి ఇప్పటివరకు ఎవరి పాటలు ఎక్కువ వ్యూస్ కొల్లగొట్టాయో, ఎవరి పాటలు ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాయో ఒకసారి చూద్దాం.
మంగ్లీ బతుకమ్మ పాట దాదాపు 12 కోట్ల వ్యూస్
ముఖ్యంగా బతుకమ్మ పాటలు అనగానే మనందరికీ వినిపించే పేరు మంగ్లీ. మంగ్లీ పాడిన బతుకమ్మ పాటలకు సోషల్ మీడియాలో ఎలాంటి క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. దీంతో బతుకమ్మ పండుగ వచ్చింది అంటే మంగ్లీ నుంచి కచ్చితంగా ఒక పాట రావాల్సిందే .ఇక పాట సోషల్ మీడియాలో ఇలా వదలగానే ఇలా మిలియన్ల వ్యూస్ కొట్టేస్తుంది కూడా. ఇక ఇప్పటివరకు యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన బతుకమ్మ పాటలు విషయానికొస్తే 2017 లో రిలీజ్ అయిన మంగ్లీ బతుకమ్మ పాట దాదాపు 12 కోట్ల వ్యూస్ కొల్లగొట్టిందని తెలుస్తోంది.
ఈ పాటని మంగ్లీ ,సాకేత్ పాడగా ఎంత పెద్ద వైరల్ అయిందో చెప్పక్కర్లేదు. ”ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి” అనే లిరిక్స్ తో వచ్చిన ఈ పాట అప్పట్లో ఒక సంచలనం అని చెప్పాలి . ఇక బతుకమ్మ పండగ వచ్చిన ప్రతిసారి ఈ పాట గ్రామ గ్రామాన మార్మోగిపోతుంది కూడా.
”అల్లిపూల వెన్నెల ” బతుకమ్మ పాట దాదాపు 23 మిలియన్ల న్యూస్
ఇక మంగ్లీ తర్వాత బతుకమ్మ పాటల గురించి టాపిక్ వస్తే కైలాష్ ఖేర్ ,అంతడుపుల రమాదేవి పాడిన ”అల్లిపూల వెన్నెల ” బతుకమ్మ పాట దాదాపు 23 మిలియన్ల న్యూస్ ని కొల్లగొట్టి రెండో స్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మూడో స్థానంలో ”v6 ఆధ్వర్యంలో వచ్చిన ఊరు ఊరే పూల డొంక” అనే పాట ని గోరేటి వెంకన్న రాయగా కార్తీక్ కొడగండ్ల ,సింధుజ శ్రీనివాసన్ పాడారు. ఈ పాట దాదాపు 68 లక్షల వ్యూస్ కొల్లగొట్టడం విశేషం.
”రంగురంగుల పోలిగా మారి” అనే పాట ఏకంగా 62 లక్షల వ్యూస్
ఇక బతుకమ్మ పాటలు అనగానే మధుప్రియ పేరును కూడా ప్రస్తావించాల్సిందే ప్రియ పాడిన బతుకమ్మ పాటలు కూడా యూట్యూబ్లో లక్షలాది వ్యూస్ ని కొల్లగొట్టాయి .ఈమె పాడిన ”రంగురంగుల పోలిగా మారి” అనే పాట ఏకంగా 62 లక్షల వ్యూస్ ని కొల్లగొట్టడం విశేషం. ఇక మధు ప్రియ అనే పాడిన ”పొద్దు గూడ బతుకమ్మ” అనే పాట 11 లక్షలు అలాగే మరో బతుకమ్మ పాట 14 లక్షలు కొల్లగొట్టడం విశేషం.
పాటలకు దక్కుతున్న ఆదరణ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్
మొత్తంగా చూస్తే యూట్యూబ్లో బతుకమ్మ పాటలు వస్తున్న ఆదరణ చూస్తుంటే తెలంగాణ ఫోక్ మ్యూజిక్ కి ,అందునా బతుకమ్మల పాటలకి మంచి గుర్తింపు లభిస్తున్నట్టు తెలుస్తుంది. మంగ్లీ పాటలకు, మధుప్రియ పాటలకు దక్కుతున్న ఆదరణ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పాలి!
ALSO READ :సినిమాల్లో నల్గొండ గద్దర్ హవా.. ఒక్క పాటకు ఎంత తీసుకుంటాడంటే?